Home Health సొరక్కాయ తినడం వల్ల కలిగే ఉపయోగాలు.

సొరక్కాయ తినడం వల్ల కలిగే ఉపయోగాలు.

సొరక్కాయ తినడం వల్ల కలిగే ఉపయోగాలు.

సొరక్కాయను అనపకాయ అని కూడా పిలుస్తారు. మన ఊళ్ళలో ఐతే ప్రతీ ఇళ్ళలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రతీ ఇంటిపై సొర తీగ పాకుతూనే ఉంటుంది, ఖచ్చితంగా సొరక్కాయలు కాస్తుంటాయి. సొరక్కాయ పప్పులకు సూపర్ ఉంటది. మన సైడ్ ఐతే సొరక్యాయ ప్రత్యేకించి వండడం కంటే పప్పులో వేసి వండుతుంటారు. ఈ సొరక్కాయలో అధిక శాతం నీరు ఉంటుంది ఇది తింటే మన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.

See also  నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?

సొరక్కాయలను ఒక్కో దగ్గర ఒక్కో పేరు పెట్టి పిలుస్తాము మన దగ్గర సొరక్కాయ లేదా అనపకాయ తమిళంలో సొర, మళయాలంలో చొరె, కన్నడంలో సొరె, హిందీలో ఆల్ ఖద్దు లేదా లౌకీ మరియు సంస్కృతములో ఆలాబు, ఆంగ్లములో బాటిల్ గార్డ్ అంటారు. మన దేశంలో ఈ సొరక్కాయ వేదకాలమునుండే సాగులో ఉందట, మన పూర్వీకులు పొలాల దగ్గరికి నీళ్ళు తీసుకువెళ్ళడానికి పొడువాటి సొరక్కాయ బుర్రలను ఉపయోగించేవాళ్ళు, ఇవి నేచురల్ వాటర్ బాటిల్ గా, నేచురల్ మినీ కూలర్ గా ఉపయోగించేవాళ్ళు.

See also  Fatty Liver: వారానికి ఇదొక్కటి రెండున్నర గంటలు చేస్తే చాలు లివర్ ఫ్యాట్ ఇట్టే మాయం...

సొరక్కాయలతో మనం సొరక్కాయ వడియాలు, సొరక్కాయ పప్పు, సొరక్కాయ పులుసు, సొరక్కాయ టమాట కూర మరియు సొరక్కాయ సాంబారు మొదలైన కూరల్లో ఉపయోగిస్తారు.

  • సొరక్కాయలు తినడం వల్ల ఆరోగ్యం వృధ్ధి చెందుతుంది.
  • సొరక్కాయలు మన శరీరానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. తద్వారా మన శరీరంలో వేడి బయటకు పంపిచబడి మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఇది మన మెదడుకు చాలా మంచిది.
  • నువ్వుల నూనెతో దీనిని వేపుడు చేసి తింటే నిద్రలేమితో బాధపడేవారికి విముక్తి.
  • మలబద్దకం, మూత్రనాళాల మరియు కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు సొరక్కాయ చాలా మంచి చేస్తుంది.
  • గుండెకి సంబంధించిన వ్యాధుల పరిష్కారానికి సొరక్కాయ మంచిది.
  • పురుషులు సొరక్కాయ గింజలను వేయించుకుని ఉప్పు ధనియాల పొడి జిలకర కలిపి నూరి అన్నంలో వేసుకుని తింటే చాలా మంచిది.
  • సొరక్కాయ జ్యూస్ కూడా తాగవచ్చు కానీ వైద్యుల సహయ సూచనలతో దాని గురించి తెలుసుకొని తాగడం మంచిది.