Home Reviews Ahimsa Review : అహింస లో ఉదయకిరణ్ కనిపించాడా.. రివ్యూ మరియు రేటింగ్

Ahimsa Review : అహింస లో ఉదయకిరణ్ కనిపించాడా.. రివ్యూ మరియు రేటింగ్

ahimsa-movie-review-and-rating

చిత్రం: అహింస ( Ahimsa )
తారాగణం: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
కెమెరా: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: ఆర్పీ పట్నాయక్
నిర్మాత: కిరణ్, డి. సురేష్ బాబు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తేజ
విడుదల తేదీ: 02 జూన్ 2023 ( Ahimsa Movie Review )

దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి.. దగ్గుబాటి సురేష్ రెండవ తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా, గీతికా తివారీ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ల రివ్యూ ఎలా ఉన్నప్పటికీ.. దర్శకుడు తేజా అనగానే చాలావరకు ప్రమోషన్ కాగా.. అలాగే హీరో అభిరామ్ దగ్గుపాటి కుటుంబం నుంచి కాబట్టి ఫస్ట్ ఫిలిం అయినా కూడా బాగానే ప్రమోషన్ అయింది. తేజ కొత్త హీరోలతో హిట్ బాగా కొడతాడనే చాలామంది అంచనాలతో ఉంటారు. మరి వారి అంచనాలకు తేజ రీచ్ అయ్యాడో లేదో కథలోకి వెళ్లి తెలుసుకుందాం..

ahimsa-movie-review-and-rating

కథ.
సినిమా మొదలు రఘు ని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లిన తన భర్త 5 సంవత్సరాల నుంచి రాలేదని దుశ్యంతరావు భార్య కంప్లైంట్ ఇవ్వగా.. ఎన్కౌంటర్ ఆఫీసర్ ఆ కేసు సాల్వ్ చెయ్యడానికి వస్తాడు. అక్కడ నుంచి అతను కేసు స్టడీ చేయడంతో అసలు సినిమా కథ మొదలవుతాది. రఘు ( దగ్గుపాటి అభిరామ్ ) చీమకు కూడా హాని చెయ్యని అహింసా వాది. రఘు మరదలు అహల్య ( గీతా తివారి ) కి రఘు అంటే చాల ఇష్టం. అలాగే రఘు కి కూడా మరదలంటే ప్రాణం. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. తల్లితండ్రులు లేని రఘు వాళ్ళ మామ, అత్త, మరదలుతోనే ఉంటాడు. అహల్య ఎప్పుడు హింసనే ప్రోత్సహిస్తే.. రఘు మాత్రం  ( Ahimsa Movie Review ) అహింస నే నమ్ముకుంటాడు. ఇలా వీల్లద్దరి మధ్య ఎప్పుడు వాదనే ఉంటాది. రఘు, అహల్య ఇద్దరికి నిశ్చితార్ధం జరుగుతాది. ఆరోజే అనుకోకుండా అహల్య కు ఊహించని ప్రమాదం జరుగుతాది. అక్కడి నుంచి రఘు జీవితంలో ఎన్నో మార్పులు, ఎందరో విలన్స్ రావడమే కాకుండా.. తన మరదలి కోరిక తీర్చేందుకు అహింసను వదిలి హింసను ఎన్నుకుని.. తన మరదలిని కాపాడుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అసలు అహల్యకు ఎం జరుగుతుంది? రఘు జీవితం అక్కడి నుంచి ఎందుకు మారిపోతుంది? అహింసను వదిలి హింసను ఎందుకు తీసుకుంటాడు? రఘుని మరదలు కోరిన కోరిక ఏమిటి? చివరికి ఆ కోరిక తీరుస్తాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Bichagadu 2 Review and Rating : డబ్బున్నోడు లేనోడు కూడా కనెక్ట్ అవ్వాల్సిన పాయింట్.. బిచ్చగాడు 2 రివ్యూ మరియు రేటింగ్..

సినిమా ఎలా ఉందంటే..

సినిమా మొదలు రఘుని వెతుక్కుంటూ.. అడవుల్లోకి వెళ్లిన దృశ్యంతరావు 5 ఇయర్స్ అయినా కూడా ఎందుకు రాలేదు అనే విషయంతో సినిమా స్టార్టింగ్ బాగానే ఆశక్తిగా అనిపించింది. ఆ తరవాత ఎన్కౌంటర్ ఆఫీసర్.. రఘు ఇంటికి వెళ్లి.. అక్కడ కూర్చుని కేసు ఫైల్ చదువుతూ ఉండగా సీన్స్ కనిపించడం కూడా బాగానే అనిపించింది. బాక్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎంతో ఆశక్తిగా మొదలైన సినిమా ఎప్పటికప్పుడు ( Ahimsa Movie Review ) నెస్ట్గ్ ఏమిటని తెలియనట్టు ఉంది కానీ.. అంత కొత్తగా ఏమీ అనిపించలేదు. హీరో అభిరామ్ ఫస్ట్ సినిమా అయినప్పటికీ పేస్ కొత్తగా అనిపించలేదు కానీ.. నటన మాత్రం ఏమి పెద్దగా కనిపించలేదు. కానీ పరవాలేదు నాట్ బాడ్ అనిపించాడు. ఇక హీరోయిన్ అయితే బాగానే నటించింది, తన అందాలను కూడా బాగానే చూపించింది. అభిరామ్ నటనా ప్రతిభ ఎంత ఉంటాదో తేజ ముందుగానే గ్రహించినట్టున్నాడు.. అందుకే అతని వాదాన్ని వినిపించినతగా సినిమాలో అతని వాటాన్ని ఎక్కువగా చూపించలేదు.

ahimsa-movie-review-and-rating

సినిమా మొదలు నుంచి చివరి వరకు కూడా దర్శకుడు.. సినిమా టైటిల్ గురించే ఆలోచిస్తూ సినిమా తీసినట్టు ఉంది. ఒక అహింస వాది, హింస ను ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో ఆడియన్స్ ఒప్పుకుని తీరాలి అన్నట్టు ఆలోచిస్తూనే ప్రతీ సన్నివేశం తీసినట్టు ఉంది. టైటిల్ కంటే కథ మీద కొంచెం ఫోకస్ పెట్టి ఉంటె బాగుణ్ణు అనిపించింది. అహింసను పక్కన పెట్టి, హింసను ఎందుకు పట్టుకోవాలో కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు ఎక్కువసార్లు చెప్పడం సినిమాలో కొంచెం బోర్ అనిపించింది. ఇక అంత అహింసా వాది హింస మొదలు పెట్టడానికి కారణం అయిన విలన్స్ అసలు సినిమాలో స్ట్రాంగ్ గా లేరు. అహల్యని రేప్ చేసిన ఇద్దరికి శిక్ష పడేలా చేసే కాన్సెప్ట్ తో మొదలైన సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరికి అడవుల్లోకి వెళ్లిపోవడం ఆడియన్స్ కి ఎక్కలేదు.

‘అహల్య కేసు టేకప్ చేసిన లాయర్ లక్ష్మి ( సదా) ఉన్నంతసేపు సినిమా కొంచెం పరవాలేదు అనిపించింది. అసలు సినిమాలో ఆమెను చంపాల్సిన అవసరం ప్రేక్షకుడికి పెద్దగా కనిపించలేదు కానీ, సినిమాలో ఆమె కోసం సీన్స్ రాయలేక అక్కడితో చంపేసినట్టు ఉంది. సామాన్యుడికి అన్యాయం జరిగితే.. డబ్బున్నవాడు, బలమున్న వాడు ఎలా తరుముతాడో.. హీరో హీరోయిన్ వాటిని ఎలా పరుగులు పెడుతూ ఎదుర్కుంటారో చాలా సినిమాలు వచ్చాయి. అందుకని ( Ahimsa Movie Review ) కథ కొత్తగా అస్సలు అనిపించలేదు. పైగా సినిమా మొత్తం నువ్వు నేను, జయం సినిమాలు ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయని సగటు ఆడియన్ కి అనిపించింది. ఎక్కువగా నువ్వు నేను సినిమాని మైండ్ లో పెట్టుకుని..అదే దర్శకుడు తనకు తాను పోటీగా సినిమా తీద్దామని అనుకున్నా కూడా.. ఆ సినిమా లా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాడు దర్శకుడు తేజ.

See also  Spy Review : వాళ్ళని దారుణంగా వాడేసుకునే ఈ ట్రెండ్ ని ఎవరు తప్పిస్తారో.. స్పై రివ్యూ మరియు రేటింగ్..

ahimsa-movie-review-and-rating

నువ్వు నేను సినిమాల తీసాడని ఆడియన్ అనుకున్నాడు తప్పా.. అబ్బా ఉదయకిరణ్ ని మళ్ళి అభిరామ్ తో చూపించాడని ఆడియన్స్ కి అనిపించేలా తేజ చూపించి ఉంటె.. సినిమా సూపర్ హిట్ అవును. కానీ అస్సలు ఈ సినిమాలో ఆ సినిమావి ఎన్ని ఫాలో అయినా కూడా.. అందులో ఉదయ్ కిరణ్ మాత్రం అస్సలు కనిపించలేదు. పెద్ద హీరోయిజమ్ లేని హీరోకి ఒక విలన్ చాలడని .. అంతమంది విలన్స్ ని ఎందుకు పెట్టాడు తేజ అని అనుకున్నారు. సినిమాలో కామెడీ అయితే అస్సలు లేదు. పళ్ళు ఎత్తుగా ఉన్న ఆడది అందరిని ముద్దాడే కామెడీ చాలా ఛండాలంగా ఉంది. అసలు సినిమా చూస్తుంటే.. చిత్రం, జయం.నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలు తరవాత చాల కాలం ఫెల్యూర్స్ చూసి.. నేను రాజు నేను మంత్రితో అప్డేట్ అయ్యాడు తేజ అని అనిపించుకున్నాడు.

కానీ ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు..మొత్తం అప్డేట్ పోయింది అనిపించింది. ప్రతీ దర్శకుడికి ఒక మార్క్ అనేది ఉంటాది. ఆ మార్క్ కి ఒక కొత్త ఆలోచనలను జోడించి చూపించాలి తప్పా.. అదే రొటీన్ గా చూపిస్తే.. అప్పుడు నచ్చిన సినిమా లాంటిదే ఇప్పుడు నచ్చాలనుకుంటే అమాయకత్వమే.. ఒకొక్క టైం లో ఒకొక్క ట్రెండ్ నడుస్తాదని తేజ లాంటి మంచి దర్శకుడు ఆలోచించకపోవడం బాధగా అనిపించింది. సినిమాలో అడివిలో ఒక గ్యాంగ్ ని పెట్టడం.. వాళ్ళు కూడా హీరో కి విరోధులు అవ్వడం చాలా విసుగ్గా అనిపించింది. ఇక విలన్ సెకండ్ వైఫ్.. తన పిల్లలు కానీ పిల్లలు పై ఆమె చూపించే అభిమానం, ప్రేమ కొత్తగా ఉంటాదని తేజ పెట్టాడు గాని.. ఆ పాత్ర ఏమి పండలేదు.. పైగా ఆమె పాత్రని ప్రేక్షకుడు యాక్సెప్ట్ కూడా చెయ్యలేదు.

హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ యావరేజ్ గా ఉంది. హీరోయిన్ హీరో కి తనని రేప్ చేసినప్పుడు ఎవరిని పిలిచిందో.. ఎం చేసిందో చెప్పే సన్నివేశం బాగానే పండింది. అక్కడ పాపం అభిరామ్ కష్టపడి బాగానే నటించాడు. విలన్స్ ని చంపడానికి హీరో ఫైట్ ఎంత సేపు చూపించినా బాగుంటదేమో కానీ.. వాళ్ళను చంపడానికి కావాల్సిన గన్ కోసం అంత ఫైట్ చేయడం చూడ్డానికి కష్టంగా అనిపించింది. ఇక హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ అంతగా ఏమి పండలేదు. లవ్ మరియు యాక్షన్ మూవీ గా సినిమాని స్టార్ట్ చేసిన తేజా.. లవ్ ని చూపించడంలో ( Ahimsa Movie Review ) ఆయన మార్క్ ని చూపించలేకపోయారు. అందరికి నచ్చాలి..సినిమాలో అన్ని కోణాలు ఉండాలి.. సినిమా హిట్ అవ్వాలి అనే తప్పా.. ఆయన స్పెషల్ మార్క్ కనిపించలేదు. ఐటెం సాంగ్ ని ఇరికించిన ఆయన ఐడియా చూస్తే.. అసలు ఈ సినిమా తేజ పూర్తిగా టైం పెట్టి చేశాడా? లేకపోతే ఎవరికైనా అప్పజెప్పడా అనిపించింది.

See also  Ravanasura Review and Rating: రావణాసుర సినిమా బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. ఇది చదివి మీకేమనిపిస్తే అది కామెంట్ చెయ్యండి..

ఒక అహింస వాది మరదలు కోరిన న్యాయం చెయ్యడానికి .. ఆమె బాధని తీర్చడానికి ఇద్దరిని చంపాడు.. కృషుడు చెప్పింది రైట్ అని చెప్పడానికి లెక్కలేనంత మందిని చంపాడు.. అందులో తేజ లెక్కేమిటో అర్ధం కాలేదు. సినిమాలో ఒకవైపు పోలీసులు, మరోవైపు అడవిలో విలన్స్, మరోవైపు ఊర్లో జనం ఒక్క హీరోని చంపడానికి వస్తే.. హీరో హీరోయిన్ దానిని ఎలా ఎదుర్కుని ఎంతమందిని చంపాడో.. చూపంచె ఫైట్ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించాలని.. అది పెద్ద హైలెట్ అవ్వాలని తేజా తీసాడు గాని.. పాపం అది ఆశక్తిగా ఆడియన్స్ చూసారు గాని, వాళ్ళని మెప్పించలేకపోయాడు తేజ.

ప్రేక్షకుడు చూడగలిగేలా సినిమా తీస్తే.. థియేటర్ లో ఉన్న ఆడియన్స్ వెళ్లిపోకుండా సినిమా మొత్తం చూస్తారు. అదే మెప్పించేలా తీస్తే, ఆడియన్స్ సినిమాకి తరలి వచ్చి.. సూపర్ హిట్ చేస్తారు. ఇందులో మొదటిది చేయగలిగాడు తేజ కానీ రెండవది చేయలేకపోయాడు. ఇంత గొప్పగా తీసిన ఫైట్ లో హీరోని ఆకుల ముసుగులో చూపించాడు అంటే.. అభిరామ్ ( Ahimsa Movie Review ) నేనంత కష్టపడి ఫైట్ చెయ్యలేను అన్నాడా? లేకపోతే అహింస టైటిల్ పెట్టుకుని అంత హింస చేయను అన్నాడా? అని ప్రేక్షకుడు నవ్వుకున్నాడు. సినిమాలో పాటలు బాగానే ఉన్నాయి. పాటల్లో మీనింగ్ కూడా బాగానే ఉన్నాయి. ఒక కొత్త హీరో సినిమా అనుకుని వెళ్తే సినిమా బాగానే ఉంది కానీ.. అదే తేజ సినిమా అనుకుని వెళ్తే మాత్రం సినిమా పెద్దగా ఎక్కదు..

రేటింగ్ : 2/5
ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..