Home Cinema South Stars: పెళ్ళి వరకు వెళ్ళి అర్ధాంతరంగా వద్దనుకున్న మన సౌత్ సెలబ్రెటీస్ వీళ్ళే..

South Stars: పెళ్ళి వరకు వెళ్ళి అర్ధాంతరంగా వద్దనుకున్న మన సౌత్ సెలబ్రెటీస్ వీళ్ళే..

South Stars: సెలబ్రిటీల గురించి కొత్త ఏముంది చెప్పండి. వాళ్లు ఎప్పుడు ఎవరిని ఇష్టపడతారో వాళ్ళని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అసలు ఎప్పుడు విడిపోతారో ఎవరు ఊహించలేం. వాళ్లంటే సెలబ్రిటీలు ఎన్నో లవ్ స్టోరీలు.. ఎన్నో రకాల ఎఫైర్లు.. ఆ తర్వాత పెళ్లిళ్లు.. కలిసి ఉంటే చివరి దాకా కొనసాగుతుంది వాళ్ళ వివాహ బంధం.. లేదంటే పట్టుమని మూన్నాళ్ళ ముచ్చటగా విడాకులు తీసుకుని ఎవరికి వారు వెళుతూ విడిపోతుంటారు. ఎప్పుడూ వీళ్ళ విషయాలు వార్తల్లో సెన్సేషనల్ గా నిలుస్తూనే ఉంటాయి. ఇక ఆ సెలబ్రిటీలకు సంబంధించిన అభిమానులు లేక మామూలు ప్రజానికం సైతం ఇలాంటి విషయాలను తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు అదేమానందమో ఇప్పటికీ అర్థం కాని విషయం. అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొంత మంది స్టార్స్ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి వరకు వెళ్లారు. కట్ చేస్తే పెళ్లి అవ్వకుండానే బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. మరి అలా అంగరంగ వైభవంగా  నిశ్చితార్ధం చేసుకుని విడిపోయిన ఆ స్టార్ జంటలు ఎవరెవరో మనం ఇప్పుడు చూద్దాం.

See also  Rajamouli - Jhanvi Kapoor: రాజ‌మౌళికి జాన్వీక‌పూర్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి.. తలపట్టుకుని మరీ ఎలా నవ్వుతుందో చూడండి..

south-indian-film-stars-who-got-engaged-but-cancelled-their-marriage-in-the-lst-minute

అక్కినేని అఖిల్: అక్కినేని వారసునిగా నాగార్జున తనయుని గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అఖిల్. పైగా అఖిల్ అనే చిత్రం తోనే హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టేశాడు. ఇక తన తొలి చిత్రం విడుదలైన కొన్నాళ్లకే వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడు అఖిల్. తన ప్రేయసి శ్రియ భూపాల్ తో ఏడడుగులు వేయడానికి నిశ్చయించుకుని 2016 సంవత్సరంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇక తన వివాహాన్ని ఇటలీ రాజధాని రోమ్ నగరంలో చేసుకోవాలని భావించాడు. కానీ పెళ్లికి ముందే అక్కినేని అఖిల్ శ్రియ లు విడిపోయారు.

See also  Samantha : కొత్త జర్నీ మొదలు పెట్టిన సమంత.. సమంత నిర్ణయం వలన వరుణ్ లావణ్య జీవితంలో..

విశాల్: కోలీవుడ్ కు చెందినటువంటి స్టార్ హీరో అయినప్పటికీ విశాల్ మన టాలీవుడ్ లో చాలా మంచి క్రేజ్ కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్న వాళ్ళలో విశాల్ కూడా ఒకరు. అయితే విశాల్ గతంలో మన తెలుగు అమ్మాయి అనిషా రెడ్డితో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసి చివరికి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కాగా ఏమైందో తెలియదు వీళ్ళ జంట కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే ఒకరికి ఒకరు దూరమయ్యారు.

south-indian-film-stars-who-got-engaged-but-cancelled-their-marriage-in-the-lst-minute

రష్మిక మందన: నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకొని తన దైన శైలిలో దూసుకు పోతున్నటువంటి ఈ అందాల భామ తొలి చిత్రం కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో మూడు ముళ్ళు వేయించుకోవాలని భావించింది. ఇక వీళ్లిద్దరూ లవ్ చేసుకుని పెద్దల సమక్షంలోనే నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు పెళ్లి మాత్రం జరగలేదు. వివాహానికి ముందే వీరిద్దరూ ఒకరిని ఒకరు విడిపోయారు.

See also  Deepika Padukone : వామ్మో.. దీపికా మగాళ్ళ ఆ సీక్రెట్స్ గురించి చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి..

త్రిష: చెన్నై బ్యూటీ త్రిష కూడా గతంలో చాలా మంది హీరోలతో ప్రేమాయణాలు కొనసాగించింది. బడా బిజినెస్ మాన్, నిర్మాత మరియు తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి వరుణ్ మనియణ్ ను  వివాహం చేసుకోవాలని భావించింది. ఆ కారణం చేతనే వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ పలు కారణాల వల్ల వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కకుండానే ఒకరికి ఒకరు విడిపోయారు. (South Stars)