Home Devotional మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈరోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు…

మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈరోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు…

మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈరోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు…

హిందువులకు అత్యంత పర్వదినంగా చెప్పేరోజు ముక్కోటి ఏకాదశి. ఈరోజు తిరుమల వేడుకలతో ఎంతో వైభవంగా ఉంటాదన్న సంగతి ప్రతీ ఒక్కరికి తెలుసు. ఎందరో ఈరోజు తిరుమల వెళ్లి, ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని అనుకుంటారు. కానీ ఆ స్వామీ అనుగ్రహం, ఆ ప్రాప్తం ఉన్నవారికే గోవిందుడిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశినాడు తిరుమలలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకలపాపాలు తొలగి, స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని అంటారు.

See also  ఈ నాలుగు మీ దగ్గర ఉంటె.. డబ్బు విపరీతంగా వస్తుంది.. అవేమిటో తప్పకుండా తెలుసుకోండి.

ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. దేవతలు ఉత్తరద్వారం దాటి అసుర బాధలు విన్నవించి, వారిని రక్షించమని వేడుకునేందుకు శ్రీ మహావిష్ణువు దగ్గరకు ఈరోజు వెళ్లినందుకు ఈ రోజు వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. అలాగే దివి నుంచి భువికి తీసుకుని వచ్చిన మూడు కోట్ల దేవతలకు, గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనం ఇవ్వడం వలన ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఇంకా వైకుంఠ దినమని కూడా అంటారు. ముర అనే రాక్షసుడి నుంచి విష్ణువును రక్షించేందుకు మహాలక్ష్మి, దుర్గ రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని వధించింది.

See also  Hanuman Jayanthi 2023: నేడు హనుమాన్ జయంతి లో ఈ చిన్న పని చేస్తే.. కొన్ని రాసులవారి పై హనుమాన్ కృపతో ఈ యోగం కలుగుతుంది..

అమ్మవారు చేసిన ఆ పనికి, స్వామీ ప్రసన్నుడై లక్ష్మీదేవికి ఏకాదశి అని బిరుదునిచ్చాడు. అందుకే ఈరోజు ఏకాదశి వ్రతంతో అమ్మవారిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వైష్ణవులు ఎంతో భక్తిశ్రద్దలతో చేస్తారు. ముక్కోటి ఏకాదశినాడు ప్రతీ ఆలయం భక్తులతో ఎంతో రద్దీగా ఉంటుంది. ఈరోజు విష్ణువుని, లక్ష్మి దేవిని పూజించడం వలన కష్టాలు అన్ని తొలగి, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానం. ఈరోజు దేవాలయానికి వెళ్లలేకపోయినా… వ్రతాలు, పూజలు చేయలేకపోయినా చింతించాల్సిన అవసరం లేదు. భక్తి శ్రద్దలతో మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా గోవింద నామాన్ని స్మరిస్తూ ఉన్నా చాలు. ఆ స్వామి ప్రీతీ చెంది, మీకు సిరిసంపదలను కలిగిస్తాడు.

See also  మీ రాశిని బట్టి.. ఏ దేవుడిని పూజిస్తే.. అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?