Home Cinema Ustaad movie review : ఉస్తాద్ సినిమాలో ఏ ఏ పాత్ర ఎం చెబుతుంది.. రివ్యూ...

Ustaad movie review : ఉస్తాద్ సినిమాలో ఏ ఏ పాత్ర ఎం చెబుతుంది.. రివ్యూ మరియు రేటింగ్..

ustaad-movie-review-and-rating-in-telugu

Ustaad movie review : చిత్రం: ఉస్తాద్ ( Ustaad )
తారాగణం: శ్రీ సింహా కోడూరి, కావ్య కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవి శివ తేజ, సాయి కిరణ్ ఏడిద మొదలగువారు..
కెమెరా: పవన్ కుమార్ పప్పుల
సంగీతం: అకీవ బీ
నిర్మాతలు : రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
దర్శకత్వం : ఫణిదీప్
విడుదల తేదీ: 12 ఆగస్టు 2023 ( Ustaad Movie Review and Rating )

శ్రీ సింహ కోడూరి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా, ఫణిదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి మొదట ఎవరికీ పెద్దగా తెలియదు కానీ.. ఎప్పుడైతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి, నాని వచ్చారు. అప్పటినుంచి ఈ సినిమాపై కొంత బజ్ పెరిగింది. అలాగే ఈ సినిమా ( Ustaad movie review and rating ) ట్రైలర్ చూస్తే యూత్ కి నచ్చే విధంగా ఉంది. మత్తు వదలరా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరో తర్వాత చేసిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోయినప్పటికీ.. తన ప్రయత్నం తను ఆపకుండా.. ఎప్పటికప్పుడు కొత్త తరహాగా కదలని ఎన్నుకుని చేస్తూ వస్తున్నాడు. మరి ఇప్పుడు చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ కథలోకి వెళ్లి చూద్దాం..

ustaad-movie-review-and-rating-in-telugu

కథ.

సినిమా మొదలు సూర్య అనే కుర్రాన్ని చూపిస్తారు. ఆకాశం వైపు ఎగురుతున్న గాలిపటాన్ని చూస్తూ ఉంటాడు. అది చూసిన తండ్రి కొడుకుని జైంట్ వీల్ ఎక్కిస్తాడు. అది ఎక్కిన తర్వాత సూర్య భయపడిపోతాడు. సూర్యకి ఎత్తైన ప్రదేశాల్లో ఉండటమంటే.. కిందకి చూడడం అంటే చాలా భయం. ఆ తర్వాత నుంచి సూర్య ( శ్రీ సింహా కోడూరి ) కథ మొదలవుతుంది. సూర్య తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి మాత్రమే కష్టపడి పెంచుతుంది. సూర్యకి ఏది నచ్చితే అది చేసే మనిషి. ఏది కూడా క్లారిటీ ఉన్న మనిషి కాదు. అలాంటి సూర్య డిగ్రీ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తనకి బైక్ కూడా రాదు అని.. దానిమీద కుర్రాళ్ళు అందరూ హేళన చేస్తారు. అప్పుడు ఎలాగైనా ఒక బైక్ కొనుక్కోవాలని, బైక్ నడపడం రావాలని ఆలోచన వచ్చిన సూర్య ఒక సెకండ్ హ్యాండ్ బైక్ ఇష్టపడి కొంటాడు. అదే ఉస్తాద్. ఆ బైక్ తో సూర్యకి చాలా బంధం ఏర్పడుతది. ప్రతిదీ ఆ బైక్ తో పంచుకుంటాడు. తన జీవితంలో చాలా మలుపులు ఆ బైక్ వల్ల జరుగుతూ ఉంటాయి. సూర్యకి ఆ బైక్ వల్లనే మేఘన ( కావ్య కళ్యాణ్ రామ్ )పరిచయం అవుతుంది. అలాగే సూర్య ప్రవర్తన వలన, ఆలోచన వలన, కెరీర్ వలన, తన ప్రేమలో ఎలాంటి సమస్యలు వస్తాయో.. ఉస్తాద్ కి తన ప్రేమకి ఉన్న లింక్ ఏమిటో.. బైక్ తన జీవితానికి ఏం నేర్పిస్తాదో.. తను ఫైలట్ అవుతాడా , అవ్వడా.. ఆ క్రమంలో ఎలాంటివి ఎదుర్కొంటాడు.. ఇక బైక్ మెకానిక్ బ్రహ్మం ( రవీంద్ర విజయ్ ) పాత్ర ఏమితో? అలాగే ఇందులో ఇంపార్టెంట్ పాత్రలో గౌతమ్ మీనన్ ఏం చేశాడు ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Upasana Kamineni : కడుపుతో ఉన్న ఉపాసన చెప్పిన పచ్చి నిజాలకి మెగా కుటుంబం రియాక్షన్?

ustaad-movie-review-and-rating-in-telugu

సినిమా ఎలా ఉందంటే..

మొదలు ఒక కుర్రాడికి ఆకాశంలో ఎగరాలని ఆశ ఉండట, దానిని తండ్రితో పంచుకోవడం అవన్నీ పరవాలేదు అన్నట్టు ఉంటుంది. ఆ తరవాత డైరెక్ట్ గా హీరోని పైలట్ గా చూపించేయడంతో సినిమా లో హీరో చివరికి ఏమవుతాడు అనే ఆశక్తి లేదు. కానీ అక్కడ నుంచి హీరో ఫ్లాక్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్లే విధానం.. ప్రేక్షకుడిలో ఆశక్తి కలిగించగలిగాడు దర్శకుడు. ఫ్లాష్ ( Ustaad movie review and rating ) బ్యాక్ లోకి వెళ్లిన తార్వత డిగ్రీ కాలేజీ చేరడం, అక్కడ ఫైట్స్, బైక్ కొనడం, దాన్ని నేర్చుకోవడానికి పడిన కష్టం ఇవన్నికీ చాలా ఎక్కువ సమయం తీసుకుని ప్రేక్షకుడి సహనాన్ని లాగేసారు. ఆ తరవాత హీరో లైఫ్ బోర్ అవుతుంది.. ఏదైనా కొత్త మార్పు రావాలి అనగానే.. మాకు కూడా బోర్ అవుతుంది కొంత కథలోకి వేళ్ళు అని ఆడియన్స్ కూడా అనుకున్నారు.

ఇలా సినిమాలో హీరోయిన్ ని ఎంటర్ చెయ్యడానికి చాలా టైం పట్టిందని అనుకున్నాక.. హీరోయిన్ ఎంటర్ అయ్యింది. అక్కడ నుంచి కథ కొంచెం మార్పు వచ్చి సాగదీస్తున్నాడు అనే ఫీల్ నుంచి బయట పడతాము. హీరో, హీరోయిన్ మధ్య పరిచయం, ఫ్రెండ్షిప్ అన్ని కూడా చాలా సహజంగా ఉంటాయి. వాళ్ళ లవ్ స్టార్ట్ అయిన సినిమా కొంచెం నచ్చడం మొదలవుతుంది. మొదట హీరోయిన్ కావ్యా కళ్యాణ్ ని చూడగానే.. ఆమె శరీర తీరు చూసి.. అసలు ఈ హీరోయిన్ ఈ హీరోకి సూట్ కాదని అనిపిస్తాది. కానీ నిమ్మదిగా వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఈ మధ్యకాలంలో హీరో హీరోయిన్ మధ్య రియల్ గా ప్రేమని ఫీల్ అవుతున్నట్టు ఈ సినిమాలో వీళ్ళిద్దరూ నటించారు. హీరో హీరోయిన్ ఇంటుముందు కూర్చుని మాట్లాడుకోవడం చాలా సహజంగా తీశారు.

See also  Rajamouli - Jr NTR : రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో..

ustaad-movie-review-and-rating-in-telugu

అలాగే వీళ్లిద్దరి మధ్య కొన్ని సీన్స్ వలన రియల్ లవ్ ని ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. సూర్య మాత్రమే తలుపు ఇవతల నుంచి తలుపుకి అవతల ఉన్న మేఘన తో మాట్లాడటం.. దానికి ఆమె మౌనంగా కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం అలా ఆ సీన్ చాలా బాగుంది. ఆ టైం లో హీరో హీరోయిన్ ఇద్దరూ పోటీ పది నటించారు గాని.. గెలవడం ( Ustaad movie review and rating ) మాత్రం హీరోనే గెలిచాడు. అలాగే వాళ్ళిద్దరి బ్రేకప్ టైం లో కూడా ఇద్దరి నటన, వాదన కూడా చాలా సహజంగా ఉన్నాయి. చివరిగా హీరోయిన్ ఒక్కసారి కనిపించమని అన్నప్పుడు.. సూర్య ఆమెకి కనిపించినప్పుడు ఇద్దరూ చాలాబాగా నటించడం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మనసుకు హత్తుకునేలా ఆ సన్నివేశం పండింది. అంతా బాగుంది గాని.. హీరోయిన్ కొంచెం సన్నగా ఉంటె బాగుణ్ణు అని మాత్రం అనిపించింది.

ఇక ఏ సినిమాలో తల్లి కొడుకుల మధ్య బంధం.. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. తల్లిగా నటించిన అను హాసన్ చాలా సహజ నటనతో నటించింది. ఇన్నేళ్లుగా నాన్నని మిస్ అవ్వలేదా అమ్మ ఐ అడిగినప్పుడు వారిద్దరి ఫీలింగ్స్, మాటలు కూడా బాగున్నాయి. ఆమె తన కొడుకుని ప్రోత్సహించే విధానం, మంచి చేదు చెప్పే తీరు అన్ని వాళ్ళిద్దరి మధ్య బోండింగ్ బాగుంది. ఈ సినిమాలో ముఖ్యమైన ఇద్దరి బంధం ఎవరిదంటే సూర్య మరియు ఉస్తాద్. ఒకరు మనిషి ఇంకొకరు వస్తువు. ఈ సినిమాలో సూర్యకి ఆ వస్తువు మీద ఉన్న ప్రేమ, ఇష్టం, కోపం, చిరాకు, తిట్టడం, దానిని కొట్టడం అన్ని చేస్తాడు. అయినా కూడా అది ఎప్పుడు సహనంగా దాని శక్తి కొద్దీ అది సూర్యకి ఉపయోగపడుతూనే వస్తుంది.

ఆ బైక్ విషయంలో తాను చేసిన తప్పులకు రియలైజ్ అయ్యి.. సూర్య ఏడుస్తూ దాన్ని వాడాలని చూస్తూ.. నాలో ఇన్ని భరించావు, కోపం విసుగు అన్నీ అయిన వాళ్ళమీదనే చూపిస్తాం.. వాళ్లకు ఉన్నంత కాలం విలువ తెలీదు అని ఏడుస్తూ.. ఆ సీన్ సినిమా మొత్తానికి హైలెట్. ఆ సీన్ నుంచి మనం నిజంగా అర్ధం చేసుకుంటే ఎన్నో కోణాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. మనకి ఉపయోగపడేవాటిని జాగ్రత్తగా చూసుకోవాలని.. అది మనిషైనా, వస్తువైనా.. అలాగే నిస్వార్ధంగా మనం చేయగలిగినంత మన వాళ్లకు చేసుకుంటూ వెళ్ళిపోతే.. చివరికి మనం వాళ్ళ నుంచి చాలా గౌరవం, విలువ, ప్రేమ, మన్నన పొందుతామని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో మెకానిక్ పాత్ర మాత్రం సూపర్. మెకానిక్ పెద్ద తాగుబోతు. ఈ పాత్రని చూస్తే.. మనిషి తాను చేసే పనితో ఎంత కనెక్ట్ అవుతాడో అర్ధమవుతాది. తాను చేసే పనే తన ప్రాణమని, దానికి చాలా విలువ ఉందని తెలుస్తాది. ఏ మనిషి వృత్తి చేసినా.. దాని మీద అంత ఇష్టం ఉండాలని అనిపిస్తాది. చాలామంది వాళ్ళ పనిని వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఆ పని చేతకాక ఇంకొకరు పడు చేస్తే చూడలేరు కూడా.. మెకానిక్ పాత్ర చాలా ఆకట్టుకుంది.

See also  Upasana: సీమంతం రోజు ఉపాసన వేసుకున్న డ్రస్ ధర అన్ని లక్షలా.?

గత కొంతకాలంగా మనిషి తయారు చేసిన వస్తువుని ప్రేమిస్తున్నారు గాని.. మనిషిని మాత్రం ప్రేమించడం మానేశారు..వాడుకోవలసిన వస్తువుని ప్రేమిస్తున్నారు.. ప్రేమించాల్సిన వస్తువుని వాడుకుంటున్నారు అని ఎక్కువ సినిమాల్లో చెప్పడానికి ప్రయతించారు. కానీ ఈ సినిమాలో వస్తువుని జాగ్రత్తగా చూసుకో.. అది నీకు ఉపయోగ పడుతుందే తప్పా.. నిన్ను మోసం చేయదు అనే డిఫరెంట్ నినాదం కూడా ఈ సినిమాలో చూపించారు. సినిమాలో పాటలు యావరేజ్ గా ఉన్నాయి. సినిమాలో హీరో పైలట్ అవ్వడంపై, అందుకు పడిన కష్టం అవన్నీ ఏమి గొప్పగా చూపించలేదు. బైక్ డ్రైవింగ్ కష్టాలు చూపించారు గాని.. పైలెట్ డ్రైవింగ్ కష్టాలు చూపించలేదు. సినిమా ఫస్ట్ ఆఫ్ విపరీతమైన స్లో ఉండటం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఇక ఈ సినిమాలో అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరో గురించి.

హీరో శ్రీ సింహా చాలా బాగా నటించాడు. ఈ సినిమాని మొత్తం తనే భుజాల మీద వేసుకుని మోశాడు. ఈ సినిమాలో ప్రతీ బంధం తన అక్కడితోనే లింక్ అయ్యి ఉంది. అన్ని బంధాలకి న్యాయం చేసేలా నటించాడు. తన నటనతో ప్రేక్షకుడిని కూర్చో బెట్టాడు. కానీ దర్శకుడు ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని ఉంటె సినిమా ఇంకా బాగుణ్ణు అనిపిస్తుంది. టోటల్ గా ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేకపోయాడు. కథలోనే, స్క్రీన్ ప్లే లోనో, ఎదో ఒక దాన్ని టార్గెట్ పూర్తిగా చేయలేకపోయి.. సినిమాని అలా నడిపించినట్టు ననీరసంగా నడిపించడం లోనో, క్లైమాక్స్ తేలిపోయినట్టు అనిపించడం వలనో ప్రేక్షకుడు పూర్తిగా సంతృప్తి పొందలేకపోయారు. ఏదేమైనా కుర్రాళ్లు సరదాగా ఒక సినిమా చూడాలి అనుకుంటే.. ఒకసారి చూడచ్చు.. ( Ustaad movie review and rating )

రేటింగ్: 2.25/ 5

ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే.. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..