Home Reviews Dasara movie review and rating: దసరా రంగస్థలం పుష్ప మూడింటికి తేడా ఇదే.. దసరా...

Dasara movie review and rating: దసరా రంగస్థలం పుష్ప మూడింటికి తేడా ఇదే.. దసరా సినిమా రివ్యూ మరియు రేటింగ్..

Dasara movie: చిత్రం: దసరా
తారాగణం:నాని, కీర్తి సురేష్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి మొదలగురు..
కెమెరా: సత్యన్ సూర్యన్
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాత:  సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
విడుదల తేదీ: 30 మార్చ్ 2023 ( Dasara movie review and rating )

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దసరా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు కథలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ..
తెలంగాణ ప్రాంతంలోని వీర్లపల్లి అనే గ్రామంలో హీరో ఫ్లాష్ బ్యాక్ చెబుతూ సినిమా స్టార్ట్ అవుతాది. సీనియర్ ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేసిన సమయం నుంచి స్టార్ట్ అవుతాది. ఈ సినిమా హీరో ధరణి ( నాని), అతని ఫ్రెండ్స్ సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) వీరి ముగ్గిరిమీద మొత్తం కథ నడుస్తాది. ధరణి వెన్నెలని ప్రేమిస్తాడు, వెన్నెల సూరిని ప్రేమిస్తాది. మిత్రుడి ప్రేమకోసం ధరణి తన ప్రేమని చంపుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసే ప్రయత్నంలో సినిమాలో కథ మలుపు తిరుగుతాది. అది ఆ ఊర్లో విలన్స్ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతాది. మిత్రుడి భార్య అయిన వెన్నెలని ధరణి పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి వస్తాది. అసలు మిత్రుడు సూరి భార్యను ధరణి ఎందుకు పెళ్లి చేసుకోవలసి వస్తాది? దానికి వెన్నెల ఎలా రియాక్ట్ అవుతాది? వీరి ముగ్గురు కథలో విలన్ ఎందుకు వస్తాడు? ధరణి ప్రేమను వెన్నెల తెలుసుకుంటాదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Dasara movie review and rating

సినిమా ఎలా ఉందంటే..

సినిమా మొదలు ఒక ఊరుకి సంబంధించిన కథగా మొదలవుతుంది. సిల్క్ బార్ అనే మందు షాపు చుట్టూ కథ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బార్ కి సిల్క్ బార్ పేరు పెట్టి సిల్క్ స్మిత ఫోటో పెట్టె ఐడియా కొంచెం బాగానే ఉంది. అలాగే ఎన్టీఆర్ మధ్యపాన నిషేధం సమయంలో కథ మొదలయినట్టు తీయడం, ఆ టైం లో మందు లేకపోతే ఎలా ఫీల్ అయ్యేవారో ఒక పాటలో సింపుల్ గా బాగేనే చూపించాడు దర్శకుడు. మందు బాబులు ఈ పాట చూస్తే నిజమే అంటారు, మిగిలిన వారు నవ్వుకుంటారు. ఆ తరవాత కథ హీరో ధరణి తన సంబంధించిన ఇద్దరు ఫ్రెండ్స్ మీద నడుస్తుందని అర్ధమవుతాది. ఫ్రెండ్ కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు ధరణి. అయితే హీరోకి తన ఫ్రెండ్ అంటే ఎంత ప్రాణమో బాగా చూపించాడు గాని దర్శకుడు, అసలు ఎందుకు అంత ప్రాణం అనేది అంత బాగా ( Dasara movie review and rating ) చూపించలేకపోయాడు. పోనీ ఇష్టానికి కారణం అవసరం లేదు అని అనుకోవచ్చు. హీరోని పిరికివాడిగా, మందు తాగితే దర్యవంతుడిగా తేడాని చూపించడంలో పరవాలేదు.

See also  Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

సినిమాలో నాని నటించిన కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని వైలెన్స్ పెర్ఫామెన్స్ బాగున్నాయి. ఇక సినిమా ఫస్ట్ ఆఫ్ఎక్కడికో వెళ్తాదేమో అని ఆడియన్స్ ఎదురు చూస్తారు. ఫస్ట్ ఆఫ్ లో కీర్తి సురేష్ హైలెట్ అని చెప్పుకోవాలి. ఆమె నటన చాలా అద్భుతంగా ఉంది. కానీ సెకండ్ ఆఫ్ లో ఆమె పెర్ఫామెన్స్ చూపించడానికి పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు. అందువలన సెకండ్ ఆఫ్ ఆమె ఉన్నా కూడా.. ఉన్న ఫీలింగ్ ఆడియన్స్ కి లేదు. ఇక ధరణి ఫ్రెండ్ సూరికి ధరణి వెన్నెలని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత వారిద్దరి మధ్య సీన్ ఎలా ఉండబోతుంది అని ఎదురు చూసిన ఆడియన్స్ కి అసలు ఆ సీన్ ని ఎస్కేప్ చేసాడు దర్శకుడు. అయితే ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి స్టోరీ లో ఎలాంటి మలుపు తిరగచ్చని సామాన్య ప్రేక్షకుడు ఆలోచిస్తాడో అలా కాకుండా కొంచెం బిన్నంగా తియ్యడానికి దర్శుకుడు కృషి చేసాడు.

Dasara movie review and rating

సినిమా మొదటి భాగం చూస్తుంటే అది తెలుగు సినిమా లా ఆడియన్స్ కి అనిపించలేదు. డబ్బింగ్ సినిమాలా అనిపించింది. పాన్ ఇండియా సినిమాలా తియ్యాలని ఆలోచనలో మన తెలుగుదనాన్ని మిస్ అవుతున్నారా అనిపిస్తుంది. నాని గెటప్ ఇంతవరకు చూడనట్టుగా తీర్చిదిద్దారన్న సంగతి ట్రైలర్ తో అందరికీ తెలుసు. కానీ, ఫస్ట్ ఆఫ్ లో చాలా భాగం మనం నాని సినిమా చూస్తున్నట్టు ఫీల్ అవ్వం. ఎందుకంటే నాని భిన్నంగా ఉన్నాడని కాదు, ఎక్కువసార్లు క్లోజ్ అప్ లో చూపించరు. దాని వలన హీరోని ఇష్టపడి వెళ్లేవారికి కొంత ఇబ్బందిగానే ఉంటాది. చూపించిన కొన్ని క్లోజ్ అప్ సీన్స్ లో నాని పెర్ఫామెన్స్ మాత్రం సూపర్. ఈ సినిమాలో నాని మనకు తనలో దాగి ఉన్న కొత్త కోణాన్ని చూపించాడు. తన క్యారెక్టర్ లో తాను మునిగి అద్భుతంగా నటించాడు. ( Dasara movie review and rating )

See also  Tiger Nageswara Rao Review and Rating : టైగర్ నాగేశ్వరరావు సగటు ప్రేక్షకుడి రివ్యూ..

మెగా హీరోల సినిమాలకు పోటీగా ఉన్న ఈ సినిమాలో తన వంతు నటన ట్యాలంట్ ని మాత్రం అద్భుతంగా చూపించాడు. అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమా అవ్వడం వలన కాన్సెన్ట్రేషన్ కేవలం హీరో మీద మాత్రమే కాకూండా అన్ని సీన్స్ మీద తన లో నైపుణ్యం చూపించాలని ట్రై చేసాడు. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీన్స్ పరంగా చూస్తే.. ఎక్కడా కొత్త దర్శకుడు అన్నట్టు ఏమి అనిపించలేదు. కాకపోతే సినిమాలో కథ ని మాత్రం ఒక పాయింట్ తో మొదలు పెట్టి, అనేక పాయింట్స్ కలుపుకుంటూ పోతూ సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. కథలో చాలా ఎమోషన్స్ చూపించాలని అనుకుని, అసలైన ఎమోషన్స్ ని చోపించే చోట.. ఎదో మిస్ అయినట్టు అనిపిస్తుంది.

Dasara movie review and rating

ధరణి, సూరి మధ్య ఎమోషన్ సీన్ మిస్. అలాగే ధరణి, వెన్నల మధ్య ఎమోషన్ సీన్ కూడా మిస్. ఇకపోతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని వెన్నెల అడిగే చోట.. ప్రేక్షకులు ఊహించని సమాధానం ధరణితో అద్భుతంగా చెప్పించాడు దర్శకుడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం దర్శకుడు బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఉత్కంఠగా నడిచింది. ఇంటర్వెల్ తరువాత స్టోరీ అలానే నడిపిస్తే.. చాల కామన్ అవుతాది అనుకున్నాడో ఏమో కానీ, కథని ఇంకో మలుపు తిప్పాడు. సినిమాలో విలన్స్ చాలా వీక్ గా ఉన్నారు. లేకపోతే హీరో ఇంకా హైలెట్ అవును. సుకుమార్ శిష్యుడైన ఈ దర్శుకుడు తన గురువు ఆలోచనలు చాలా వరకు చూపించాలని చూసాడు.

See also  Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

రంగస్థలం సినిమా లో హీరో చెవిటివాడు అయితే.. ఈ సినిమాలో హీరో అమాయకుడు. అందులో అన్న కోసం సెకండ్ హాఫ్ ఫైట్ చేస్తే.. విలన్ గురించి ఒక సీక్రెట్ తెలిస్తే.. ఇందులో ఫ్రెండ్ గురించి ఫైట్ చేస్తుంటే .. విల్లన్ లో ఇంకొక కోణం తెలుస్తాది. అందులో సెకండ్ హాఫ్ లో డెత్ పై సెంటిమెంట్ పండిస్తే.. ఇందులో కూడా అలానే సెంటిమెంట్ పండించాలని చూసాడు. ఇలా చాల కలిసాయి గాని, కాకపోతే ఆ సినిమాని ఒక కథతో, హీరోతో సాధారణ సినిమాలా తీసినట్టు ఉంటె.. ఇది కమర్షియల్ గా పుష్ప లాంటి గెటప్ కూడా కలిపి పాన్ ఇండియా సినిమా చెయ్యాలనే ఆలోచన ఎక్కువగా వాడినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి అందరూ ఈ సినిమాని పుష్ప సినిమాతో పోల్చారు.

అయితె పుష్ప సినిమాలో మొత్తం అల్లు అర్జున్ ని హైలెట్ గా చూపించడానికె సుకుమార్ ప్రయత్నించి 100% సక్సెస్ అయ్యారు. కానీ ఈ సినిమాలో హీరో గెటప్ ని హైలెట్ చేద్దామని అనుకున్నారు గాని, అది ఆల్రెడీ రీసెంట్ గా పుష్పాల లో చూడటం వలన అంత హైలెట్ కాకపోయినా నానిని ఆలా చూపించి ఆమాత్రం మెప్పించడం దర్శకుడి గొప్పతనం అని ఒప్పుకోక తప్పదు. సినిమాలో పాటలలో కూడా నిజతత్వం ఉండాలని చూపించే ప్రయత్నం బాగుంది. లిరిక్స్ అన్ని అర్ధం అయ్యేలా బాగున్నాయి. మ్యూజిక్ పరవాలేదు బాగానే ఉంది అనిపించింది తప్ప హైలెట్ అయితే కాదు. ఇక సినిమాలో క్లైమాక్స్ ఫైట్ బాగుంటుంది. ఫైట్ అంటే కొట్టుకోవడం నరుక్కోవడమే కాకూండా, మధ్యలో నాని నటన పేస్ ఫీలింగ్స్ చాలా బాగా తీశారు. మొత్తం మీద మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీసాడు. కథ ఏమి అంత సూపర్ అని అనిపించలేదు. కీర్తి సురేష్ నటన హైలెట్. నాని తన రేంజ్ ని ఈ సినిమాతో బాగా పెంచుకున్నాడు.

రేటింగ్: 2.75/5