Home News వెల్లం బల్లి కుడితలో పడిదిందా? ఈ కష్టాలు ఏంటో అంటూ కన్నీళ్లు..

వెల్లం బల్లి కుడితలో పడిదిందా? ఈ కష్టాలు ఏంటో అంటూ కన్నీళ్లు..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కొన్ని అసెంబ్లీ స్థానాలపై మాత్రం గట్టి చర్చే జరుగుతుంది. అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి ఎదుర్కొన్న బోండా ఉమాకు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీటు ఖరారు చేశారు.

ఈ సీటు ముందు నుంచి బోండాకే అనుకున్నా మధ్యలో రెండు మూడు పేర్లు వినిపించాయి. ఓటమి తర్వాత ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బోండా ఉమా బాగానే కష్టపడ్డారు. ఎంపీ కేశినేని నానీతో ఆయనకు విభేదాలు వచ్చినా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు. దీనితో చంద్రబాబు మరో ఆలోచన లేకుండా మొదటి దశలోనే సీటును ఖరారు చేసేసారు.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

ఇక తన పేరుని అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఉమా దూకుడు పెంచారు. ఆయన అభిమానులు, అనుచరులు. నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకుండానే నియోజకవర్గంలో ఎన్నికల సందడి ఊపు అందుకుంది.

ఇప్పుడు ఇదే వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అంటున్నారు. చంద్రబాబు, బోండా ఉమా పేరు ప్రకటించగానే… ఉమాకు అభినందనలు చెప్పడానికి కార్యకర్తలు, అభిమానులతో పాటుగా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందడి దాదాపు రెండు రోజుల పాటు కొనసాగింది.

ఆ తర్వాత విరామం లేకుండా ఉమా ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఎలాగైనా గెలవాలి అనే ఆలోచనతో కాకుండా భారీ మెజారిటీ లక్ష్యంగా పెట్టుకుని ఉమా పని చేయడంతో వెల్లంపల్లి డీలా పడిపోయారట. గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసిన ఉమా… లోపాల మీద దృష్టి సారించి దూకుడుగా ముందుకు వెళ్లడం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవడం, వెల్లంపల్లి చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇప్పుడు అటు వైసీపీ నేతలను కూడా కలవరపెడుతుంది.

See also  Jabardasth : జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్.. అమ్మాయిని వేధించి..

కేశినేని నానీ పార్టీ మారడంతో ఆయన అభిమానులు వైసీపీ వైపు వస్తారని వెల్లంపల్లి అంచనా వేశారు. కానీ బోండా ఉమా దూకుడు దెబ్బకు అది తలకిందులు అయింది. వెల్లంపల్లికి సీటు ఇవ్వడంతో మల్లాది విష్ణు అనుచరులు, అభిమానులు కూడా సైలెంట్ గా బోండాకు జై కొడుతున్నారు. మంత్రిగా సంపాదించింది మొత్తం ఎలా అయినా ఖర్చు పెట్టి గెలవాలని భావిస్తున్న వెల్లంపల్లికి కనీసం సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా మద్దతు రావడం లేదని అంటున్నారు.

దీనితో ఆయన డీలా పడిపోయారని అలాగే తన సన్నిహితుల వద్ద పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. తనను ఎందుకు ఇక్కడికి పంపారని, ఏ విధంగా కూడా పరిస్థితులు కలిసి రావడం లేదని, తనకు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇక్కడ లేదని, పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారట వెల్లంపల్లి. ఇక క్షేత్ర స్థాయిలో తన అనుచరులతో ఆయన కొంత సమాచారం కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారట.

See also  విజయ్ ని నమ్మి 100 కోట్లు ఇచ్చావ్.! ఇప్పుడు ఏం లాభం.?

అందులో కూడా ఆశించిన విధంగా పరిస్థితి లేదని తెలిసిందని సమాచారం. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం సెంట్రల్. అలాగే చిరు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇక్కడ విస్తృతంగా ఉంటుంది. వాళ్ళు అందరూ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, సత్యనారాయణ పురం బ్రాహ్మణ వర్గం కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉందని తెలియడంతో వెల్లంపల్లి మరింత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది.