Home News Bandla Ganesh : ఆ కేసులో బండ్ల గణేష్ కి ఒక ఏడాది జైలు శిక్ష...

Bandla Ganesh : ఆ కేసులో బండ్ల గణేష్ కి ఒక ఏడాది జైలు శిక్ష విధించిన కోర్ట్..

bandla-ganesh-one-year-jail-sentence-by-court-in-cheque-bounce

Bandla Ganesh : ఒంగోలు న్యాయస్థానం ఈరోజు బండ్ల గణేష్ కి పెద్ద షాక్ ఇచ్చింది. తన పై నడుస్తున్న చెక్ బౌన్స్ కేసు పై ఈరోజు తీర్పు వెల్లడిస్తూ కోర్ట్ బండ్ల గణేష్ కు ఏడాది శిక్ష తో పాటు 95 లక్షల జరిమానా విధించింది. అసలు ఎం జరిగింది అంటే ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దెగ్గర బండ్ల గణేష్ 95 లక్షలు అప్పుగా తీసుకున్నాడు, ఇది 2019లో జరిగింది.

See also  Unstoppable With NBK: షో లో టాప్ 5 అత్యధికమైన వ్యూస్ వచ్చిన ఎపిసోడ్స్ ఇవే...

కొన్ని నెలల తరువాత బండ్ల గణేష్ వెంకటేశ్వర్లు కి 95 లక్షల చెక్ ఇచ్చాడు. వెంకటేశ్వర్లు ఆ చెక్ కాస్త బ్యాంకు లో వేయగా అది బౌన్స్ అయ్యింది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఆర్ధికంగా గొడవలు కోర్ట్ లో వాదనల నడుస్తున్నాయి. ఇద్దరి తరుపు వాదనలు విన్న తరువాత కోర్ట్ లో బండ్ల గణేష్ కి వ్యతిరేకంగా సాక్షాలు బలంగా ఉండటంతో కోర్ట్ ఈరోజు బండ్ల గణేష్ కి ఒక ఏడాది జైలు, 95 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా కోర్ట్ ఖర్చులు కూడా బండ్ల గణేష్ ఏ భరించాలి అని తెలియచేసింది.