Home Cinema Allu Arjun : వెయ్యి మందితో ఒకేసారి అలా చేసిన అల్లు అర్జున్.. చూడలేక షూటింగ్...

Allu Arjun : వెయ్యి మందితో ఒకేసారి అలా చేసిన అల్లు అర్జున్.. చూడలేక షూటింగ్ ఆపేసిన సుకుమార్..

director-sukumar-stopped-for-a-week-pushpa-2-shooting-because-of-allu-arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా పుష్ప2. ఈ సినిమా ఆగస్టు 15.. 2024న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో.. ఆ సినిమా ( Allu Arjun and Sukumar ) ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో.. మనందరం చూసినదే. ఇప్పుడు మళ్లీ పుష్ప 2 సినిమాపై అందరి అంచనాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీయాలని.. దీంతో ఊహించని రికార్డ్స్ సాధించాలని.. సుకుమార్, అల్లు అర్జున్ పట్టుదలతో కృషి చేస్తున్న సంగతి అందరికీ అర్థమవుతుంది.

Sukumar-stopped-Pushpa2-Allu-Arjun-shooting

అయితే పుష్ప 2 అప్డేట్స్ కోసం ఎప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దీనిపై అప్డేట్స్ తక్కువగానే వస్తూ ఉంటాయి కానీ, వచ్చిన ఒకటి రెండు సంగతులను ఎంతో ఆత్రుతగా చూసుకుంటారు అల్లు అర్జున్ ( Allu Arjun and Sukumar ) అభిమానులు. అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు 30 రోజుల నుంచి చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో జాతర చాలా ముఖ్యమైన పాత్రని తీసుకుంటుంది అంట. కాబట్టి జాతర నేపథ్యంలో సాగే ఒక పాటను దాదాపు 1000 మంది డాన్సర్లతో తీస్తున్నారని సమాచారం. వెయ్యి మంది డాన్సర్లతో పాట తీయడం అంట అది మామూలు విషయం కాదు.

See also  Janhvi Kapoor : ఆ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో జాన్వికపూర్!

Sukumar-stopped-Pushpa2-Allu-Arjun-shooting-Rashmika

వెయ్యి మంది డాన్సర్ల మధ్యన అల్లు అర్జున్ తన పెర్ఫార్మెన్స్ ని సూపర్ గా చేస్తున్నాడంట. షూటింగ్ అనుకున్నట్టుగా ఎంతో చక్కగా జరుగుతుందంట. ఇక షూటింగ్ టైంలోనే ఈ జాతర పాటకి, అందులో వెయ్యి మంది డాన్సర్లతో కలిసి అల్లు అర్జున్ చేస్తున్న దానికి బయటకి ఇంత వార్తలు వస్తున్నాయి అంటే.. ఇక సినిమాలో ఈ పాట ( Allu Arjun and Sukumar ) ఎంత అద్భుతంగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే పుష్ప2 సినిమాపై ఇంకొక అప్డేట్ వార్తలు బయటకు వినిపిస్తున్నాయి.పుష్ప టు సినిమా షూటింగ్ని సుఖమార్ రెండు వారాలు పాటు ఆపాడంట. డిసెంబర్ సెకండ్ వీక్ వరకు షూటింగ్ ని ఆపేయాలని డిసైడ్ అయ్యాడట.

See also  Shruti Haasan: శృతి హాసన్ కొత్త టాటూ.. ఎక్కడ వేపించుకుందో తెలుసా.?

Sukumar-Pushpa2-Allu-Arjun-shooting

పుష్ప 2 షూటింగ్లో భారీ కాస్ట్యూమ్స్ తో ఫైటింగ్స్ సీన్ ఒకటి ఉందంట. ఆ ఫైటింగ్ సీన్ లో పాల్గొనే క్రమంలో అల్లు అర్జున్కి కొంచెం ఇబ్బంది కలిగిందట. దానివలన అల్లు అర్జున్కి బ్యాక్ వెన్నునొప్పి చాలా గట్టిగా వస్తుందంట. అయినా కూడా అల్లు అర్జున్ దాన్ని పట్టించుకోకుండా షూటింగ్లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడంట. ఇది కనిపెట్టిన సుకుమార్.. అల్లు అర్జున్ ఎటువంటి పరిస్థితిలో చూడలేక షూటింగ్ ఆపాలని డిసైడ్ అయ్యాడంట. కానీ అల్లు అర్జున్ మాత్రం షూటింగ్ ఆపద్దు. నేను చేయగలను చేస్తానని అంటున్నాడంట. ఇలా నువ్వు మొండిగా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూ చేస్తే.. ఇంకా హెల్త్ పాడయి మనకు ఇంకా ప్రాజెక్ట్ లేట్ అయ్యే అవకాశం ఉంటుందని.. ముందు రెస్ట్ తీసుకుంటే, ఆ తర్వాత కంటిన్యూ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చని సుకుమార్ చెప్పాడు అంట. అల్లు అర్జున్ లో ఆ స్పిరిట్ చూసి సుకుమార్ ఆనందించినా కూడా.. తన బాధని చూడలేకపోయాడంట. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది నిజమా కాదా అనేది అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత తెలుస్తుంది.