Home Health విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలేమిటి.! ఏం తింటే మంచిది.

విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలేమిటి.! ఏం తింటే మంచిది.

విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలేమిటి.! ఏం తింటే మంచిది.

  • విటమిన్ డి లోపం తలెత్తితే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. న్యాచురల్ గా వచ్చే విటమిన్ డి ని మాత్రమే తీసుకోవాలి, ట్యాబ్లెట్ల రూపంలో అవసరమైతే తప్ప తీసుకోకూడదు సూర్యరశ్మిలో విటమిన్ డి చాలా అధికంగా ఉంటుంది అందువల్ల ఎండలో పది నుండి పదిహేను నిమిషాల సమయం  నిలబడి విటమిన్ డి ని పొందండి.

వెజిటేరియన్ లో విటమిన్ డి ఉండే ఆహర పదార్ధాలు పాలు, పెరుగు, పన్నీరు, మష్రూమ్స్ లాంటి పదార్ధాలలో అధికంగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉండి శాఖాహరులుగా ఉండే శాఖాహర ప్రియులకు విటమిన్ డి లోపం పూర్తి చేసేందుకు ఈ ఆహర పదర్ధాలను మన డైట్ తో యాడ్ చేసుకోవాలి. అలాగే ఆరంజ్, అరటిపండ్లు, బొప్పాయిలు విటమిన్ లో కీలక పాత్ర వహిస్తుంది.

See also  Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

సూర్యరశ్మి విటమిన్ డి కు మూలాధారం, సూర్యరశ్మిలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. నిత్యం 10-15 నిమిషాలు ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి లోపం అధిగమించవచ్చు. ఎముకలు బలంగా ఉంటాయి, జాయింట్లలో నొప్పులనుండి ఉపశమనం పొందవచ్చు.

నాన్ వెజ్ లో విటవిన్ డి అధికంగా చేపల్లో, గుడ్లల్లో ఉంటుంది. సాల్మన్ ఫిష్, ట్యానా ఫిష్లలో పెద్దమొత్తంలో విటమిన్ డి ఉంటుంది. వెజ్ ఆహరంతో పోలిస్తే నాన్ వెజ్ లో అధికంగా విటమిన్ డి ఉంటుంది.

See also  కిడ్నీలు రాళ్ళు ఏర్పడితే ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తినకూడదు

విటమిన్ డి లోపం ఎక్కువ అయితే అస్టియోపోరోసిస్ వంటి త్రీవ్రమైన వ్యాదికి దారి తీస్తుంది. ఫలితంగా, వీపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎక్కువగా ఇది ఆడవాళ్ళలో, ముసలివాళ్ళలో ఉంటుంది.

విటమిన్ డి లోపం మన శరీరంలో ఉంటే ముఖ్యంగా అలసట, బలహీనత మొదలగునవి ప్రధానమైన లక్షణాలు. మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి కచ్చితంగా అవసరం. ఒకవేళ శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు చాలా బలహీనమవుతాయి, మన శరీరంలో ఏదైనా ఎముక విరిగినట్లయితే అది కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది విటమిన్ డి లోపం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఒక ఏజ్ వచ్చాక కీళ్లనొప్పులు రావడం సహజం అలా కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే విటమిన్ డి అధికంగా ఉండేలా చూసుకోండి. రోజు ఉదయాన్నే బ్రష్ వేస్తూ అలా ఎండలో పది పది నిమిషాలు ఉంటే చాలు.