Home Cinema Adipurush Review and Rating : ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ అందుకే తీసాడా.. రివ్యూ...

Adipurush Review and Rating : ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ అందుకే తీసాడా.. రివ్యూ మరియు రేటింగ్..

om-raut-made-adipurush-movie-only-for-a-commercial-angle-review-and-rating

Adipurush Review : చిత్రం: ఆదిపురుష్ (Adipurush )
తారాగణం: ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, హేమా మాలిని, సన్నీ సింగ్ మొదలగువారు..
కెమెరా: కార్తీక్ పలని
సంగీతం: సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌
నిర్మాత: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్
దర్శకత్వం : ఓం రౌత్
విడుదల తేదీ: 16 జూన్ 2023 ( Adipurush Movie Review and Rating )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనాన్ హీరోయిన్ గా, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈ సినిమా పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రభాస్ అభిమానులకైతే మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అందరి అంచనాలను అందుకుందో లేదో చూద్దాం..

కథ.
మర్యాద పురుషునికి అంకితం అంటూ సినిమా మొదలు పెట్టారు. రామ్ సీతా రామ్ అనే పాటతో.. రాముని కళ్యాణం, వనవాసానికి వెళ్లడం అన్ని చూపించేసారు.. ఆ తరవాత హిమాలయాల్లో రావణాసురుడు ( సైఫ్ అలీ ఖాన్ ) తపస్సు చూపిస్తారు. ఆ తరవాత రావణాసురుడు బ్రహ్మ దగ్గర వరం తీసుకున్న దగ్గర నుంచి సినిమా కథ మొదలవుతుంది. రాఘవుడు ( ప్రభాస్ ) నీటిలో తపస్సు చేస్తూ ఎంటర్ అవుతాడు. జానకి ( కృతి సనన్ ) రాముడి కోసం ఎదురు చూసే సన్నివేశంతో ఎంటర్ అవుతుంది. అక్కడే ( Adipurush Review and Rating ) జానకితో లక్ష్మణుడు ( సన్నీ సింగ్) ఉంటాడు. అడవిలో అన్యోన్యంగా ఉన్న సీతారాముల జీవితంలోకి సూర్పనఖ రావడం, మాయ లేడి, రావణాసురుడు జానకి మాతను తీసుకుని వెళ్లడం.. ఆ తరవాత రాఘవుడు వానరుల సహాయంతో రావణాసురుడిని వధించి.. సీతను తీసుకురావడం.. ఈ కథ అందరికీ తెలిసినదే.. కాబట్టి సినిమాలో ఒక్కొక్క సీన్ ఎలా ఉందొ తెలుసుకుందాం..

om-raut-made-adipurush-movie-only-for-a-commercial-angle-review-and-rating

సినిమా ఎలా ఉందంటే..

ఈ సినిమాలో దర్శకుడు.. పాత్రల పరంగా అయితే నలుగురి మీద శ్రద్ధ బాగా పెట్టాడు. రాఘవుడు, జానకి, హనుమాన్, రావణాసురుడు. ఈ నాలుగు పాత్రలలో నటించిన వారులో అందరూ బాగానే నటించారు గాని.. రాఘవుడిగా ప్రభాస్ మాత్రం సూపర్ గా సూట్ అయ్యాడు. సినిమా మొదలు నీటిలోనుంచి బయటకు ఎగురుతూ వచ్చి.. అక్కడ పక్షులతో బాణాలతో యుద్ధం చేస్తాడు. అప్పుడు ఇదేమిటి రాముడిని ఇలా ఎగరడం, ఫైట్ చేయడం మామూలు సినిమాల్లో హీరో లా చూపించాడు అనిపించింది. కానీ ప్రభాస్ ( Adipurush Review and Rating ) అటు మాములు హీరోలా ఫైట్ సీన్స్ లో కనబడినా కూడా.. సినిమా మొత్తం మీద తన పర్సనాలిటీ గాని, తన ముఖంలో ఫీలింగ్స్ గాని అన్ని కూడా అబ్బా రాముడు ఎంత చక్కగా ఉన్నాడు అని అనిపించేలా రాముడిలానే ఫీలింగ్ తెప్పించాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి ఎటువంటి నెగటివ్ చెప్పలేము. పాత్ర కోసమే ప్రభాస్ అన్నట్టు నప్పాడు. మామూలు సినిమాల్లా.. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్, లవ్ అఫెక్షన్ డీప్ గా చూపించలేని దేవుడి కథ అయినా కూడా ప్రభాస్ కేవలం తన కళ్ళతో.. ముఖంలో హావభావాలతో జానకి పై తనకున్న ప్రేమని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా నటించాడు.

See also  Janhvi Kapoor : అశ్లీల వెబ్సైటు లో అలా దారుణంగా జాన్వీ కపూర్.. ఆందోళనలో జాన్వీ..

కాకపోతే సినిమాలో ఓం రౌత్ ప్రభాస్ ట్యాలంట్ కేవలం లుక్ పరంగా, హావభావాల పరంగా, ఫైట్స్ పరంగా చాలా బాగా వాడాడు గాని, ఎమోషనల్ గా కొన్ని మాటలు కూడా పెడితే బాగుణ్ణు అనిపించింది. రామాయణంలో గ్రాఫిక్స్ కాకుండా.. గ్రాఫిక్స్ లో రామాయణాన్ని పెట్టినంతగా మార్పులు, చేర్పులు చేసిన దర్శకుడు.. కొన్ని డైలాగ్స్ ప్రభాస్ కి ఇచ్చి ఉంటె బాగుణ్ణు. ఇక ప్రభాస్ ఇచ్చిన ప్రతీ డైలాగ్ కి న్యాయం చేసాడు. ఈ సినిమాని ప్రభాస్ ఫాన్స్ చాలా గర్వంగా చూడచ్చు. సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ప్రభాస్ ని మాత్రంలో చూడాలి.. ఇక జానకి పాత్రలో కృతి సనాన్ కూడా ఎక్కడ తీసిపోలేదు. వీళ్లిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు అనిపిస్తుంది. సెంటిమెంట్స్ ఉండటమే ఈ సినిమాలో తక్కువగా చూపించాడు. చూపించినంత వరకు ఈమె బాగానే నటించింది.

om-raut-made-adipurush-movie-only-for-a-commercial-angle-review-and-rating

అలాగే ఈ సినిమా హనుమాన్ పాత్రలో ( దేవదత్త నాగే ) ఎంత చక్కగా ఇమిడిపోయాడంటే.. చాలా బాగా చేసాడు. దేవదత్త నాగే కి పాజిటివ్ మాత్రమే తప్ప.. నెగటివ్ చెప్పలేము. ఇక మరొక అసలైన పాత్ర రావణాసురిడిగా ( సైఫ్ అలీ ఖాన్ ) పాపం బాగానే చేసాడు కానీ.. తెలుగు వాళ్లకి ఎవ్వరికి నచ్చడు. కేవలం బాగా చిన్నపిల్లలకి ఏమైనా నచ్చవచ్చు ఏమో.. అది కూడా అందరు పిల్లలకి నచ్చదు. ఆ పాత్రని దర్శకుడు కొన్ని సార్లు బాగానే తయారు చేసినా.. కొన్ని సార్లు మాత్రం కార్టూన్ చూస్తున్న ఫీలింగ్ తెప్పించాడు. 10 తలల ( Adipurush Review and Rating ) రావణాసురుడుని 10 కార్టూన్ బొమ్మలులా చూపించాడు. ఆ పది తలలతో రావణాసురుడు మాట్లాడుతున్నప్పుడు.. ఇంకా చిరాకు వచ్చింది. సినిమా ఎంతసేపు చూడాలి అనిపిస్తాది. జానకి దగ్గరకి వచ్చి రావణుడు మాట్లాడిన సీన్స్ మన పాత సినిమాల్లో ఎస్. వి. రంగారావు గారు నటించిన సీన్స్ అయినా, డైలాగ్స్ అయినా సూపర్ గా ఉంటాయి గాని.. ఇందులో మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది.

ఇక మిగిలిన నటులు అందరూ ఎవరికి వారు బాగానే నటించారు. ఇక ఈ సినిమాలో కథ పరంగా దర్శకుడిని పొగడటం గాని, విమర్శించడం గాని ఏమి చేయలేము. ఎందుకంటే ఈ కథ అందరం పారాయణం చేస్తూ ఉన్నదే కాబట్టి.. కానీ సీన్స్ ని ఎలా పండించాడు అనేదే సినిమా.. సీన్స్, డైలాగ్స్ పరంగా చూస్తే.. సినిమాలో ముఖ్యమైన డైలాగ్స్ అన్నీ ట్రైలర్ లో ఇచ్చేసారు. అంతకు మించిన డైలాగ్స్ సినిమాకి వెళ్లి వినడానికి ఏమి లేవు. ఇక సీన్స్ పరంగా వస్తే.. రాఘవుడు జానకితో ఉన్న ప్రతీ సీన్ బాగానే పండింది. ఎక్కడా వీళ్ళిద్దరూ సీతారాములు ఏమిటని ఎబ్బెట్టుగా అనిపించకుండా.. చాల బాగా నటించారు. ఇక రామాయణంలో ఈ ఘట్టంలో మొత్తం మలుపు సూర్పనఖ రాముడి మీద కన్ను వేయడంతో మొదలవుతుంది.

See also  Soina Agarwal: సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చే కారణమా.? అందువల్లే విడాకులు తీసుకున్నారా.?

om-raut-made-adipurush-movie-only-for-a-commercial-angle-review-and-rating

సూర్పనఖ నటన గాని, ఆ సీన్స్ గాని అస్సలు బాలేవు. జానకిని రావణాసురుడు తీసుకుని వెళ్లే సీన్ గ్రాఫ్జిక్ పరంగా బాగానే ఉంది కానీ.. జానకి మాతను రావణుడు ఎత్తుకుపోతున్నాడు అనే బాధ ఆడియన్స్ కి కలగలేదు. ఎక్కడా సెంటిమెంట్ పండలేదు. అసలు ఈ సినిమాలో విచిత్రం ఏమిటంటే.. మానవులు ఎలా బ్రతకాలో చెప్పడానికే ఆ భగవంతుడు సామాన్య మానవ రూపం ఎత్తిన అవతారం రాముడు. అలాంటి ఈ రాముని గాథలో ( Adipurush Review and Rating ) సెంటిమెంట్ ని కనీసం ఒక్కసారైనా ప్రేక్షకుడి కంట కన్నీరు వచ్చేలా గాని.. కనీసం బాగా దుఃఖంగా ఉన్న ఫీలింగ్ గాని దర్శకుడు రప్పించలేకపోయాడు. అయితే రామాయణాన్ని నేటి తరానికి తగ్గట్టు చూపించాడు గాని.. అతను ఇలాంటి సినిమా తియ్యడానికి అందరికి తెలిసిన రామాయణం ఎన్నుకోవాల్సిన పనిలేదు అనిపించింది.

తండ్రికి దహనసంస్కారం చేయలేకపోయాను.. కనీసం మిత్రుడిని సాగనంపుదాం అని ప్రభాస్ అన్నప్పుడు కొంచెం అది కూడా ప్రభాస్ హావభావాల వలన చిన్న ఫీలింగ్ కలిగింది. ధర్మ అధర్మాలకు యుద్ధం జరిగినప్పుడు పాక్షింగా ఉండటం కంటే అపరాధం ఇంకొకటి లేదు అని విభీషణుడు చెప్పిన డైలాగ్ ని.. కొంచెం బాగా హైలెట్ చేస్తే బాగుణ్ణు . ఈ రోజుల్లో మనకెందుకులే.. ఘోరాన్ని చూస్తూ ఉందాం అనే తత్వం కూడా అపరాధమే అని తెలిసేలా చెప్పి ఉంటె బాగుణ్ణు. శత్రువుని చంపితే.. శత్రుత్వం చావదు.. క్షమించి చూద్దాం అనే కాన్సెప్ట్ దగ్గర ప్రభాస్ నటన బాగుంది కానీ.. దాని ప్రాముఖ్యతని ఈ తరానికి అర్ధం అయ్యలా.. రాఘవుడు అది చెప్పగానే .. పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ ఇలాంటి వాటిని కొంచెం హైలెట్ చేసి మానవ జీవితంలో వీటి అవసరాలను చెబితే బాగుణ్ణు.

లక్ష్మణుడు చనిపోతాడు అనే సీన్ లో అసలు సెంటిమెంట్ ని పండించలేకపోయాడు దర్శకుడు. యుద్దానికి వానర సైన్యాన్ని సిద్ధం చేసే సీన్ బాగుంది. అక్కడ డైలాగ్స్ కూడా బాగున్నాయి. హనుమంతుడిని లక్ష్మణుడు అడిగిన ప్రశ్నలు.. వాటికి సమాధానం చెప్పే తీరు బాగుంది. హనుమాన్ ని గుర్తించినట్టుగా.. ప్రభాస్ నటన బాగుంది. ప్రభాస్ తన హావభావాలతో, తన పర్సనాలిటీ తో సినిమాలో రాఘవుడు ఉన్నాడు అని చూపించడం కోసమే పుట్టినట్టు నటించాడు. తన వంతు న్యాయం చాలా బాగా చేసాడు. పాటలు బాగానే ఉన్నాయి. సినిమా నిర్మాణపు విలువలు బాగున్నాయి. సినిమా సాగదీసినట్టు అనిపించింది. అంతసేపు చూడటం కొంచెం కష్టంగా కూడా అక్కడక్కడా ఫీల్ వచ్చింది. శబరి సీన్ కూడా అందులో కూడా ప్రభాస్ నచ్చాడు గాని.. శబరి ఆకట్టుకోలేకపోయింది. ఇక సినిమాలో గ్రాఫిక్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి. బాగున్నాయి కూడా.. లాస్ట్ యుద్ధం చాలాసేపు తీశారు గాని.. అసలు ఎవరితో యుద్ధం చెయ్యాలని వెళ్లారో.. ఆ రావణుడితో ఫైట్ పెద్దగా ఏమి ఆకట్టుకోలేదు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ భార్యతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎం చేసాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

మొత్తం మీద ఓం రౌత్ మిస్ అయ్యింది ఏమిటంటే.. రామాయణంలో ఈ భాగాన్ని ఎన్నుకుంటే.. సూపర్ గ్రాఫిక్స్ తో ఈ జనరేషన్ ని బాగా ఆకట్టుకోవచ్చు అని అనుకున్నాడు. అది నిజంగా తెలివైన ఆలోచనే.. ఎందుకంటే మిగిలిన భాగాల్లో ఇంత గ్రాఫిక్ చూపించాలనంటే సూట్ అవ్వదు. కానీ ఇలా హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ రప్పించడానికి.. ఎటువంటి కథ రాసుకుని తీసి ఉన్నా హిట్ అయ్యేది. ఎందుకంటే కనీసం కథలో నెక్స్ట్ ఏమిటనే ఆత్రం వలన. ఇలాంటి ఆలోచనకి రామాయణం ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఇక నిజంగా ( Adipurush Review and Rating ) చరిత్రలో మిగిలిపోయేలా రామాయణం తీయాలని అనుకుని ఉంటె.. ఎమోషన్, సెంటిమెంట్, మోరల్ ఈ మూడింటికి పెద్ద పీఠం వెయ్యాలి. చరిత్రలో కాకుండా.. కలెక్షన్ లో కింగ్ గా మిగలాలనే ఆలోచనతో ఈ సినిమా తియ్యడం వలన.. ఎమోషన్, సెంటిమెంట్ సరిగ్గా పడకపోగా.. మోరల్ ని ఎక్కువగా రీచ్ చెయ్యలేకపోయాడు అనిపించింది.

రామాయణాన్ని ఆధునికంగా ఇప్పటి పిల్లలకి బాగా నచ్చేలా తీసాడని కొందరు అనుకున్నప్పటికీ.. రామాయణాన్ని ఆధునికంగా తీయలేదు.. ఇప్పటి ఆధునిక సినిమాల కోసం రామాయణాన్ని వాడారు అంతే.. మొత్తం దృష్టి ప్రొడక్షన్ విలువలు మీద.. గ్రాఫిక్స్ మీద.. మేకప్ మీద.. ఆర్టిస్ట్ మీదనే పెట్టాలి అనుకుంటే ఇలాంటి గొప్ప గ్రంధాలను వాడటం అనవసరం. లేదు రాముని చరితలో ప్రతీ సన్నివేశాన్ని అమృతంలా మనం, మన పిల్లలు తాగాలని అనుకుంటే ఇదే నటులతో.. ఇంకొంచెం టైం, డబ్బు కమర్షియల్ పరంగా ఆలోచించకుండా ఉంటె.. 700 కోట్లు ఖర్చు లేకుండా ఇంకా అద్భుతంగా రామాయణంలో ఈ ఘట్టాన్ని తీయవచ్చు అని అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా. అలాగే ప్రభాస్ అంటే కొంచెం ఇష్టం ఉన్నా కూడా తప్పకుండా చూడచ్చు. పిల్లలతో కలిసి ఈ సినిమాని సెలవుల్లో ఫ్యామిలీ ఎంజాయ్ చెయ్యచ్చు.అయితే అనుకున్నంత అంచనాలకు అయితే సినిమా రీచ్ కాలేదని గట్టిగా చెప్పచ్చు.

రేటింగ్ : 2.75 / 5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.