Home Cinema Jailer Movie Review and Rating: జైలర్ లో రజనీకాంత్ ఆ సీన్స్ ని ఎలా...

Jailer Movie Review and Rating: జైలర్ లో రజనీకాంత్ ఆ సీన్స్ ని ఎలా చిదగ్గొట్టాడంటే..

super-star-rajinikanth-movie-jailer-review-and-rating

Jailer Movie Review : చిత్రం: జైలర్ ( Jailer )
తారాగణం: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా భాటియా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు మొదలగువారు..
కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్
సంగీతం: అనిరుధ్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
విడుదల తేదీ: 10 ఆగస్టు 2023 ( Jailer Movie Review and Rating )

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, రమ్యకృష్ణ ఆయన సరసన నటించగా, తమన్న స్క్రీన్ లో మెరవగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో, అనిరుద్ సంగీతం అందించగా రూపొందిన చిత్రం జైలర్. గత కొంతకాలంగా రజనీకాంత్ కి మంచి హిట్ అనేది తగలలేదు . దానితో ఆయన అభిమానులు జైలర్ సినిమా పై ఎన్నో ఆశలతో ఎదురు చూసారు. మరి ఈ సినిమా వారి ఆశలను తీర్చిందో లేదో కథలోకి వెళ్లి చూద్దాం..

super-star-rajinikanth-movie-jailer-review-and-rating

కథ.

సినిమా మొదలు విగ్రహాలను దోచుకునే గ్యాంగ్ వలన గుడిలో విగ్రహం మాయం అవ్వడంతో మొదలవుతుంది. ఆ తర్వాత ముత్తు ( రజనీకాంత్ ) అలియాస్ టైగర్ ముత్తు వేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్ ఇల్లు చూపిస్తాడు. ముత్తు భార్య విజయ ( రమ్యకృష్ణ ) ముత్తు కి ఒక కొడుకు అర్జున్( వసంత రవి) అసిస్టెంట్ కమిషనర్ పోలీసుగా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఒక కోడలు ఒక మనవడు ఉంటారు. ముత్తుకి మనవడు అంటే ప్రాణం. మనవడు ఎం చెబితే అది చేస్తూ ఉంటాడు. అలాగే కొడుకుకి కూడా ఏం కావాలో చూసుకుంటూ ఉంటాడు. ముత్తు చాలా సాదాసీదాగా రిటైర్డ్ అయిన ఒక మనిషి ఎంత నెమ్మదిగా ఉంటాడో అలా ఉంటాడు. ఈ క్రమంలో తన కొడుకు అర్జున్.. విగ్రహాలను దోచుకునే ముఠాని పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు. లేడీ కానిస్టేబుల్ ముత్తు కి కొడుకుని కొంచెం మరీ నిజాయితీని తగ్గించుకోమని.. వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు ఏమైనా చేస్తారని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. అప్పుడు ముత్తు కొడుకుతో ఎందుకు ఇవన్నీ అన్నా కూడా మీరు నేర్పిన నిజాయితీనే దాన్ని వదలను అంటాడు అర్జున్. తన కొడుకుని చూసి తన లైఫ్ ని గుర్తు తెచ్చుకుని గర్వాంగా, తృప్తిగా జీవితాన్ని గడుపుతుంటాడు ముత్తు. ఆ క్రమంలోనే విగ్రహాలు దోచుకునే విలన్ వర్మ (వినాయకన్ ) వలన ముత్తు జీవితంలో నష్టం జరుగుతుంది. అదేంటంటే ముత్తు కొడుకు అర్జున్ కనిపించకుండా పోతాడు. తన కొడుకు కనిపించడం లేదని పోలీసులు చుట్టూ.. విలన్ల చుట్టూ.. అందరు చుట్టూ తిరుగుతాడు ముత్తు. ఈ క్రమంలో విలన్లకు ఏం చేశాడు? కొడుకుని కాపాడుకున్నాడా? చివరికి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Slik Smitha : సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ లో కీలకమైన రెండు విషయాలు ఏడుపు రప్పిస్తున్నాయి..

super-star-rajinikanth-movie-jailer-review-and-rating

సినిమా ఎలా ఉందంటే.. ( Jailer Review and Rating )

ఒక రిటైర్డ్ జైలర్ ఒక సదాసీదా జీవితం, వాళ్ళ ఇంట్లో వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. రజనీకాంత్ తన మనవడి మధ్య జరిగే ప్రతీ సీన్ కూడా చాలా బాగుంటుంది. పని చేసినంత కాలమే అందరూ మర్యాద ఇస్తారు.. చదువుకునే టప్పుడు, రిటైర్ అయ్యిన తరవాత వేల్యూ ఇవ్వరు అని మనవడితో చెబుతూ.. కొడుకు, మనవడి షూ పాలిష్ చేస్తూ.. కూరగాయలు వెళ్లి తెస్తూ.. మనవడి యు ట్యూబ్ వీడియో లు తీస్తూ.. ఇలా చాలా సామాన్యంగా రజనీకాంత్ చాలా బాగా నటించాడు. ఈ సినిమా మొత్తం రజనీకాంత్ తో నిండి ఉంటుంది. ఇక ఆయన కొడుకుతో ఉన్న కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. కొడుకుని బెదిరించడం కోసం రజనీకాంత్ ని ఎత్తుకు వెళ్లిన రౌడీలకి.. కొడుకు తన తండ్రి ని డైనోజర్ తో పోలుస్తూ.. చెప్పిన డైలాగ్స్ కి సినిమాలో ప్రేక్షకులు రజనీ కోసం విజిల్స్ వేశారు.

super-star-rajinikanth-movie-jailer-review-and-rating

ఇక భార్య రమ్యకృష్ణ దగ్గర చాలా నిమ్మదిగా.. రిటైర్ అయిన మొగుడితో భార్య ఎలా ఉంటాదో అంత చక్కగా, న్యాచురల్ నటనతో ఆమెకి ఇచ్చిన పాత్ర వరకు ఆమె బాగానే చేసింది. అలాగే ఈ సినిమలో రజనీకాంత్ – యోగి బాబు మధ్య ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ బాగుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా చేసిన వినాయకన్ నటన చాలా బాగుంది. కాకపోతే.. సుత్తితో వైలెన్స్ ఎక్కువగా చూపించారు. అయితే సాధారణంగా రజనీకాంత్ లాంటి టాప్ స్టార్ హీరోకి విలన్ ని చాలా రిచ్ గా, బలంగా, పుష్టిగా, సిక్స్ ప్యాక్ తో, ఇలా పెట్టాలని దర్శకుడు ఆలోచించకుండా విలన్ ని కొంచెం వెరైటీగా పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ సినిమా బాగుంది. ఫామిలీ సెంటిమెంట్, రజనీకాంత్ సింపుల్ నటన, కామెడీ అన్నీ బాగున్నాయి. ఇక సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరింది.

See also  Samantha : సమంత సడన్ గా అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అంత ప్రమాదం ఉందా?

ఇంటర్వెల్ లో ఇంట్లో జరిగిన ఒక ఫైట్ కారణంగా.. రజనీకాంత్ అసలు నటన బయటకు రావడమే కాకుండా.. సినిమా సెకండ్ ఆఫ్ ఎలా ఉంటుందో అని ఆశక్తిని క్రియేట్ చేసింది. ఇక ఇంటర్వెల్ లో రమ్యకృష్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి.. నరసింహ లో రజనీని డామినేట్ చేసేలా నటించిన రమ్యకృష్ణకి.. ఇన్నేళ్ల తరవాత కూడా మా హీరో ఆమెను నోరు చాపుకుని చూసేలా నటించాడని ఆయన అభిమానులు హ్యాపీ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ సినిమాని తీయడంలో ( Jailer Review and Rating ) దర్శకుడు చాలా బాగా సక్సెస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ఆఫ్ మొదలయిన తరవాత సినిమాని చాలా దారుణంగా తీసాడు దర్శకుడు. చాల సేపటి వరకు ప్రతీ సీన్ మీద విసుగు వస్తాది. ఇక తమన్నా పాత్ర అస్సలు ఏమి లేకపోవడమే కాకుండా.. ఉన్న కొంచెం సేపు కూడా అసలు నచ్చలేదు. ఎదో ఒక సాంగ్ మాస్ అట్రాక్షన్ అవ్వాలి తప్పా.. ఇక తమన్నాతో సినిమాలో ఏమి పని లేదు. తమన్నా, సునీల్ మీద జరిగిన కొంచెం సేపు స్క్రీన్ ని కామెడీతో నింపాలి అనుకున్నా.. చిరాకు తప్పా నవ్వు మాత్రం ఎవరికీ రాలేదు.

ఇక విలన్ చెప్పిన ఒక పని చేయడం కోసం రజనీకాంత్ సినిమాని అంత సాగదీస్తూ.. ఆ క్రమంలో ఇలాంటి సీన్స్ తీయడం సినిమాకి చాలా మైనస్. ఇక మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్ ఇలా అన్ని భాషల్లో స్టార్స్ కథతో విలీనం అయ్యేలా వాడాడు గాని.. ఆ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇకపోతే రజనీకాంత్ జైలర్ గా పని చేసిన తీరుని చూపించే ఫ్లాష్ బ్యాక్ కూడా యావరేజ్ అనిపించింది తప్పా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాని చాలా విసుగ్గా తీసుకుని వెల్తూ.. క్లైమాక్స్ దగ్గరకి వచ్చేటప్పటికి సినిమా హైప్ ని పెంచాడు దర్శకుడు. ఫస్ట్ ఆఫ్, క్లైమాక్స్ బాగా తీసిన దర్శకుడు.. సెకండ్ ఆఫ్ మీద కూడా కొంచెం మనసు పెట్టి చేసి ఉంటె బాగుణ్ణు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ లో హాస్పిటల్ లో కామెడీ కూడా బాగానే ఉంది కానీ.. సెకండ్ హాఫ్ లో అలాంటి కామెడీ అనేది లేదు. సినిమాలో పెద్ద గొప్ప గా ఉండే పాటలు లేవు. అనిరుద్ మ్యూజిక్ మాత్రం రజనీ హీరో యిజాన్ని హైలెట్ చేసింది.

See also  Ganesh Chaturthi - Klin Kaara : మెగా వారి గణేష్ చతుర్థి వేడుకలో క్లింకార చేసిన సందడి ఫోటోలు వైరల్..

ఈ సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. చాలా పాత కథే.. అలాగే ప్రేక్షకుడు ప్రతీది ముందుగా కొంచెం గెస్ కూడా చేయగలుగుతాడు. అయితే ఈ సినిమా మొత్తానికి రజనీకాంత్ మాత్రమే ఆక్సిజన్. రజనీకాంత్ మాత్రం ఎక్కడా కూడా తన స్టైల్ తగ్గనివ్వలేదు. ఈ వయసులో కూడా రజనీకాంత్ ఆయన డైలాగ్ చెప్పినా, కామెడీ చేసినా, యాక్షన్ చేసినా, స్టైల్ చూపించినా, ఇంకా ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారంటే నిజంగా ఆయనను ఎంత పొగిడినా తక్కువే. చాలాకాలం తరవాత రజనీకాంత్ ముఖంలో ఈ సినిమాలో మంచి కళాకాంతులు కనిపించాయి. రజనీకాంత్ మీద ఇష్టం ఉన్నా, అయన అభిమాని అయినా కూడా ఈ సినిమా తప్పకుండా చూసి.. కడుపు నిండా చాన్నాళ్లకు బిరియాని తిన్నట్టు ఫీల్ అవ్వచ్చు. మిగిలిన ఆడియన్స్ సెకండ్ హాఫ్ ఈ సినిమాకి ఎందుకు వచ్చామని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సినిమా క్లైమాక్స్ ముందు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మొత్తం మీద సినిమా అబౌవ్ యావరేజ్ గా ఉంది. ( Jailer Review and Rating )

రేటింగ్ : 2. 75 / 5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే.. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.