Home Cinema Bhola Shankar Review : భోళాశంకర్ లో దర్శకుడి చీప్ ట్రిక్స్ తో చిరంజీవిని చీప్...

Bhola Shankar Review : భోళాశంకర్ లో దర్శకుడి చీప్ ట్రిక్స్ తో చిరంజీవిని చీప్ చేసిన సీన్స్ ఇవే.. రివ్యూ మరియు రేటింగ్..

chiranjeevi-movie-bhola-shankar-review-and-rating-in-telugu

Bhola Shankar Review : చిత్రం: భోళాశంకర్ ( Bhola Shankar )
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రఘు బాబు, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, తులసి, బ్రహ్మాజీ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా మొదలగువారు..
కెమెరా: డడ్లీ
సంగీతం: మహతి స్వరసాగర్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : మెహర్ రమేష్
విడుదల తేదీ: 11 ఆగస్టు 2023 ( Bhola Shankar Movie Review and Rating )

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా భోళా శంకర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై చిరంజీవి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా ఈ సినిమాని తీశారు. మరి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఎలా అలరించిందో తెలుసుకుందాం..

chiranjeevi-movie-bhola-shankar-review-and-rating-in-telugu

కథ.
సినిమా మొదలు కలకత్తాలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం, మిస్సింగ్ కేసుల్ని పోలీసులు ఫైల్ చేసుకోవడం, ఒక గ్యాంగ్స్టర్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారన్న టెన్షన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత శంకర్ ( చిరంజీవి ), తన చెల్లెలు మహాలక్ష్మి ( కీర్తి సురేష్ ) కలకత్తాకు వస్తారు. అక్కడ ఒక కాలనీలో ఫ్రెండ్ సహాయంతో దిగి చెల్లెల్ని కాలేజీలో జాయిన్ చేస్తాడు. శంకర్ టాక్సీ డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. ఆ తర్వాత పోలీసులు డ్రైవర్ల అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ స్టర్స్ ఎవరైనా కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తారు. ఆ తర్వాత శంకర్ ఆ గ్యాంగ్స్టర్ గురించి పోలీసులకు ఇంఫాం చేస్తాడు. ఆ గ్యాంగ్ స్టర్ శంకర్ వెనుక పడతారు.. ఆ తర్వాత శంకర్ చెల్లెలిపై కూడా విలన్సు టార్గెట్ పెడతారు. అమ్మాయిలు ఎత్తుకుపోయే మాఫియా గ్యాంగ్ కి శంకర్ కి, శంకర్ చెల్లెలు మహాలక్ష్మికి ఉన్న రిలేషన్ ఏమిటి? వాళ్ళ నుంచి శంకర్ తన చెల్లిని ఎలా కాపాడుకుంటాడు? ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే..
సినిమా ఇలా తీశారు, అలా తీశారు అని చెప్పుకునే ముందు అసలు కథలో దమ్ము లేదు అని గట్టిగా చెప్పుకోవచ్చు. ఇదే కథ తో తమిళ్ వేదాళం సినిమా సూపర్ హిట్ అయ్యింది. కనై ఆ సినిమా వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది. అప్పటి ట్రెండ్ కి ఈ కథ కొత్త. ఇప్పటి ట్రెండ్ కి ఈ కథ ఒక చెత్త అన్నట్టు ఉంది.పోనీ ఆ కథని మూలంగా తీసుకుని ఏమైనా కొంచెం మార్పులు చేసి, సినిమా తీసి ఉన్నా బాగుణ్ణు. ఏ రకంగా కూడా చిరంజీవికి తగ్గ కథ కాదు. ఫస్ట్ ఆఫ్ ( Bhola Shankar Review and rating ) మొత్తం సినిమాని భరించాలి అంటే చాలా కష్టం. మధ్యలో ఆడియన్స్ వాళ్ళ ఫోన్ లో మెసేజెస్ చూస్తూ టైం పాస్ చేసారు. ఫస్ట్ అఫ్ లో చిరంజీవి కీర్తి సురేష్ మధ్య కూడా ఏమి పెద్దగా సెంటిమెంట్ సీన్స్ ఏమి లేవు. ఫస్ట్ ఆఫ్ లో అద్దెకు అన్నా చెల్లెల్లు లానే వాళ్ళ మధ్య సీన్స్ ఉన్నాయి.

See also  Mega Family: ఆ కారణం వల్లే.. మెగా కుటుంబంలోని అమ్మాయిలకు వివాహ బంధాలు నిలవడం లేదా.??

 

చిరంజీవి వెన్నెల కోశోర్ మధ్య కామెడీ చాలా బోర్ కొట్టింది. రొటీన్ గా ఉంది. వెన్నెల కిషోర్ వాళ్ళ ఆవిడా మధ్య కామెడీ, అతను వాళ్ళ ఆవిడతో ఫోన్ మాట్లాడే సమయం చిరాకు వచ్చింది. ఇక తమన్నా చిరంజీవి మధ్య కోర్ట్ సీన్ నవ్వు రాలేదు కదా.. కనీసం ఏడవలేక నవ్వలేదు కూడా.. అసలు కోర్ట్ లో ఆ పనికిమాలిన సీన్ కోసం చాలా రీల్ ని వేస్ట్ చేసారు అనిపించింది. పైగా అందులో బ్రహ్మానందాన్ని వాడినా కూడా ( Bhola Shankar Review and rating ) నవ్వించలేకపోవడం నిజంగా దర్శకుడి ప్రతిభ అనుకోవాలి. ఫస్ట్ పాట కొట్టారా తీన్ మార్ పాటపాత పాట చూస్తున్నట్టు ఉంది. పాట ఏమిటి సినిమా చాలా వరకు అలానే ఉంది అనుకోండి.. సినిమాలో తమన్నా కనిపించే ఏ సీన్ కూడా కొంచెం కూడా ఆకట్టుకోలేదు. టోటల్ గా ఫస్ట్ అఫ్ మొత్తం సుత్తి.

chiranjeevi-movie-bhola-shankar-review-and-rating-in-telugu

ఇంటర్వెల్ బ్యాంగ్ పరవాలేదు అనిపించుకుంది. ఎందుకంటే.. అది చూసి అమ్మయ్య నెక్స్ట్ ఆఫ్ ఎదో ఉంటాదని జనాలు వెళ్లిపోకుండా ఆగారు. ఇంటర్వెల్ తరవాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన తరవాత.. ఫామిలీ రిలేటెడ్ ఎపిసోడ్ కొంచెం ఊరటగా అనిపించింది. కానీ అక్కడ కూడా కథ మీద గాని, సీన్స్ మీద గాని, సీరియస్ నెస్ లేకుండా.. చిరంజీవితో కామిడి చేయించడం విసుగ్గా అనిపించింది. ఎదో కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం అనే సరికి మల్లి ప్రజంట్ లోకి సినిమా వచ్చేసింది. రావడం, రావడం విసుగు పుట్టించే పాటలు క్లైమాక్స్ ముందుకు వచ్చేసాయి. క్లైమాక్స్ చాలా పేలాగా, ఎదో పూర్తి చెయ్యాలన్నట్టు ఉంది. చిరంజీవి లుక్ మాత్రం బాగానే ఉంది. కీర్తి సురేష్ తన వరకు తన పాత్ర బాగానే చేసింది. సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం సెంటిమెంట్ పండింది. కానీ వెంటనే సినిమా గాడి తప్పేది.

See also  Sreeleela : శ్రీలీలను కోరిక తీర్చమంటూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నది ఆ వ్యక్తా?

తమన్నా పాత్ర అంతగా అట్రాక్ట్ చేసుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో విలన్స్ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ కి సూట్స్ , బూట్స్ ఇచ్చి ఏలికాప్టార్ తిప్పేతే చాలు అనుకున్నారు గాని.. అసలు దమ్మున్న విలన్ ఉండాలని అనిపించలేదు.విలన్ లు ఈ సినిమాలో పూర్తిగా మైనస్. ఈ సినిమాలో శ్రీముఖి నటన బాగానే ఉంది. ఆమెకు ఇచ్చినంత వరకు ఆమె బాగానే నటించింది. రేష్మి, సుబ్బరాజు ఇలా వచ్చి ఆలా మెరిసి ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్లారో తెలీకుండా వెళ్లిపోయారు. పాటలు అస్సలు బాలేవు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో దర్శకుడు ఆడియన్స్ దగ్గర క్రేజ్ సంపాదించడం కోసం కొన్ని సీన్స్ పెట్ట్టాడు. వాటి వలన చిరంజీవిని చీప్ చేసినట్టు అనిపించింది.

chiranjeevi-movie-bhola-shankar-review-and-rating-in-telugu

అన్నిటికంటే ముఖ్యమైనది.. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో నడుం సీన్.. మెగా కుటుంబానికి మాత్రమే కాదు, సినిమా రంగంలో ఇప్పటి జనరేషన్ కి కృషి పట్టుదలకు ఆదర్శం చిరంజీవి అని చాలామంది అభిప్రాయం. అలాంటి చిరంజీవి పాటలు, సీన్స్ ఆయనకంటే చిన్నోళ్లు వాడతారు గాని.. ఆయన తమ్ముడి సీన్ ని ఆయన చేయడం అస్సలు నచ్చలేదు. పోనీ ఆ సీన్ ఎదో చిరంజీవి – తమన్నా మధ్య పెట్టినా కొంత బాగుణ్ణు గాని.. పవన్- భూమిక మధ్య పెట్టిన సీన్ ని.. చిరంజీవి – శ్రీముఖి మధ్య పెట్టడం అస్సలు నచ్చలేదు. ఇక సినిమాలో సెకండ్ ఆఫ్ లో చిరంజీవి ఎంట్రెన్స్ కి పవన్ కళ్యాణ్ పాట హిందీ సాంగ్ పెట్టడం కూడా ఏదోలా ఉంది. ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ లా మెడ దగ్గర పావడం కూడా చిరాగ్గా అనిపించింది.

See also  Vishnu Priya: దానికోసమే విష్ణు ప్రియను పెట్టుకున్నది - సంచలనమైన కామెంట్స్ చేసిన డైరెక్టర్.

ఇలాంటి చీప్ ట్రిక్ సీన్స్ ఎవరైనా కమెడియన్ తో.. బ్రహ్మానందంతో చేయించి ఉంటె బాగుణ్ణు అనిపించింది. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన వేదాళం సినిమా కథ ఇప్పుడు నప్పించడం కష్టమా, సులభమా అని కాదు దర్శకుడు గాని, ఈ సినిమా ( Bhola Shankar Review and rating ) ఒప్పుకున్నా చిరంజీవి గాని ఆలోచించాల్సింది.. అసలు ఇలాంటి కథతో ఎన్నో సినిమాలు చూసిన ఆడియన్స్ ని ఎందుకు మళ్ళీ విసిగించడం.. కొత్త కథతో వెళదాం అని ఆలోచించి ఉంటె బాగుణ్ణు అనిపించింది. ఈ సినిమాలో మురళీ శర్మ ని చూసిన కొంచెం సేపు.. అర్ధం పర్ధం లేని ఊర్లన్నీ తిరిగి తిరిగి.. కొంచెంసేపు మన తెలిసిన వారి ఇల్లు కనిపించినంత రిలాక్స్ వచ్చింది. ఇక సినిమా కథలో కొత్తదనం గాని.. ఆశక్తి గాని, ఇంట్రెస్ట్ గని ఏది కలగలేదు.

జూనియర్ ఎన్టీఆర్ తమన్నా నటించిన ఉసరవిల్లి కథ కొంచెం కలిసింది. అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో తమ్ముడి కోసం వెళ్తే.. ఇక్కడ చెల్లి కోసం వెళ్ళాడు. చిరంజీవి కలకత్తా రావడం.. ఒక కోలనీలో ఇల్లు దిగడం అక్కడ సీన్స్ చూస్తే.. చిరంజీవి సినిమా చూడాలని ఉంది గుర్తుకువచ్చింది. అన్నవరం సినిమాలో చెల్లెలి కోసం అందరిని నరుక్కు వెళ్లే స్టోరీ కొంత కలిసింది. దేనితో కలిసినా దీని కంటే అవన్నీ బాగానే ఉన్నాయి. చిరంజీవి మాత్రం ఈ సినిమాలో ఇంకా యంగ్ గా, స్టైల్ గా కనిపించాడు గాని.. అతనికి తగ్గ కథ, పాటలు, సీన్స్, ఏమి కూడా ఈ సినిమాలో లేకనే అతను ఈ సినిమాలో ఏ క్యార్కటర్ తో కూడా కనెక్ట్ అయినట్టు కనిపించలేదు. మొత్తానికి చిరంజీవికి ఒక డిజాస్టర్ ఇచ్చాడు మెహర్ రమేష్..

రేటింగ్: 1.75 / 5

ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..