Home Cinema అప్పుడు సమంత కోసం నాగ చైతన్య చేసినట్టే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ కోసం..

అప్పుడు సమంత కోసం నాగ చైతన్య చేసినట్టే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ కోసం..

samantha-naga-chaitanya-vijay-devarakonda-rashmika

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్నారు సమంత నాగ చైతన్య. వీరు ప్రేమించి పెళ్లి చేసుకుని అనుకోకుండా మనస్పర్థలు రావటంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ జంట విడిపోయినప్పటికీ వీరి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. వీరికి సంబంధించి ఎటువంటి వార్త ఐన కూడా అభిమానులకి చాల ఆసక్తి, అందుకే వీరికి సంబంధించి ప్రతి వార్త వైరల్ అవుతూ ఉంటుంది. ఫాన్స్ మాత్రం వీరు మల్లి కలుస్తారు అని భావిస్తున్నారు.

See also  Honey Rose: రోజు రోజు కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తున్న హనీ రోజ్.. ఏం కుర్రాళ్ళు రా బాబు ఇలా తయారయ్యారు.

samantha-naga-chaitanya

నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. సమంత కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అప్పట్లో నాగ చైతన్య సమంత నటించే సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్ లో ఆలా వచ్చే వాడు, ఇప్పుడు అలానే రష్మిక కూడా విజయ్ దేవరకొండ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతుంది అని టాక్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ ఫామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.

See also  Rana Daggubati: సమంతతో శాకుంతలం సినిమాలో రానా నటించక పోవడానికి కారణం నాగచైతన్య నేనా..??

rashmika-vijay

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించినా విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు మూవీ మేకర్స్. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఇదే సినిమాలో రష్మిక కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఇప్పుడు ఇదే వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.