Home Cinema Spy Review : వాళ్ళని దారుణంగా వాడేసుకునే ఈ ట్రెండ్ ని ఎవరు తప్పిస్తారో.. స్పై...

Spy Review : వాళ్ళని దారుణంగా వాడేసుకునే ఈ ట్రెండ్ ని ఎవరు తప్పిస్తారో.. స్పై రివ్యూ మరియు రేటింగ్..

who-will-avoid-this-trend-of-using-them-nikhil-spy-movie-review-and-rating

Spy movie Review : చిత్రం: స్పై (Spy )
తారాగణం: నిఖిల్ సిద్దార్ధ్ , ఐశ్వర్య మీనన్ , రానా దగ్గుపాటి, ఆర్యన్ రాజేష్, నితిన్ మెహతా మొదలగువారు..
కెమెరా: మార్క్ డేవిడ్, వంశీ పట్చిపులుసు
సంగీతం: శ్రీ చరణ్ పాకల, విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం : బి హెచ్ గ్యారీ
విడుదల తేదీ: 29 జూన్ 2023 ( Nikhil Spy Review and Rating )

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా, బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా స్పై ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై చాలామందికి భారీ అంచనాలే ఉన్నాయి. సాధారణంగా నిఖిల్ సినిమా అంటే పెద్ద అంచనా లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా మాత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయింది. మరి ఎంతవరకు ప్రేక్షకులను గెలుచుకుందో కథలోకి వెళ్లి చూద్దాం.

సినిమా మొదలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అబ్దుల్ ఖాదర్ ని పట్టుకునేందుకు రా ఏజెంట్స్ వెళ్తారు. వెళ్లి అతన్నీ హతమార్చి నట్టు చూపించి.. అక్కడితో కట్ చేసి.. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత నుంచి సినిమా మొదలవుతుంది. జై ( నిఖిల్ ) ఒక రా ఏజెంట్. శ్రీలంకలో ఒక మిషన్లో జై ఎంట్రెన్స్ ఉంటుంది. జై తో పాటు మరొక ఏజెంట్ కమల్ ( అభినవ్ ) కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ మిషన్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వస్తారు. హైదరాబాదులో జై ఫ్యామిలీ ఉంటుంది. జై కి ఒక అన్న కూడా ఉంటాడు. అతను అన్న పేరు బోస్ ( ఆర్యన్ రాజేష్ ) ఇతను కూడా రా ఏజెంట్. అయితే అన్న మరణం ఆ ఇంట్లో చాలా బాధను కలిగిస్తాది. తల్లిదండ్రుల బాధలో ఉంటారు. జై కి రా ఏజెన్సీ మరొక ఆపరేషన్ అప్పజెప్తుంది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అబ్దుల్ ఖాదర్ ని పట్టుకోమని.. అతన్నీ పట్టుకునే క్రమంలో.. ఒక టీం ని జై కి ఇస్తారు. ఆ టీమ్ లో వైష్ణవి ( ఐశ్వర్య ) కూడా ఉంటుంది. అయితే మొదట ఐశ్వర్యని ఆ టీంలో వద్దని జై చెప్తాడు. కానీ వైష్ణవిని ఉంచి తీరాలని హెడ్ చెప్పడంతో.. జై ఏమీ చేయలేక ఊరుకుంటాడు. అయితే ఈ టీమంతా అబ్దుల్ ఖాదీర్ని పట్టుకోడానికి వెళ్ళిన క్రమంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు వాళ్లకు తెలుస్తాయి. వాళ్ళ అన్న మరణం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటాడు జై. మధ్యలో సుభాష్ చంద్రబోస్ కథ కూడా మిక్స్ అవుతుంది. అయితే అసలు జై అన్న ఏమయ్యాడు? జై.. వైష్ణవిని టీం లో ఎందుకు వద్దన్నాడు? అసలు ఈ కథలోకి సుభాష్ చంద్రబోస్ కథ ఎందుకు వచ్చింది? చివరికి అబ్దుల్ ఖాదీర్ ని పట్టుకున్నారా? ఏమయింది ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Manchu Manoj: వైరల్ న్యూస్.. మంచు విష్ణు గురించి సంచలమైన వ్యాఖ్యలు చేసిన మంచి మనోజ్..

who-will-avoid-this-trend-of-using-them-nikhil-spy-movie-review-and-rating

సినిమా ఎలా ఉందంటే.. సినిమా మొదలు ( Nikhil Spy Review and Rating ) బాగానే స్టార్ట్ చేసాడు అనిపించింది. ఆ తరవాత హీరో నిఖిల్ ఎంట్రెన్స్ బాగానే అనిపించింది. ఆ తరవాత నుంచి ప్రేక్షకుడు అసలు కథలోకి సినిమా ఎప్పుడు వెళ్తాది అని తెగ ఎదురు చూస్తాడు గాని.. పాపం ప్రేక్షకుడు అనుకునే అసలు కథలోకి సినిమా ఎప్పుడూ వెళ్ళదు. ఎందుకంటే.. ప్రేక్షకుడు అనుకునే కథని సినిమాగా తియ్యలేదు. అసలు వాళ్ళు తీసే సినిమాని ప్రేక్షకుడు కథ అనుకోవడం ఏమిటని అనుకుంటున్నారా? అవును నిజమే ఎందుకంటే సినిమా వాళ్ళు చూపించిన టీజర్, ట్రైలర్, వాళ్ళు ప్రమోషన్ చేసే విధానం, సుభాష్ చంద్రబోస్ లోగో ని వాడిన తీరు చూసి, ప్రేక్షకుడు ఒకటి ఊహించుకుని వెళ్తాడు. సుభాష్ చంద్రబోస్ మరణం భారతదేశ ప్రజలందరికీ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికి ఒక మిస్టరీనే.

who-will-avoid-this-trend-of-using-them-nikhil-spy-movie-review-and-rating

ఆ మిస్టరీని ఛేదించేందుకు ఒక రా ఏజెంట్ ప్రయత్నమే ఈ సినిమా అని అందరికి అర్ధమయ్యింది. అలానే ఈ సినిమా గురించి ఎక్కువగా ప్రమోషన్ కూడా అయ్యింది. అలా అందరూ అనుకోవడానికి కూడా ట్రైలర్ లో నిఖిల్ పొలిటికల్ హిస్టరీ బుక్స్ చదువుతున్నట్టు కూడా చూపించాడు. అంటే పొలిటికల్ గా మన హిస్టరీని హీరో ఇంటరెస్ట్ గా తెలుసుకుని.. అందులో మిస్టరీ గా మిగిలిపోయిన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ తెలుసుకునేందుకు ( Nikhil Spy Review and Rating ) బయలుదేరతాడు అన్నట్టు అనిపించింది. కానీ ఇదంతా కేవలం ఆడియన్స్ లో ఆత్రుతని పెంచి సినిమా హాల్ కి తీసుకు వచ్చే ప్రయత్నం మాత్రమే. ఈరోజుల్లో ప్రమోషన్ అవసరమే. కానీ మన దగ్గర ఉన్న కంటెంట్ ని ప్రమోట్ చెయ్యాలి గాని.. లేని దానిని ఉందన్నట్టు ప్రమోట్ చేయడం వలన మొదటికే మోసం వస్తాది అనడానికి ఈ సినిమా బెస్ట్ ఉదాహరణగా ఉంటాదేమో..

ఎందుకంటే.. అసలు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ని అయితే ఈ సినిమాలో ఓపెన్ చెయ్యలేరని అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే చరిత్ర మనకు చెప్పని ఆ నిజాన్ని వీళ్ళు మనకి చెప్పలేరు. కానీ.. హిస్టరీ లో కొన్ని పాయింట్స్ ని పట్టుకుని.. ఆయన్ను తెలుసుకునేందుకు వెళ్లే దారిలో ఎన్నో సీన్స్ ని హైలైట్ చేస్తూ చూపిస్తారని.. కానీ కంక్లూజన్ ఎలా ఇస్తారని ఆరాటంతో ఈ సినిమాకి అందరూ వెళ్తారు. అలా వెళ్లిన ప్రేక్షకుడికి కచ్చితంగా ( Nikhil Spy Review and Rating ) ఈ సినిమా నచ్చదు. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ అది కాదు. రా ఏజెంట్స్ ఆపరేషన్స్ ఇలాంటి సినిమాలు ఇప్పటికి మనం చాలా చూసాం. అలానే రొటీన్ గానే ఈ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో నిఖిల్ నటన ఎప్పటిలానే బాగానే ఉంది. పాత్రకి తన పెర్సొనాలిటీ, పేస్ అన్ని బాగానే సూట్ అయ్యాయి. ఇక సినిమాలో హీరోయిన్ కి మంచి పాత్ర అయితే ఇచ్చారు గాని.. మంచి సీన్స్ మాత్రం ఇవ్వలేకపోయారు.

See also  Lakshmi Pranathi: చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి!

who-will-avoid-this-trend-of-using-them-nikhil-spy-movie-review-and-rating

హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటన పరవాలేదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ యావరేజ్ గా ఉంది. ఇక సినిమాలో హీరో పక్కన ఉన్న నటుడు అభినవ్ కి ఇచ్చిన డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. అంత పెద్ద ఆపరేషన్స్ కి హీరో పక్కన రా ఏజెంట్ ఒక కమెడియన్ ని ఇవ్వడం, ఇంకెవ్వరిని ఇవ్వకపోవడం సినిమాలో చాలా విచిత్రంగా ఉంటాది గాని.. ఆ కామెడీ డైలాగ్స్ కూడా లేకపోతే ప్రేక్షకుడు కనీసం నవ్వు కూడా లేకుండా ఉంటాడు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఎమోషన్ గాని, సెంటిమెంట్ గాని, దేశభక్తి గాని, లవ్ గాని ఏదీ ఫీల్ అవ్వలేదు కాబట్టి.. కనీసం ఇతని కామెడీ డైలాగ్స్ కొంచెం గాలి ఆడినట్టు అనిపించింది. ఇక విలన్స్ వాళ్లకు ఇచ్చిన పాత్రకి వాళ్ళు బాగానే చేసుకుని వెళ్లిపోయారు. ఇక సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో రానా ఉన్నాడు కదా అనే విషయం మరచిపోవడం వలన.. రానా రాగేనే అవును రానా ఉన్నాడుగా అనిపించింది.

 

ఇక రానా డైలాగ్స్ మాత్రం కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. స్వాతంత్రం అనేది లాక్కుంటేనే వస్తాది అని చెబుతాడు. మన హిస్టరీ మనకు చెప్పిన దానికి బిన్నంగా అనిపించాయి రానా డైలాగ్స్. సుభాష్ చంద్రబోస్ గురించి రానా చాలా ఆవేశంగా చెప్పాడు గాని.. ఆడియన్స్ దానిని అంత ఆవేశంగా తీసుకోలేదు. అలా తీసుకునే విధంగా సినిమా మెప్పించలేకపోయింది. సినిమాలో పాటలు పెద్ద గొప్పగా లేవు. ఇలా సీన్స్ పరంగా చూసుకుంటే.. ప్రతీ సీన్ లో మూడు సీన్స్ ని చూపిస్తుంటాడు. మూడు చోట్ల ఎం జరుగుతాది అని ప్రేక్షకుడు ఆత్రంగా చూడాలని దర్శకుడి ఉద్దేశం. కానీ అలాంటి సీన్ సినిమా మొత్తం మీద ఒకసారి ఉంటె ఆ సీన్ ఇంట్రెస్టింగ్ గాను ఉంటాది, అది గుర్తు కూడా ఉంటాది. ఈ సినిమాలో అసలు అన్ని సీన్స్ అలానే ఉండటం వలన.. ఏ సీన్ కూడా ప్రేక్షకుడు పెద్దగా గుర్తుంచుకోలేదు.

See also  Rajamouli: తన పై ఆ దర్శకుడు విసిరిన సవాల్ కి రాజమౌళి ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు?

ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే తీసాడు దర్శకుడు. కానీ ఇంటర్వెల్ తరవాత దీనికా ఇంత కటింగ్ ఇచ్చాడు అనిపిస్తాది. ఇక ఈ సినిమా కథ ఒకందుకు స్టార్ట్ అయితే.. మధ్యలో సుభాష్ చంద్రబోస్ ఫైల్ ని దూర్చడం అర్ధం లేదని అనిపించింది. పోనీ దూర్చినా కూడా.. అంత గొప్ప స్వాతంత్ర సమరయోధుడిని వాడినా కూడా.. ఎవరిని మెప్పించలేకపోవడం నిజంగా బాధాకరమే. ఇక ఈ సినిమా లో మంచు కొండల్లో తీసిన సెన్స్ చూడటానికి బాగున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటాది అని తెగ మీడియా రాసింది కానీ.. హాలీవుడ్ రేంజ్ అంటే ఆ రేంజ్ లో ఫైట్స్, రొమాన్స్, సూపర్ బడ్జెట్ ఊహించకండి. హాలీవుడ్ రేంజ్ లో ఎక్కువ దేశాలు తిప్పుతాడు. ఒకే ప్లేస్ లో ఉంచడు. ఇక సినిమా క్లైమాక్స్ అయితే చాలా చీప్ గ, చిరాగ్గా అనిపించింది. ఏమిటో పిక్నిక్ వెళ్లి నట్టు.. ఇద్దరు ఆడాళ్ళు, ఇద్దరు మగాళ్లు వెళ్లి మొత్తం సాధించుకుని వచ్చేసారు.

అన్ని సినిమాల్లో అలానే అవ్వచ్చు గాని.. ఈ సినిమాలో మనసు ఒప్పుకోలేదు. అసలే జనాలు ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా చూసి.. ఇది రామాయణం కాదు.. ఇందులో చాలా మార్పులు ఉన్నాయని, పాత్రలు అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని ఎన్నో రకాలుగా ఫీల్ అయ్యారు. ఆ దర్శకుడు రామాయణాన్ని తీయలేదని.. అతను అంత బడ్జెట్ లో ఒక సినిమాని తీసే క్రమంలో రామాయణాన్ని వాడుకున్నాడని చివరికి డిసైడ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ దర్శకుడు ఇతను తీసే ఒక రా ఏజెంట్ కథకి సుభాష్ చంద్రబోస్ ని వాడుకున్నాడు అంతే.. ఈ సినిమా చూసిన ఆడియన్స్.. దేవుడిని, దేశ భక్తులని కూడా వదలకుండా.. వీళ్ళ సినిమాలకు వాడుకునే ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. దీనిని ఆపేది ఎవరో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకి రిపీట్ ఆడియన్ అయితే మాత్రం ఉండరు. అలాగే ఎదో పిల్లలకి రా ఏజెంట్ సినిమా ఇంట్రస్ట్ గా ఉంటాదని తీసుకుని వెళ్తే వెళ్లుచ్చు. మొత్తం మీద నిఖిల్ సూపర్ హిట్ మూవీని మాత్రం ఈ సారి తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ( Nikhil Spy Review and Rating )

రేటింగ్ : 2.25/5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.