Home News క్యాడ్బరీ డైరీ మిల్క్ లో పురుగులు.. వైరల్ అవుతున్న దృశ్యాలు..

క్యాడ్బరీ డైరీ మిల్క్ లో పురుగులు.. వైరల్ అవుతున్న దృశ్యాలు..

worms in cadbury dairy milk

Hyderabad : క్యాడ్బరీ అనేది ఎంత పెద్ద బ్రాండ్ మన అందరికి తెలుసు. ఎంత పెద్ద కంపెనీ అయినా అప్పుడప్పుడు జరగకూడని తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సారి చాల పెద్ద తప్పే జరిగింది. హైదరాబాద్ కు చెందిన రాబిన్ ఫిబ్రవరి 9న అమీర్ట్ప్ట్ మెట్రో స్టేషన్ లోనే రత్నదీప్ సూపర్ మార్కెట్ లో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడు.

కొన్న చాక్లెట్ లో తింటూ ఉండగా ఒక పురుగు రాబిన్ కంట పడింది. ఏంటి అని చూడగా నిజంగానే ఒక పురుగు చాక్లెట్ వెనక పాకుతూ కనిపించింది. వెంటనే ఫోటో తీసి ట్విట్టర్ లో క్యాడ్బరీ కంపెనీ వారిని టాగ్ చేసి పోస్ట్ చేసాడు. వెంట ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది, ఇక క్యాడ్బరీ కంపెనీ వాలు ఇది చూసి ఆ పోస్ట్ పై స్పందించారు.