Home Cinema Vijay Devarakonda: ఆ అమ్మాయి చేతిలో చేయి వేసి మరీ తన పెళ్ళి గురంచి క్లూ...

Vijay Devarakonda: ఆ అమ్మాయి చేతిలో చేయి వేసి మరీ తన పెళ్ళి గురంచి క్లూ ఇచ్చిన విజయ్ దేవరకొండ. ఇస్టాలో పోస్ట్ వైరల్

Vijay Devarakondas Post: విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదట పలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో భాగమై ఆ తర్వాత హీరోగా రాణిస్తూ అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో ఒకే దెబ్బకు స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. విజయ్ దేవరకొండకు కుర్రాళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో అంతకు డబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేడీస్ నుండి కూడా ఉంది.

vijay-devarakondas-post-on-istagram-about-to-get-married-has-gone-viral

ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కృషి విషయానికొస్తే.. మరో రెండు రోజుల్లో అనగా సెప్టెంబర్ ఒకటో తారీకు అంగరంగ వైభవంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇటు విజయ్ దేవరకొండ అభిమానులగనే కాక తెలుగు ప్రేక్షకులను సైతం ఖుషీ ఖుషీగా అలరించేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఆయనకు జోడిగా నటించింది. ఇప్పటికే విడుదలైన అన్నింటిని కలిపి చూసుకుంటే కచ్చితంగా ఈ సారి బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్టే అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమంత అభిమానులు సైతం ఈ సారి ఈ చిత్రం ఆమెకు మరింత సక్సెస్ ను అందించాలని కోరుకుంటున్నాను.

See also  Mega hero: మెగా హీరోల్లో ఒకరు పాపం ఆ అమ్మాయిని ప్రేమించి.. ఆ సంగతి తెలిసాక వదిలేసిన హీరో ఎవరో మీకు తెలుసా?

vijay-devarakondas-post-on-istagram-about-to-get-married-has-gone-viral

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెత్తినటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తారీఖున విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం మొత్తం మరియు విజయ్ చాలా బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ (Vijay Devarakondas Post) ఖాతాలో పెట్టిన పోస్ట్ అందర్నీ ఆలోచనలోకి నెట్టి పడేసింది. మరి ఆ పోస్ట్ ఏంటి.? ఆయన ఏం రాసుకోవచ్చాడు అంటే.. చాలా జరుగుతున్నాయి కానీ ఇది నిజంగా చాలా ప్రత్యేకమైనది త్వరలో ప్రకటిస్తామంటూ ఓ అమ్మాయి చేతిలో చేయి వేసి ఉన్న స్టిల్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దాంతో ఇక ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ పోస్టుకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి.

See also  Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

 

మరి అది లైఫ్ లో సంబంధించి ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నాడా లేక ఏదైనా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నాడా.? లేక ఏదేమైనా యాక్టివిటీలో భాగంగానే ఇలా చేశాడా అనేది ప్రస్తుతం అందరిని  సందిగ్దంలో పడేసిందని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం తను తన నిజ జీవితంలో ప్రేమించిన తన ప్రేయసి ఎవరనేది క్లారిటీ ఇస్తాడేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాదా మరోవైపు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు అన్న సంగతి నాకు తెలిసిందే.. ఇంకా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సినిమా శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించనున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా శ్రీ లీల హీరోయిన్ గా అలరించబోతుంది..