Home News IRCTC: రూ 905 తో 7 ముఖ్యమైనవి చూసే బంపర్ ఆఫర్ ఇస్తున్న ఇండియన్ రైల్వే.....

IRCTC: రూ 905 తో 7 ముఖ్యమైనవి చూసే బంపర్ ఆఫర్ ఇస్తున్న ఇండియన్ రైల్వే.. వివరాలు ఇవే..

bharat-gaurav-trains-package-details-for-jyotirlinga-tourism-by-irctc

IRCTC: రోజు పొద్దున్నే లేవడం.. ఇంటి పనులు చూసుకోవడం.. ఆఫీసులకు వెళ్లడం.. స్కూల్ కి వెళ్లడం.. ఇలా ఎవరి జీవిత విధానంలో వాళ్ళు బిజీగా ఉంటూనే ఉంటారు. నిత్యం ఒకేలా జరిగే జీవన విధానంలో అప్పుడప్పుడు మనిషికి ఉపశమనం కావాలంటే.. ఎక్కడికైనా టూర్ వెళ్లాల్సిందే. నాలుగు కుటుంబాలు కలిసి ( Bharat Gaurav Trains package ) ఆనందంగా ఎక్కడికైనా టూర్ వెళితే.. ఆ చూసే ఆనందం, ఆ దారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఆ ముచ్చట్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్న ఫోటోలు ఇవన్నీ జీవితకాలం ఉండే అందమైన మెమరీస్. ఇలాంటి జ్ఞాపకాలను కూడాపెట్టుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది కానీ.. సర్వసామాన్యుడికి చేతిలో డబ్బులు లేక.. అంత డబ్బు ఒకేసారి ఖర్చు పెట్టలేక ఎక్కడికి వెళ్లాలన్నా ఆగిపోతారు.

See also  Rashmi Gautam: మైమర్చిపోయే అందాలతో మురిపిస్తున్న రష్మీ గౌతమ్ క్రేజీ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా.!

bharat-gaurav-trains-package-details-for-jyotirlinga-tourism-by-irctc

అలాంటి వారికోసం ఐ ఆర్ సి టి సి వాళ్ళు బంగారం లాంటి ఆఫర్ ఇచ్చారు. కేవలం 905 రూపాయలు చేతిలో ఉంటే జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవచ్చు. ఏడు జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. వాటన్నిటిని 905 రూపాయలు చేతిలో ఉంటే చూడగలిగేలా చేశారు. టూర్ అంటే సరదాగా వెకేషన్ హాలిడే ( Bharat Gaurav Trains package ) ట్రిప్ ఒకటైతే.. దైవదర్శనాలు చేసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ గా ఉంటది. దైవ దర్శనం చేసుకోవాలంటే.. మొదటి మన ఆదిదేవుడు ఆ పరమేశ్వరుడి ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అందరికి ఆశ ఉంటది. దాన్ని తీర్చుకునే క్రమంలో ఇన్స్టాల్మెంట్ రూపంలో నెలకి 905 రూపాయలు కడితే మీరు జ్యోతిర్లింగాలను చూడవచ్చు.

bharat-gaurav-trains-package-details-for-jyotirlinga-tourism-by-irctc

ఇండియన్ రైల్వే వాళ్లు భారత్ గౌరవ్ ట్రైన్ ద్వారా ఏడు జ్యోతిర్లింగాలని చూడ్డానికి టూర్ ప్యాకేజీ ఎలా ఉందో చూద్దాం. ఒక వ్యక్తి 2 ఏసీ లో ప్రయాణించాలనుకుంటే 40603 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 3 ఏసీలో ఒక వ్యక్తి ప్రయాణించాలంటే 30688 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్లీపర్ క్లాస్ లో 18,466 రూపాయలు ( Bharat Gaurav Trains package ) చెల్లించాల్సి ఉంటుంది. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, సోమనాథన్నా, నాగేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను చూపించడం జరుగుతుంది. గోరఖ్‌పూర్ నుంచి ఈ ట్రైన్ బయలుదేరుతుంది. ఈ పర్యటనలో అనేక రకాల సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీకి కావాల్సిన కొన్ని ముఖ్యమైనవి మాత్రం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి.

See also  2000 rupees note: బ్యాంక్ కి పోకుండా నల్లడబ్బుని ఇలా మార్చేసుకుంటున్నారు.

bharat-gaurav-trains-package-details-for-jyotirlinga-tourism-by-irctc

ఈ టూర్ ప్యాకేజీలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ధృవీకరణ పత్రాన్ని చూపించాలి. అలాగే ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఉండాలి. ఈ టూర్ మొత్తం తొమ్మిది పగలు పది రాత్రులు ఉంటుంది. యూపీలోనే గోరఖ్‌పూర్ నుంచి ప్రారంభమై ఈ ట్రైన్ ఏడు జ్యోతిర్లింగాల వద్దకు తీసుకొని వెళుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ద్వారకాధీష్ టెంపుల్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఈ టూర్ కి ఒకేసారి మొత్తం చెల్లించలేని వాళ్ళు నెలనెలా ఈఎంఐ రూపంలో 905 రూపాయలు చొప్పున చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఇక ఆలస్యం దేనికి ఈఎమ్ఐ లో మీకు చూడాలనిపించిన జ్యోతిర్లింగాలని చూసేయండి. గోరఖ్‌పూర్, బస్తీ, మాన్కాపూర్ జంక్షన్, అయోధ్య కాంట్, బారాబంకి జంక్షన్, లక్నో, కాన్పూర్, ఒరై, వీరాంగన లక్ష్మీ బాయి స్టేషన్లలో బోర్డింగ్ మరియు డి బోర్డింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.