Home Health Fatty Liver: వారానికి ఇదొక్కటి రెండున్నర గంటలు చేస్తే చాలు లివర్ ఫ్యాట్ ఇట్టే...

Fatty Liver: వారానికి ఇదొక్కటి రెండున్నర గంటలు చేస్తే చాలు లివర్ ఫ్యాట్ ఇట్టే మాయం…

Fatty Liver: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం యొక్క పని రక్తంలోని గ్లూకోజ్ ను స్థిర స్థాయిలో ఉంచడం, రక్తాన్ని శుద్ధి చేయడం, అలాగే ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడడం వంటి పనులను చేస్తుంది. మన శరీరంలో ప్రతి భాగంలో కొవ్వు పేరుకుంటుంది అలాగే కాలేయం కణాల్లో కూడా కొవ్వు ఏర్పడుతుంది. ఇది మితంగా ఉంటే పరవాలేదు కానీ మితిమీరితేనే కాలేయం కరాబ్ అవుతుంది. అలా జరిగితే రకరకాల జబ్బులు, జన్యు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ వంటి రకరకాల వ్యాధులు కాలేయానికి కొవ్వు పట్టడంతో వస్తాయి. దీనినే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.

do-this-things-to-say-bye-bye-to-fatty-liver

మధుమేహం, ఊభకాయంతో బాధపడేవాళ్లకు ముప్పు ఎక్కువే. అధికంగా బరువు ఉండేవారిలో 75%, తీవ్ర ఊభాకాయుల్లో 90% నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కనిపిస్తుందంట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే.. కాలేయానికి కొవ్వు పడితే అది అందరికీ దెబ్బ తినాలనేమి ఉండదు. కాకపోతే కాలేయం లో కణాలు దెబ్బ తింటాయి. దీన్నే నాన్ ఆల్కహాలిక్ స్టిటో హైపటైటిస్ అంటారు. ఇది ఎక్కువగా ముదిరితే సిరోసిస్ అనే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కూడా అధికమైతే కాలేయం విఫలమవుతుంది లేదా క్యాన్సర్ కి దారితీస్తుంది.

See also  రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచిదేనా.? అయితే పాలు ఎప్పుడు తాగితే మంచిది.?

do-this-things-to-say-bye-bye-to-fatty-liver

పెన్ స్టేట్స్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం వారానికి దాదాపు రెండున్నర గంటల పాటు మితమైన, తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం అనేది చేయడం వలన కాలేయంలోని కొవ్వు కచ్చితంగా తగ్గనున్నట్లు తేలింది. కాలయంలోని కొవ్వు తగ్గించడంలో శారీరకమైన శ్రమ ప్రయోజనకరంగా ఉంటదని చాలా పరిశోధనలు చెప్పినా ఎంత సమయం వరకు వ్యాయామం చేయాలనేది ఏ అధ్యయనంలో చెప్పలేదు. కానీ తాజాగా చేసిన ఈ అధ్యాయం ద్వారా వారానికి రెండున్నర గంటల పాటు ఏరోబిక్ వ్యాయామం చేస్తే లివర్ లోని కొవ్వు తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

See also  నల్ల ఎండు ద్రాక్షలో ఎన్ని లాభాలో...

do-this-things-to-say-bye-bye-to-fatty-liver

మరి మన కాలేయం జబ్బు చేసిందని కాలయానికి కొవ్వు పట్టిందని తెలుసుకోవడం ఎలా అదే చూద్దాం ఇప్పుడు. సాధారణంగా ఏదో ఒక అనారోగ్యమైనప్పుడు రక్తపరీక్షలు చేస్తాం అప్పుడు కాలానికి కొవ్వు పట్టినట్లు లేదా జబ్బు చేసినట్లు తెలిసిపోతుంది. కాలేయ పనితీరు తెలిపే రక్త పరీక్షలు స్కానింగ్లు ఉంటాయంట వాటితో నిర్ధారించుకోవచ్చట. అయితే నాష్ నాన్ ఆల్కహాలిక్ స్టిటో హైపర్టైటిస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే మాత్రం కాలేయంలో కొంత భాగాన్ని తీసి పరీక్షించాల్సి వస్తుందట దాన్నే బయాప్సి అంటారు అంట అయితే ఈ బయాప్సి ప్రక్రియ చాలా కష్టం ఒకవేళ ఈ బయాప్సీ చేసినా కూడా 100% బయట పడుతుందనేది నమ్మకం లేదట. అందుకే అధునాతన స్కాన్ పరీక్ష పద్ధతిలో కాలేయం పై పేరుకుపోయిన కొవ్వు లో వాటిని గుర్తిస్తారట.

See also  Rice Cooker: ఎలక్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుకుని తింటే..?? ఈ ప్రమాదంలో పడ్డట్టే.!!!

do-this-things-to-say-bye-bye-to-fatty-liver

కాలయానికి ఒకవేళ కొవ్వు పడితే మనమేం చేయాలి.? ఇప్పుడు చూద్దాం.. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానం మద్యపాన జోలికి వెళ్లకూడదు. బయట దొరికే కూల్డ్రింక్స్ స్పోర్ట్స్ లింకులు తాగొద్దు. కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా వాటిని కడిగిన తర్వాతే వండుకొని తినాలి. నూనె పదార్థాలు తగ్గించుకోవాలి. మంచి పౌష్టి పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి.