
Miss Shetty Mr Polishetty Review :
చిత్రం: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr Polishetty )
తారాగణం: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదితరులు..
కెమెరా: నీరవ్ షా
సంగీతం: పాటలు: రాధన్, స్కోర్ : గోపీ సుందర్
నిర్మాతలు : V. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
దర్శకత్వం : మహేష్ బాబు పచ్చిగొల్ల
విడుదల తేదీ: 7 సెప్టెంబర్ 2023 (Miss Shetty Mr Polishetty Movie Review and Rating )
నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్గా, మహేష్ బాబు పిచ్చిగొల్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. చాలా కాలం తర్వాత అనుష్క సినిమా రిలీజ్ అయింద. అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నవీన్ పోలిశెట్టి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ రిలీజ్ అయ్యి అందరి ముందుకు వచ్చింది ఈ సినిమా అంచనాలకు అందినట్టు ఉందో లేదో తెలుసుకుందాం..
కథ.
లండన్ లో అన్విత ( అనుష్క శెట్టి ) ఒక మంచి సక్సెస్ఫుల్ చెఫ్. కెరీర్ లో ఈమెకు మంచి పేరు రావడమే కాకుండా.. కొలిక్స్ అందరికి ఇంకా.. ఆమె బాస్ డీకే ( నాజర్ ) కి ఆమె అంటే చాలా అభిమానం. అన్వితకి ప్రేమించడం, పెళ్లి చేసుకోవడంమీద అసలు నమ్మకం ఉండదు. కారణం ఆమె తల్లి జయసుధ ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తకు దూరమై తన కూతుర్ని పెంచుకుంటూ వస్తుంది. తన తల్లి జీవితాన్ని చూసిన అన్విత ఆమెకు పెళ్లి వద్దని ఫిక్స్ అవుతుంది. అయితే అన్వితకి తన తల్లి అంటే చాలా ఇష్టం. ఆమె క్యాన్సర్ జబ్బుతో ఇక లాస్ట్ స్టేజ్ లో ఉండగా.. తన ఇండియాకి వెళ్ళిపోదామని కోరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి చనిపోతుంది. తల్లి బ్రతికినంత కాలం పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా అన్వితకి ఎక్కదు. కానీ తల్లి పోయిన తర్వాత ఒంటరిగా ఫీల్ అయ్యి.. తనకంటూ ఒక తోడు కావాలని.. అయితే అది తన కడుపున పుట్టిన బిడ్డ అవ్వాలని అనుకుని బిడ్డను కనాలని ఫిక్స్ అవుతుంది. అయితే బిడ్డను కనడానికి ఎవరిని ప్రేమించకుండా, పెళ్లి చేసుకోకుండా డోనర్ ద్వారా బిడ్డని కణాలని ఫిక్స్ అవుతుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్దు (నవీన్ పోలిశెట్టి ) పరిచయం అవుతాడు. తనడోనర్ గా అతను అన్ని రకాలుగా నచ్చి.. తననితల్లిని చేయమని కోరుకుంటుంది. అనుష్కను ప్రేమించిన సిద్దు.. అనుష్క అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాడు? చివరికి ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే.. ( Miss Shetty Mr Polishetty )
ఈ సినిమా పై భారీ అంచనాలు లేనప్పటికీ.. అసలు ఈ సినిమా హీరోయిన్ పెళ్లి వద్దు, నాకు పిల్లలు కావాలి అనే కాన్సెప్ట్ తో సినిమా తీశారన్న సంగతి అందరికీ తెలిసినదే. స్టార్ హీరోయిన్ అయిన అనుష్క ఎందుకు ఇలాంటి పాత్ర, ఇలాంటి కాన్సెప్ట్ తో ముందుకు వస్తుంది అని అనుకునేవారు. కానీ ఈ సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. అనుష్క ( Miss Shetty Mr Polishetty ) ఎందుకు ఈ సినిమాని ఒప్పుకుందో సినిమా చూసిన తరవాత అర్ధం అవుతుంది. దర్శకుడు మహేష్ బాబు పి.. ఇలాంటి కథతో, ఈ తారాగణాన్ని సెలక్ట్ చేసుకుని సినిమాని బాగానే తీసాడు. కానీ కొంచెం సినిమాని సాగదీయకుండా, ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని సినిమా చేసి ఉంటె బాగుణ్ణు అనిపిస్తుంది.
ఈ సినిమాలో అనుష్క తన పాత్రకు తాను చక్కగా న్యాయం చేసింది. కానీ, ఆమె ఏజ్ మాత్రం కనిపించకుండా ఉంచాలని ఎంత ప్రయత్నించినా కూడా.. కొంతవరకు బాగానే కనిపించింది. ఇక ఆమె నటన విషయానికి వస్తే.. ఎలాంటి పాత్రలనైనా అదరగొట్టే ఆమె అనుభవం.. ఈ పాత్రని చాలా సింపుల్ గా నటించేసింది. ఇక ఈ సినిమా ( Miss Shetty Mr Polishetty ) మొత్తం హీరో హీరోయిన్ మీదనే ఆధారపడి ఉంటుంది. సినిమాలో విలన్ అనేవాడు లేకుండా.. అసలు ఆ విషయం గుర్తుకు రాకుండా బాగానే తీసాడు దర్శకుడు. ఈ సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి చాలా బాగా నటించాడు. తన కామెడీ చాలా చోట్ల బాగానే ఉన్నా కూడా.. కొన్ని చేయట్లా చాలా బోర్ కొట్టింది. అనుష్క పక్కన నవీన్ పోలిశెట్టి ఎలా ఉంటాడో అని అందరు అనుకున్నారు గాని.. వీళ్ళ జంట బాగానే సెట్ అయ్యింది.
కేవలం కామెడీ మీద కాకుండా.. సినిమాలో సెంటిమెంట్ ని కూడా బాగానే పండించాడు దర్శకుడు. డోనర్ గా నీకు ఇష్టం లేకపోతే వద్దు అని అనుష్క అంటే.. ఈ ప్రోసెస్ నాకు ఇష్టం లేకపోయినా కూడా.. నీకు సంబందించిన ప్రతీ చిన్న దానిలో నేనే ఉండాలని అనిపిస్తుంది అని హీరో అనడం.. అలాగే ఇలాంటి కొన్ని సీన్స్ బాగా పండాయి. హీరో హీరోయిన్ మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్ లేకుండా.. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా తీయడంలో దర్శకుడు చాలా బాగా సక్సెస్ అయ్యాడు. తాను ప్రగ్నెంట్ అని ( Miss Shetty Mr Polishetty ) ఆనందంగా ఎవరితో పంచుకోవాలో అర్ధకాక.. తాను సతమతమవుతున్న అనుష్క ఫీలింగ్ కూడా చాలా బాగా నటించింది. సినిమాలో క్లైమాక్స్ కూడా బాగుంది. సినిమాలో మ్యూజిక్, పాటలు బాగానే ఉన్నాయి. హీరో ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా నిలిచాడు. ఎందుకంటే.. నవీన్ పోలిశెట్టి ఇటు కామెడీని, అటు సెంటిమెంట్ ని కూడా చాలా చక్కగా పండించాడు. సినిమా మీదా ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే.. సినిమా నచ్చుతుంది. కొంచెం సినిమా స్లో గా, అక్కడక్కడా బోర్ కొట్టించే సీన్స్ లేకుండా ఉంటె.. సినిమాలో ఇంకొక లెవెల్ కి వెళ్ళును అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి హ్యాపీ గా చూడచ్చు. ఎలాంటి వల్గారిటీ లేదు. కామెడీ కూడా బాగానే ఉంది.
రేటింగ్: 2. 75/ 5
ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి అభిప్రాయం. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.