Home Cinema Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.....

Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

Bhagavanth-Kesari-movie-review

చిత్రం: భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )
తారాగణం: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌, శ్రీలీల తదితరులు..
కెమెరా: రామ్ ప్రసాద్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నిర్మాతలు : సాహు గార‌పాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ:19 october 2023 ( Bhagavanth Kesari Review and Rating )

నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా, శ్రీలీల ముఖ్యపాత్రలో, అనిల్ రావిపూడి దర్శకతంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్పటివరకు ఫ్లాప్ రుచి చూడలేదు పైగా బాలయ్య టైం కూడా బాగుంది. ఇంకా శ్రీలీలకు మంచి క్రేజ్ ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒక సరి కథలోకి వెళ్లి చూద్దమా..( Bhagavanth Kesari Review and Rating )

కథ.

సినిమా మొదలు ఒక హైకోర్టు జడ్జి ఒక తీర్పు ఇవ్వడం వలన.. విలన్ లో వాళ్ళని తరపున వస్తుంటే ఆ కుటుంబం ఒక చోట దాకొని ఉంటుంది. అక్కడికి వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఒక వ్యక్తి వేరే సేఫ్ ప్లేస్ లో పెడతానని చెప్పి.. అంతకంటే ముందు వాళ్లకు ఒక కథ చెబుతానని భగవంత్ కేసరి కథ చెప్తానని స్టోరీ మొదలుపెడతాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. భగవాన్ కేసరి ( బాలకృష్ణ ) ఆదిలాబాద్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న జైలర్ ( శరత్ కుమార్ ) కి భగవంత్ కేసరి పై మంచి అభిప్రాయం కలుగుతుంది. ఆ తర్వాత జైలర్ చనిపోతాడు. ఆ జైలర్ కూతురు విజ్జి ( శ్రీలీల ) కి భగవంత్ కేసరి సంరక్షకుడు అవుతాడు. విజ్జిని ఎలాగైనా ఆర్మీకి పంపాలనుకుంటాడు భగవంత్ కేసరి. ఆ ప్రయత్నంలో విజ్జి కి ఇష్టం ఉన్న లేకపోయినా చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాజల్ అగర్వాల్ సైకోలాజికల్ డాక్టర్. ఆమె భగవంత్ కేసరి ని ప్రేమించమే కాకుండా.. విజ్జి విషయంలో భగవంత్ కి హెల్ప్ చేషుతుంది. ఈ క్రమంలో ఒక రాజకీయ నాయకుడు కుమారుడు వ్యాపారవేత్త అయిన విలన్ ( అర్జున్ రామ్ పాల్ ) విజ్జిని చంపాలని అనుకుంటాడు. భగవంత్ కేసరి తన ఎంతో ప్రేమగా, అల్లరి ముద్దుగా కూతురులా పెంచుకున్న విజ్జిని ఎలా కాపాడుకుంటాడు? అసలు ఆ విలను ఎందుకు విజ్జిని చంపాలనుకుంటాడు? భగవాన్త్ కేసరి ఎందుకు అసలు జైల్లో ఫస్ట్ శిక్ష అనుభవిస్తూ ఉంటాడు? విజ్జి కి సంరక్షకుడిగా ఎందుకు అవుతాడు? విజ్జి ఆర్మీ కి వెళ్తుందా? అసలు విజ్జికి కాజల్ హెల్ప్ ఏమి అవసరం అయ్యింది? చివరికి ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..( Bhagavanth Kesari Review and Rating )

See also  Chiranjeevi: మనవరాలి బారసాలకి వచ్చినందరికి చిరంజీవి బంగారు కానుకలు.. ఏమిచ్చాడంటే..

 

సినిమా ఎలా ఉందంటే..

అనిల్ రావిపూడి సినిమా అంటే చాలా కామెడీ ని, ఎంటర్టైన్మెంట్ ని ఆశించి వెళ్తారు ప్రేక్షకులు. కానీ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా స్లో గా నడిచినట్టు అనిపిస్తుంది. సెకండ్ అఫ్ కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ విషయానికి వస్తే.. ఆయనకు ఇచ్చిన పాత్రకి ఆయన బాగానే న్యాయం చేస్తూ.. ఆయన ధోరణిలో ఆయన నటించుకుంటూ వెళ్లిపోయారు. కాకపోతే అఖండ, వీర సింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తరవాత బాలకృష్ణ సినిమాని అంచనా వేసినట్టుగా ఈ సినిమా లేదు. బాలకృష్ణ తన ఏజ్ కి తగ్గ పాత్ర చేసారు. పవర్ఫుల్ డైలాగ్స్ తో, ఎమోషనల్ గా ( Bhagavanth Kesari Review and Rating ) అలజడి రేపే బాలకృష్ణతో..దర్శకుడు తన మార్క్ ని చూపించడానికి.. బాలయ్య మార్క్ ని డిస్టర్బ్ చేసినట్టుగా కొన్ని సీన్స్ అనిపించాయి. ఇక బాలయ్యకి ఎలాంటి డైలాగ్ ఇచ్చినా అదరగొట్టడం.. ప్రేక్షకులను పెంమించడం చాలా సహజం. ఇందులో కూడా అలానే తనకు ఇచ్చిన డైలాగ్స్ కి ఆయన న్యాయం చేసారు గాని.. ఆడిపోయే సీన్ లా ఏ సీన్ మైండ్ కి గుర్తు ఉండిపోయేలా లేదు. టోటల్ గా బాలయ్య అయితే అయన వరకు బెస్ట్ గానే చేసారు.

Bhagavanth-Kesari-movie-review-rating-Balakrishna

ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర శ్రీలీల. ఈ సినిమాతో శ్రీలీలకి ఇంకా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఈ సినిమాలో ఆమెకు ఇచ్చిన పాత్ర ఆమె బాగానే చేసింది. అందానికి అందం, డాన్స్ కి డాన్స్, ఫైట్స్ కి ఫైట్స్ అన్ని అడగొట్టింది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో కూడా అంత హైలెట్ గా లేకపోయినా.. బాగానే చేసింది. తీన్ మార్ సాంగ్ లో శ్రీలీల డాన్స్ సూపర్ గా ఉంటాది. ఇక క్లయిమాక్ కూడా శ్రీలీల ఫైట్స్ ( Bhagavanth Kesari Review and Rating ) బావుండటమే కాకుండా.. ఆమెకు సూట్ కూడా అయ్యాయి. ఈ సినిమా దర్శకుడు, హీరో కి కంటే కూడా శ్రీలీలకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నటించిన కాజల్ అగర్వాల్ కి పెద్ద పాత్ర లేనప్పటికీ.. రొమాంటిక్ సీన్స్ ఇవ్వకుండా..ఆమెకు రెస్పొన్సిబల్ పాత్ర ఇచ్చారు గాని.. ఆమె పాత్ర ఎవ్వరిని మెప్పించకపోగా.. కాజల్, బాలయ్య సీన్స్ చాలా బోర్ గా కూడా ఫీల్ అయ్యారు ఆడియన్స్.

See also  Tollywood Star Directors: ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కు ఎందుకు అంత మోజు ఈ హీరోయిన్లలు అంటే..

ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన అర్జున్‌ రాంపాల్‌ పాత్ర అస్సలు బాలేదు. అతను అతని స్టైల్ లో బాగానే చేసాడు గాని.. చేయడానికి అంత రోల్ లేదు. అసలు ఈ సినిమా చూసి బాలయ్య అభిమానులు పూర్తి బిరియాని తిన్నట్టు ఎందుకు లేదంటే.. విలన్ పాత్ర అంత వీక్ గా ఉండటం వల్లనే. విలన్ గురించి ( Bhagavanth Kesari Review and Rating ) పాత్ర రాయడంలో గాని, సీన్స్ తీయడంలో గాని, అసలు విలన్ పాత్ర ఇలాంటి సినిమాలకి ఎంత స్ట్రాంగ్ ఉండాలని గాని దేని మీద కూడా శ్రద్ధ లేనట్టుగా సినిమాని తీసాడు అనిల్ రావిపూడి.ఇక పాటలు విషయానికి వస్తే సినిమాలో పాటలు యావరేజ్ గా ఉన్నాయి తప్పా.. పెద్దగా సూపర్ హిట్ లేవు. సినిమా మూల కథలోనే ఎదో భలం లేదా? లేక మంచి కథని బలహీనంగా తీసాడా దర్శకుడు అని ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ లో పడేసాడు దర్శకుడు. సినిమాలో విలన్ తండ్రి కోసం, తండ్రి కోరిక తీర్చడం కోసం ఏమైనా చేస్తాడు.. తండ్రిని ప్రేమించేవాడికి.. కొడుకుని ప్రేమించే గుణం లేకుండా తన నెంబర్ 1 అవ్వాలనే విష్ కోసం చంపేయడం ఎదో తేడాగా అనిపించింది.

See also  Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. అవకాశాలు అందుకోవడం కోసమేనా.??

Bhagavanth-Kesari-movie-review-rating-nandamuri

బాలకృష్ణ శ్రీలీల ని ఇబ్బంది పెట్టిన వాడి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన సీన్ బాగానే ఉంది. శ్రీలీల, బాలయ్య మధ్య కొన్ని సెంటిమెంట్ సీన్స్ యావరేజ్ గా బాగానే ఉన్నాయి. బస్సు లో ఫైట్ ని బాగా కామెడీ గా పండించాలని చూసారు గాని.. పరవాలేదు కొంచెం నవ్వు వచ్చింది కానీ.. ఇటీవల చూసిన జవాన్ సినిమా గుర్తుకువచ్చింది. అలాగే బాలకృష్ణ విలన్స్ ని ఎదుర్కునే సమయంలో.. తాను ఫ్లాష్ బ్యాక్ లో హెల్ప్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి.. విలన్స్ తో ఫైట్ చేయడానికి, తన వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్ కాపాడ్డానికి ఉపయోగపడిన సీన్స్ చూస్తే రజనీకాంత్ జైలర్ సినిమా గుర్తుకు వచ్చింది. ఇక తండ్రి గాని గురువు గాని ఒక అమ్మాయిని ఎదో ఒక్కదానిలో సక్సెస్ చేయాలనే గోల్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ అందులో మనకు సూపర్ గా గుర్తుండిపోయిన దంగల్,అశ్వని ఇలాంటివి చాలా ఉన్నా కూడా వాటిని మరిపించేలా గాని, కనీసం పోల్చేలా గాని సినిమాలో సీన్స్ లేవు. సినిమా ఫస్ట్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ క్రెడిట్ ఎక్కువగా.. శ్రీలీలకి దక్కింది. సెకండ్ హాఫ్ కూడా కొన్ని సీన్స్ పరవాలేదు కానీ.. విలన్ తో నడిచే ట్రాక్ లో అస్సలు నేరేషన్ బాలేదు. సినిమాని ఆ మాత్రం నిలబెట్టింది కేవలం బాలకృష్ణ, శ్రీలీల మాత్రమే. దర్శుకుడు అనిల్ రావిపూడి కి మాత్రం ఇది ఊహించినంత హిట్ మాత్రం కాదు. ఈ సినిమా గాని బ్లాక్ బస్టర్ హిట్ అయితే స్టార్ దర్శకుల లిస్ట్ లోకి వెళ్లే అవకాశము దొరుకును గాని.. ఈ సినిమా తో అనిల్ రావిపూడి సాధించలేకపోయాడనే చెప్పచు.

రేటింగ్ : 2.5/5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.