Home News తెలంగాణ బిజెపిలో తెరవెనుక కీలక బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ యువకుడు..

తెలంగాణ బిజెపిలో తెరవెనుక కీలక బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ యువకుడు..

మోడీ ఆశీస్సులతో రానున్న 2026 రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి తరపున నామినేట్ కాబోతున్న “షాడో ఏజెంట్ ఆఫ్ మోడీ గా” పిలవబడే చంద్ర కిరణ్ రెడ్డి . అసలు ఎవరీ చంద్ర కిరణ్ రెడ్డి ? రాజకీయాల్లో ఆక్టివ్ గా లేని 28 ఏళ్ల వయస్సుగల ఈ యువకుడికి ఇంత గొప్ప గుర్తింపు ఎలా వచ్చింది అని మీకు సందేహం కలగవచ్చు . ఒకసారి ఆయన గురించి స్పష్టంగా తెలుసుకుందాం .చంద్ర కిరణ్ రెడ్డి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి గత ఐదేళ్లుగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందవేస్తున్నారని సమాచారం . ఈయన అందించిన సమాచారం ఆధారంగానే తెలుగు రాష్ట్రంలో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తన సన్నిహితులు మరియు పార్టీ వర్గాల నుండి సమాచారం. మిషన్ సౌత్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువకులను పార్టీ గుర్తించి వారికి పదవులను అందించి లక్ష్యాలను నిర్దేశించింది . ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వాసి అయిన చంద్ర కిరణ్ రెడ్డి పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తించిన మోడీ గారు ఈయన్ని రానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో కార్పోరేషన్ చైర్మన్ గా నియమించి ఈ పదవి ద్వారా ప్రజా సమస్యలను తీర్చేందుకు మరియు సమకాలిన రాజకీయాలలోకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నారట . ఈయనతో పాటు తెలుగు రాష్ట్రంలో మరో ముగ్గురు యువకులను ఎంపిక చేసినట్టు సమాచారం . మరో రెండు నెలలు అనగా జూన్ 12న అధికారకంగా చంద్ర కిరణ్ రెడ్డి మరియు మిగతా ముగ్గురు యువకుల పేర్లు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది .