Home Health ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగితే

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగితే

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగితే

మనలో చాలామంది ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీరు తాగుతుంటారు. అలా కాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలుపుకొని తాగితే చాలా మంచిది. శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఈ మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది. కొందరికి సందేహాలు ఉండొచ్చు ఇలా చేస్తే ఫలితాలు ఉంటాయని.

లాభాలు:

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు అనేది అపోహ మాత్రమే. కాకపోతే నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

See also  కాలేయం కూల్ గా ఉంటే మనం కులాసాగా ఉంటాం. దానికి మనమేం చేయాలి

వీటిలో యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తేలిగ్గా పోతాయి.

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ బరువు తగ్గే విషయంలో మాత్రం మెరుగైనది కాదని అర్థమవుతుంది.

అధిక కేలరీలు ఉండే వాటి స్థానంలో తక్కువ క్యాలరీలు ఉండే నిమ్మరసం తాగితే మంచిదని కానీ బరువు తగ్గిస్తుంది అన్న విషయం మాత్రం దృష్ప్రచారం.

నిమ్మలో విటమిన్ సి ఉండడం చేత మన చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది ముడతలు పడకుండా వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది.

See also  Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

వృద్ధాప్యం నుంచి కాపాడమే కాకుండా పొడి చర్మం, ఎండ నుంచి చర్మానికి రక్షణను ఇస్తుంది.

అంతేకాకుండా గోరువెచ్చని నీటితో నిమ్మరసం జత చేసి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, మలబద్ధక సమస్య తగ్గుతుంది.

గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మాయమవుతాయి.

అలా అని నిమ్మరసం అధికంగా తాగిన కూడా ప్రమాదం పొంచి ఉంది, రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగకూడదు.

ఎక్కువగా తాగడం వల్ల ప్రస్తుతానికి ఏం కాకపోయినా రోజులు గడిచే కొద్దీ దాని నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మొదలవుతుంది అందుకే ఎక్కువగా తాగకూడదు.