Home Cinema Megastar Chiranjeevi: ప్రేమికుల రోజున తన సతీమణీ తో కలిసి ట్రిప్ కి ప్లాన్ చేసిన...

Megastar Chiranjeevi: ప్రేమికుల రోజున తన సతీమణీ తో కలిసి ట్రిప్ కి ప్లాన్ చేసిన మెగాస్టార్.. ఎక్కడికి వెళ్తున్నారు అంటే..

megastar-chiranjeevi-going-on-vacation-with-wife-on-occasion-of-valentines-day

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కబోతున్న విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు మాత్రం శర వేగంగా ముందుకు సాగుతున్నాయి. అయితే మెగాస్టార్ కి కాస్త హాలిడే బ్రేక్ అయితే పడింది అని చెప్పాలి. ఇక ఈ హాలిడే బ్రేక్ అనంతరం మెగాస్టార్ తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ షూటింగ్ పనులు మొదలు పెడతామని వెల్లడించాడు చిరు. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటించగా.

See also  Renu Desai : రేణుదేశాయ్ రెండవ పెళ్లి ఎప్పుడో చెప్పేసింది.. ఎవరితో అనేది తెలిసిపోతుంది..

megastar-chiranjeevi-going-on-vacation-with-wife-on-occasion-of-valentines-day

ఈ చిత్రానికి సంగీతం చేకూరుస్తుంది ఎం ఎం కీరవాణి. కాగా 2025 జనవరి 10వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అవ్వనుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులకు ఒక శుభవార్త అయితే తెలియజేశాడు. ప్రేమికుల రోజు (Valentines Day) సందర్భంగా తన భార్య సురేఖతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు.

megastar-chiranjeevi-going-on-vacation-with-wife-on-occasion-of-valentines-day

ఆ ట్రిప్ హ్యాపీ మూమెంట్లో భాగంగా చిరు తన అభిమానులతో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. నా బెటర్ ఆఫ్ సురేఖతో ఓ చిన్న సెలవు కోసం అమెరికా బయలుదేరాను. తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభరా చిత్రం యొక్క షూటింగ్ పనులను ప్రారంభిస్తాను. మీ అందరిని తప్పకుండా కలుస్తానంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ అయితే చేశాడు. ఇదే కాకుండా తన అభిమానులందరికీ ప్రేమికుల రోజు (Valentines Day) శుభాకాంక్షలు అంటూ చిరంజీవి తన భార్యతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.