Home Reviews Vimanam Review : తండ్రి పోతే ఎలా బ్రతకాలనే.. మరి బిడ్డ పోతే ఏమనిపిస్తాది?

Vimanam Review : తండ్రి పోతే ఎలా బ్రతకాలనే.. మరి బిడ్డ పోతే ఏమనిపిస్తాది?

the-difference-between-the-feeling-of-the-father-death-and-the-son-death-vimanam-review-and-rating

Vimanam Review : చిత్రం: విమానం ( Vimanam )
తారాగణం: స‌ముద్రఖ‌ని, అన‌సూయ, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌ తదితరులు..
కెమెరా: వివేక్ కాలేపు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
సంగీతం: చ‌ర‌ణ్ అర్జున్‌
నిర్మాత: జీ స్టూడియోస్. కిరణ్ కొర్రపాటి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ ప్ర‌సాద్ యానాల‌
విడుదల తేదీ: 09 జూన్ 2023 ( Vimanam Movie Review and Rating )

స‌ముద్రఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌ ముఖ్య పాత్రలలో శివ ప్ర‌సాద్ యానాల‌ దర్శకత్వంలో రూపొందిన విమానం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు అయితే లేవు. చిన్న బడ్జెట్ తో.. స్టార్డమ్ లేకుండా సింపుల్ గా తీసిన ఈ సినిమా పై అంచనాలు పెద్దగా లేకపోయినా.. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం అంచనాలు పెంచుకున్నారు. అలాగే దర్శకుడు రాఘవేంద్ర రావు గారు లాంటి వారు ఈ సినిమా ట్రైలర్ చూసి రివ్యూ ఇవ్వడంతో సినిమా పై కొంచెం అంచనాలు పెరిగాయి. అసలు ఈ సినిమా ఎలా ఉందొ కథలోకి వెళ్లి చూద్దాం..

కథ.

2008 సంవత్సరంలో.. హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్ లో.. ఫ్లైట్ ల్యాండింగ్ అవుతూ సినిమా మొదలవుతుంది. ల్యాండ్ అవుతున్న ఆ ఫ్లైట్ ని చూస్తూ రాజు ( మాస్ట‌ర్ ధ్రువ‌న్‌ ) వెనక్కి వస్తాడు.. అక్కడ తన తండ్రి వీరయ్య ( స‌ముద్రఖ‌ని ) కొడుకుని పట్టుకుంటాడు. అలా సినిమాలో తండ్రి కొడుకుల్ని పరిచయం చేస్తూ మొదలవుతింది. వీరయ్య – రాజు ఈ తండ్రి కొడుకులిద్దరూ హైదరాబాదులోని బేగంపేటకు దగ్గరలో ఒక మురికివాడలో బ్రతుకుతుంటారు. వీరయ్య సులాబ్ కాంప్లెక్స్ నడుపుతూ ఉంటాడు. అలాగే ఈ కాంప్లెక్స్ లో డ్రైవర్ డాని ( ధనరాజ్ ) అతనికి ఒక భార్య, ఒక కొడుకు కూడా ఉంటారు. అలాగే అక్కడే చెప్పులు కుట్టుకునే కోటి (రాహుల్ రామకృష్ణ ) అక్కడే వ్యభిచారం చేసుకునే సుమతి ( అనసూయ ) ఉంటుంది. రాజుకి విమానం అంటే చాలా పిచ్చి ఎప్పటికైనా విమానం ఎక్కాలి అనేది తన కోరిక.. అలాగే తల్లి లేని బిడ్డ అవడం వల్ల కొడుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు వీరయ్య. తన కొడుక్కి విమానం పిచ్చి తగ్గించాలని అనుకుంటూ ఉంటాడు కానీ.. తగ్గించలేకపోతుంటాడు. అయితే ఒకరోజు కొడుకు జబ్బుతో ఉన్నాడని చనిపోతాడని తెలిసిన వీరయ్య కొడుకుని ఎలాగైనా విమానం ఎక్కించాలని అనుకుంటాడు. అయితే వీరయ్య కొడుకుని విమానం ఎక్కించగలిగాడా? ఎక్కించలేకపోయాడా? చివరికి ఏమవుతుంది? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

See also  Ustaad movie review : ఉస్తాద్ సినిమాలో ఏ ఏ పాత్ర ఎం చెబుతుంది.. రివ్యూ మరియు రేటింగ్..

the-difference-between-the-feeling-of-the-father-death-and-the-son-death-vimanam-review-and-rating

సినిమా ఎలా ఉందంటే.. ( Vimanam Movie Review and Rating )

సినిమా మొదలు 15 నిముషాలపాటు ట్రైలర్ లో చూపించినవే ఉంటాయి. తరవాత ఏముంటుందో అని ఆత్రంగా చూడాలనుకున్నా.. పెద్దగా తెలియని ట్విస్ట్ ఏమి ఉండవు. పరిచయాలతో సినిమాని చాలా సాగదీసాడు దర్శకుడు శివ ప్ర‌సాద్ యానాల‌. అక్కడ నుంచి సినిమా మొత్తం తండ్రి కొడుకుల తోనే సాగుతుంది. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని తప్పదన్నట్టు వచ్చి.. వాటి పని అవి చేసి పోతాయి. సినిమాలు హీరోలు అయినా స‌ముద్రఖ‌ని, మాస్టర్ ద్రువన్ ఇద్దరూ చాలా బాగా నటించారు. ఒక విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు. కేవలం వీళ్లిద్దరి డ్రామాతో సినిమాని హిట్ చెయ్యవచ్చని అతని మీద అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. సినిమా కథ మూలం అయితే బాగుంది. చిన్న బడ్జెట్ తో ఒక సెంటిమెంట్ ని పట్టుకుని సినిమా తీస్తే.. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు.

కానీ దానికి సినిమాకి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వాలి.అలా అవ్వకపోతే ఎంత పెద్ద సినిమా అయినా.. చిన్న సినిమా అయినా హిట్ అవ్వడం కష్టం. దర్శకుడు వీరయ్య క్యారెక్టర్ ని బాగా రాసుకున్నాడు. ఒక కాలు లేకపోయినా కూడా తన కష్టంతో తాను బతకడం.. పోలీస్ 100 రూపాయలు ఇస్తే.. వద్దంటే.. ఏమి మందు అలవాటు లేదా అంటే.. కాదు నాది కానిది తీసుకోవడం నాకు అలవాటు లేదు అని అన్న డైలాగ్ బాగుంది. అలాగే కొడుకు కోసం తండ్రిగా వీరయ్య పాత్ర పడే తపన బాగుంది అనిపించింది తప్ప.. మరీ అంతగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇక దర్శకుడు చాలా న్యాచురల్ గా తీసే క్రమంలో మురికివాడాలో బ్రతికే జీవన విధానాలు, సులబ్ కాంప్లెక్ పాతది ఎలా ఉంటాది అనేవి బాగానే తీసాడు.

ఇకపోతే సినిమా రాజు పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ కుర్రాడు తన పాత్రకు తాను బాగానే న్యాయం చేసాడు. సినిమా కథ చాలా సామాన్యమైనది. ఇందులో కొత్తదనం. ఎవరూ ఊహించలేనిది ఏమి లేదు. అయినా కూడా సెంటిమెంట్ కథలలో కొత్తదనం అవసరం ఎల్దు కానీ.. దానిని పండించగలిగే నటులు.. వాళ్ళతో అలా చేయించగలిగే ( Vimanam Movie Review and Rating ) దర్శకుడు ఉండాలి. ఈ సినిమాలో సెంటిమెంట్ బాగా ఉందని అనిపించింది తప్పా.. ఫిల్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపించాయి. ఇక మొదటి నుంచి ఈ సినిమా లో అనసూయ పాత్ర గురించి చాలా గొప్పగా ఉంటాదని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఆమె పాత్రని అయితే సృష్టించాడు గాని దర్శకుడు.. ఈ సినిమా కథతో ఆమెని ఎక్కడా మింగల్ చేయలేకపోయాడు.

See also  Anni Manchi Sakunamule : అన్నీ మంచి శకునములే సినిమాలో ఎవరి మధ్య కెమిస్ట్రీ చూడాలంటే.. రివ్యూ మరియు రేటింగ్.

the-difference-between-the-feeling-of-the-father-death-and-the-son-death-vimanam-review-and-rating

కేవలం కొంతమంది ఆడియన్స్ ని అలరించడం కోసం ఆమె పాత్రని సృష్టించి.. చాలా మంచిగా చెడుని చూపించాడు దర్శకుడు. కానీ ఇలాంటి అవుట్ డేటెడ్ తెలివితేటలను ఇంటర్నెట్ కాలంలో ఆడియన్స్ ఇట్టె కనిపెట్టేస్తున్నారు. ఈ పాత్ర చివరికి ఎదో అద్భుతం చేస్తాది బి అందరూ ఎదురు చూసారు కానీ.. అంత సీన్ ఆమె పాత్రకి ఈ సినిమాలో ఇవ్వలేదు. సినిమాలో పెద్దవాళ్ళు చేసే ఏ కామిడీ కూడా బాలేదు. పిల్లలు విమానం గురించి మాట్లాడుకునేటప్పుడు.. వాళ్ళ సంభాషణ కొంత నవ్వు తెప్పించింది తప్పా ఇంకెక్కడా నవ్వు అనేది లేదు. నవ్వు లేకపోయింది ఏడుద్దామంటే.. ఆడియన్స్ ఎదో ఒక పాత్రలో బాగా కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సినిమాలో రోల్ ఉన్న పత్రాలు రెండే రెండు.

ఒకటి వీరయ్య రెండు రాజు. వీరయ్య పాత్రలో ఉండే పెయిన్ ఒకటి కొడుకు చచ్చిపోతాడని, రెండు వాడిని ఫ్లైట్ ఎక్కించడానికి టికెట్ డబ్బులు కావాలని.. ఈ రెండిట్లో సినిమాలో ప్రాణం పోతాదనే బాధ కంటే ఎక్కువగా.. విమానం ఎక్కించాలనే బాధ చూపించాడు. ఆ బాధని ఫీల్ అవ్వడానికి సినిమాకి టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్లలో చాలా మంది ఈ రోజుల్లో అంత చిన్న అమౌంట్ కోసం బాధలు పడటం లేదు. చేతిలో లేకపోతే అప్పు చేయడమో.. క్రెడిట్ కార్డు వాడటమో చేస్తున్నారు. మరీ అవిలేని వాళ్ళు 250 రూపాయలు పెట్టి సినిమాకి రావడమే కష్టం. అందుకని సీనియా చూసే ఆడియన్ అయ్యో పాపం అని జాలి పడుతూ సినిమా చూసాడు తప్పా.. ఆ సినిమాలో పాత్ర పెయిన్ ని ఫీల్ అవ్వలేకపోయాడు.

See also  Adipurush Review and Rating : ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ అందుకే తీసాడా.. రివ్యూ మరియు రేటింగ్..

జెర్సీ సినిమా కూడా తండ్రి కొడుకుల రిలేషన్ మీద వచ్చిన సినిమాకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ కూడా కొడుకు కోరికలు తీర్చడానికి సరైన డబ్బు చేతిలో ఉండదు కానీ.. అది చాలామంది మధ్య తరగతి తండ్రిని టచ్ చేస్తాది. అలాగే ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ తప్పితే .. ఇక సినిమాలో చూడటానికి అవి కాకుండా ఏవో ఒకటి రెండు తప్పితే అంతకంటే ఎక్కువ సీన్స్ లేవు. అయితే ఈ కథతో.. ఇంత చిన్న ( Vimanam Movie Review and Rating ) బడ్జెట్ తో సినిమాని ఆ మాత్రం లాగించిన దర్శకుడు కొంతవరకు బాగానే చేసినట్టు అనుకోవాలి. సినిమాలో కొడుకు గురించి వీరయ్య స్నేహితులకు చెప్పేటప్పుడు.. నా తండ్రి పోయినప్పుడు నేనెలా బ్రతకాలని అనుకున్నాను.. నా బిడ్డ పోతాడు అంటే నేనెందుకు బ్రతకాలని అనిపిస్తుంది అని అన్న డైలాగ్ దగ్గర ఆడియన్స్ కంట తడి పెట్టక తప్పలేదు.

the-difference-between-the-feeling-of-the-father-death-and-the-son-death-vimanam-review-and-rating

డబ్బు పిచ్చి పెరిగిపోయి, సొంత బంధాలను కూడా నాశనం చేస్తూ.. ఎప్పుడు అందరినీ ద్వేషిస్తూ.. ద్వేషించబడుతూ ఉండేలా తయారవుతున్న సమాజంలో.. మా పిల్లలకి ఎదో ఆస్తులు ఇచ్చేయాలని, వాళ్ళని గొప్పగా చూడాలని తపనలో తప్పుడు దారిలోకి కొందరు వెళ్లిపోయే ఈ లోకంలో.. ” నా కొడుకు చాలా గొప్పోడు అవ్వాలని అనుకున్నాను కానీ.. ఈ రోజు చాలా రోజులు బ్రతికితే చాలు అనిపిస్తుంది అనే డైలాగ్ తో అన్నిటికంటే.. ప్రాణం, ప్రేమ, బాధ్యత, మన అనుకునేవారి కోరికని తీర్చే దానిలో పడే శ్రమ, అది తీరేటప్పుడు కలిగే ఆనందం ఇలాంటివి అన్ని చూపించాలని దర్శకుడు అనుకున్నాడు గాని.. చూపించాడు కానీ.. ఆడియన్ కనెక్ట్ అయ్యేలా తీయలేకపోవడానికి కారణం ఏమిటో దర్శకుడికి తెలియాలి. మొత్తం మీద సినిమా యావరేజ్ గా ఉంది.

రేటింగ్ : 2.25/ 5

ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..