Home News Unstoppable With NBK: షో లో టాప్ 5 అత్యధికమైన వ్యూస్ వచ్చిన ఎపిసోడ్స్ ఇవే…

Unstoppable With NBK: షో లో టాప్ 5 అత్యధికమైన వ్యూస్ వచ్చిన ఎపిసోడ్స్ ఇవే…

Unstoppable With NBK: ఆహా మీడియా ద్వారా ప్రసారమవుతున్న నందమూరి బాలకృష్ణ గారి అన్ష్టాపబుల్ విత్ ఎన్ బి కే షో పెద్ద సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. అయితే మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని, రెండవ సీజన్ కూడా అతి పెద్ద బ్లాక్ పాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. రెండవ సీజన్ లో చివరి ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఫిబ్రవరి 2 తారీకు విడుదల చేయగా రెండవ భాగం ఫిబ్రవరి 10వ తారీకు విడుదలయ్యింది.

here-are-the-most-watched-episodes-of-balakrishnas-unstoppable

ఇదిలా ఉండగా ఈ షో కి ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి బాలకృష్ణ తో పాటు ఈ షోలో పాల్గొని దేశంలోనే అతిపెద్ద టాక్ షోగా ఈ షో నిలిచింది. ఈ అతిపెద్ద టాక్ షోలో మరి టాప్ ఫైవ్ వ్యూస్ సాధించిన ఎపిసోడ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము… ప్రస్తుతానికైతే మాత్రం అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ప్రభాస్ ఎపిసోడ్. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి టెలికాస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

See also  విజయ్ ని నమ్మి 100 కోట్లు ఇచ్చావ్.! ఇప్పుడు ఏం లాభం.?

here-are-the-most-watched-episodes-of-balakrishnas-unstoppable

దాని తర్వాత సెకండ్ స్థానంలో ఉంది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ దీనిని కూడా రెండు భాగాలుగా విభజించి మొదటి భాగంలో తన సినిమాల, కెరియర్ గురించి రెండవ ఎపిసోడ్లో తన రాజకీయం, వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఇక మూడో స్థానంలో సీజన్ వన్ లో గ్రాండ్ ఫినాలేకి వచ్చిన మహేష్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ద్వారానే ఆహా ఇండియాలో టాప్ టెన్ లిస్ట్ లోకి అడుగు పెట్టింది. ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వచ్చేవరకు ఈ ఎపిసోడ్ కి అత్యధికమైన వీక్షణాలున్నాయి అని ఆహ మీడియాలో కనిపిస్తుంది.

See also  Nellore MCA student: ఎంసిఏ స్టూడెంట్.. కన్నబిడ్డని ఎందుకు ఎలా చంపిందో తెలిస్తే అసహ్యించుకుంటారు..

here-are-the-most-watched-episodes-of-balakrishnas-unstoppable

ఇక నాలుగో స్థానంలో చంద్రబాబు నాయుడు ఎపిసోడ్, 5వ స్థానంలో బ్రహ్మానందం ఎపిసోడ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మొదటి ఎపిసోడ్ కి 14 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని, అదే ప్రభాస్ ఎపిసోడ్ కి ఆ రేంజ్ వ్యూస్ రావడానికి 48 గంటలు పట్టిందట. ఇక పవన్ కళ్యాణ్ రెండో ఎపిసోడ్ కి మొదటి భాగం కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని అప్లోడ్ చేసిన నిమిషాలనే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది మొత్తం మీద అత్యధిక వ్యూస్ వచ్చిన ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ కి వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు…