Home Reviews Virupaksha Review and Rating : మసూద కి విరూపాక్ష కి ఉన్న తేడా ఇదే.....

Virupaksha Review and Rating : మసూద కి విరూపాక్ష కి ఉన్న తేడా ఇదే.. విరూపాక్ష రివ్యూ మరియు రేటింగ్..

virupaksha-review-and-rating-difference-between-virupaksha-and-masooda

సినిమా : విరూపాక్ష  ( Virupaksha movie )
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ
రచన : సుకుమార్
సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్
కెమెరా: శాందత్ సాయినుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాత: బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు
విడుదల: 21 ఏప్రిల్ 2023 ( Virupaksha movie release date ) ( Virupaksha Review and Rating )

సాయిధర్మతేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో విరూపాక్ష సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా స్పెషల్ ఏమిటంటే.. ఈ సినిమా రచన సుకుమార్ చేసాడు. అది ఈ సినిమా ప్రమోషన్ కి చాల పెద్ద సపోర్ట్ అయ్యిందనే చెప్పచ్చు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ చూస్తే.. సినిమా స్టోరీ లైన్ ( Virupaksha Review and Rating ) అర్థమైనా కొంత ఆశక్తినైతే బాగానే క్రియేట్ చేశారు. సాయిధర్మతేజ్ యాక్సిడెంట్ తర్వాత ఎంతో పట్టుదలతో నటించిన సినిమా ఇది. అందుకే ఆయన అభిమానులకు ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకు పొందిందో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్దాం..

virupaksha-review-and-rating-difference-between-virupaksha-and-masooda

కథ..

రుద్రవనం అనే ఒక ఊరిలో, ఒక ఇంట్లో ఒక కుటుంబం క్షుద్రపూజలు చేస్తూ సినిమా స్టార్ట్ అవుతాది. ఆ ఊరి జనం ఆ కుటుంబాన్ని కాల్చి చంపేస్తారు. వాళ్ళ కొడుకుని కూడా ఊరినుంచి తరిమేస్తారు. అక్కడ నుంచి సినిమా 12 ఏళ్ల తరవాత కి వెళ్తాది. ఊర్లో అమ్మవారి జాతర చూడటానికి, మరియు ఆ ఊర్లో స్కూల్ కి స్థలం ఇవ్వడానికి హీరో సూర్య ( సాయిధర్మతేజ్ ) అతని తల్లి, స్నేహితుడు వస్తారు. ఆ ఊరు సర్పంచి ( రాజీవ్ కనకాల ) కూతురు నందిని ( సంయుక్తా మీనన్ ). హీరో సూర్య నందినిని ఇష్టపడతాడు. కానీ దానికి నందిని సూర్యని ప్రేమిస్తుందా లేదా అనేదానికి సమాధానం చెప్పదు. ఈలోపు ఊర్లో అమ్మవారి జాతర ఆపేసి.. ఊర్లో పూజలు కూడా ఆపి, ఊరి నుంచి ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదు, బయటవాళ్ళు లోపలి రాకూడదు 8 రోజులు పాటు అని ఆ ఊరు నిర్నయయించాల్సిన పరిస్థితి వస్తాది. ఆశ్రమంలో హీరో కుటుంబం కూడా ఊరునుంచి బయటకు వెళ్ళిపోతాది. కానీ కొన్ని కారణాలు ( Virupaksha Review and Rating ) వలన హీరో ఆ ఊర్లోకి రావాల్సి వస్తాది, అలాగే ఆ ఊర్లో ఒకరి తరవాత ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఆ హత్యల వెనుక మిస్టరీని హీరో కనిపెడతానని హామీ ఇస్తాడు. అసలు ఆ ఊరు ఎందుకు 8 రోజులు అష్టదిగ్భందనం చేశారు? హీరో ఒక్కడే వెనక్కి ఊర్లోకి ఎందుకు వచ్చాడు? ఆ చావులకు కారణం ఏమిటి? వాటిని హీరో ఎందుకు కనిపెడతాను అంటాడు? హీరో చివరికి ఆ మరణాలను ఆపుతాడా? సూర్య నందిని ల ప్రేమ ఏమయ్యింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Ahimsa Review : అహింస లో ఉదయకిరణ్ కనిపించాడా.. రివ్యూ మరియు రేటింగ్

సినిమా ఎలా ఉందంటే..

సినిమా మొదలుతోనే క్షుద్ర పూజలకు రిలేటెడ్ అని అర్థమయిపోతుంది. ఈ సమస్య ఒక ఊరికి సంబందించినది అని, అక్కడ వరసగా మనుషులు చనిపోతున్నారని, వాటిని నహీరో కనిపెడతాడని ట్రైలర్ లో ముందే చూపించారు కాబట్టి.. ఇవన్నీ క్షుద్ర పూజల రిలేటడ్ అని సినిమా స్టార్టింగ్ లో క్లారిటీ వచ్చేస్తుంది. త్రిల్లర్ సినిమా అంటే.. అసలు అలా ఎందుకు జరుగుతుందో, ఎవరు చేస్తున్నారో తెలియకుండా.. ఎప్పుడు ఎం జరుగుతాదో అనే భయాన్ని కలిగించాలి. కాకపోతే ఈ సినిమాలో అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేదానికి, మొదట కాలిపోతున్న కుటుంబం నుంచి ఆ స్త్రీ చెప్పిన మాటతో.. మొత్తం కథకి మూలం స్టార్టింగ్ లోనే తెలిసిపోయింది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు త్రిల్లర్ సినిమా మూల కథని మొదట్లోనే ఎందుకు రివీల్ చేసేసాడు అనేది ఒక పెద్ద ప్రశ్నగానే అనిపిస్తాది.

virupaksha-review-and-rating-difference-between-virupaksha-and-masooda

ఇక సినిమా మూల కథకి 3 పాయింట్స్ ఇంపార్టెంట్ గా రాసుకున్నాడని అర్ధమవుతుంది. అవేమిటంటే 1, క్షుద్రపూజలు. 2, పగ. 3, ప్రేమ. వాటిలో దేనికి ఎంత ప్రాధాన్యం ఉంటాది, చివరికి ఏది గెలుస్తాది అనే దానిపై ఆలోచించి దర్శుకుడు కథ రాసుకున్నాడు అనిపిస్తుంది. అతను రాసుకున్న మూల కథ, నీతి రెండూ బాగున్నాయి. కానీ వాటిని ప్రజంట్ చెయ్యడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడని అనిపిస్తుంది. మొదటిది క్షుద్రపూజలు అయితే బాగానే చూపించాడు గాని.. పగ చూపించాలంటే చాలా సెంటిమెంట్ ఫీల్ కలిగించాక అప్పుడు పగ పూర్తిగా వర్కౌట్ అవుతాది. పగకు కారణమైన సెంటిమెంట్ చూపించడంలో అంత ప్రావీణ్యం కనిపించలేదు. ఇక మూడవ పాయింట్, సినిమాకి ప్రాణం పొసే పాయింట్ ప్రేమ. దీనికి కథ రాసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు గాని, సినిమాలో ప్రేమ మాత్రం అస్సలు కనిపించలేదు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ చాలా బాగా తియ్యాల్సిన సినిమా ఇది. అదే సినిమాకి ఆక్సిజన్ లాంటిది. కానీ ఆ ప్రేమని చాలా నీరసంగా, ఎలాంటి ఫీలింగ్స్ కలగకుండా తీసాడు. ( Virupaksha Review and Rating )

See also  Baby Movie Review: ఈ సినిమా ద్వారా దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడు?

ఇక ఈ సినిమాలో సాయిధర్మతేజ్ హీరోయిజమ్ చూపించేలా నటించలేకపోయాడో, లేక దర్శకుడు ఆ అవకాశం ఇవ్వలేదో తెలీదు కానీ.. చాలా సాదా సీదాగా నటన ఉంటాది. అలాగని వికట పుట్టేలా ఎక్కడ ఓవర్ యాక్షన్ కూడా లేదు కానీ.. సాయిధర్మతేజ్ అభిమానులకు సంతృప్తిని ఇవ్వడం కష్టమే. ఇక సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ సూపర్. అందానికి అందం, నటనకి నటన అన్నిటినీ అదరగొట్టింది. ఈ సినిమాని 80% నిలబెట్టేది మాత్రం సంయుక్త మీనన్ మాత్రమే. సంయుక్త మీమన్ అభిమానులు, ఆమెను ఇష్టపడేవారు ఈ సినిమా తప్పకుండా చూడచ్చు. దర్శుకుడు మొత్తం ఫోకస్ అంతా ఆ పాత్ర మీదనే పెట్టాడు. ఆ పాత్రను చూపించడంలో మాత్రం దర్శుకుడు చాల బాగా సక్సెస్ అయ్యాడు. ఆమె కూడా చాలా బాగా పాత్రలో ఇమిడిపోయి నటించింది.

virupaksha-review-and-rating-difference-between-virupaksha-and-masooda

త్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ సినిమాలో ఎక్కడికక్కడ సడెన్ గా వచ్చే సౌండ్స్, కథలో అనుకోని సంఘటనలు బాగానే పెట్టారు గాని, ఆడియన్స్ అయితే భయపడిపోలేదు. ఇలాంటి సినిమా ఇటీవల కాలంలో వచ్చిన మసూధ సినిమా ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందింది. ఆ సినిమాలో ఎందుకు అలా జరుగుతుందో అర్ధంకాక సినిమా సగం పైన నడుస్తాది. ఈ సినిమాలో స్టార్టింగ్ లోనే ఎందుకు ఇవన్నీ ఇన్నేళ్ల తరవాత జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ మొదట తెలుసు కాబట్టి , ఎందుకు అనే ప్రశ్న ఆడియన్స్ మైండ్ లో ఉండదు. దానివలన సగం త్రిల్లర్ ఉన్నా కూడా ఫీల్ అవ్వరు. మసూధ లో ఎందుకు అలా జరుగుతుందో తెలీదు కాబట్టి.. ప్రతీ సీన్ ప్రేక్షకుడికి భయాన్ని కలిగిస్తాది. అయితే మసూధ సినిమాలో అస్సలు సరిగ్గా లేనిది, ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నది ఏమిటంటే.. కథకి ఒక అర్ధంపర్ధం ఉండటం. ఈ సినిమాకి ఒక మూల కథ ఉంది. దాని అనుసంధానంగా సీన్స్ రాసుకున్నాడు.

మాసూద సినిమా మొత్తం సీన్స్ మీద ఆధారపడి ఉంది, దానికి అనుసంధానంగా అర్ధంపర్ధం లేని కథ ఉంటాది. ఈ సినిమాకి అన్నిటికంటే పెద్ద అసెట్ ఏమిటంటే సుకుమార్ రచన కావడం. త్రిల్లర్ సినిమాలో పైగా ఇలాంటి క్షుద్ర పూజల సినిమాల్లో భయపెట్టడమే తప్ప లాజిక్ ని అస్సలు ఫాలో అవ్వరు. మన లాజిక్ డైరెక్టర్ సుకుమార్ రచన, అతని శిష్యుడు దర్శకత్వం అనే మార్క్ మాత్రం.. సినిమాలో హీరో లాజిక్ ఆలోచించిన ప్రతీసారి కనిపిస్తుంది. సినిమాలో బాక్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కాకపోతే హీరోయిజమ్ లేని సినిమాలో.. చిరంజీవిలా హీరోయిజమ్ చూప్పించే సాయిధర్మతేజ్ ని తీసుకోవడం తప్ప మిగిలిన అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు బాగానే నటించారు. ఇకపోతే సునీల్ పాత్రని ఎదో అలోచించి పెట్టి.. ఏటో తేల్చారా? లేక దేనికి కథలో ఇమిడ్చారో అన్నట్టు అనిపిస్తుంది కానీ, తనవరకు తాను బాగానే చేసాడు. ఇక సినిమాలో కామెడీ అయితే అస్సలు లేదు.

See also  Malli Pelli : మళ్ళీ పెళ్లి సినిమాలో మళ్ళీ చేయకూడని మిస్టేక్ అదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

సినిమాలో ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ దర్శకుడిలో కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా హీరో ఫేమ్ లేని సినిమాలు, త్రిల్లర్ మరియు హర్రర్ సినిమాలు తీసేటప్పుడు కొంత వెరైటీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి.. సినిమాలో అసభ్యకరమైన కొన్ని సన్నివేశాలు ఎక్కువ ఇలాంటి సినిమాల్లో ఉంటాయి. కానీ దర్శకుడు ఆ దారిలో వెళ్ళలేదు. అలాంటివి లేకపోయినా తన సినిమా కచ్చితంగా ఆదరిస్తారనే ధైర్యంగా తీసాడనిపిస్తుంది. ఇకపోతే సినిమాలో అసలు పాయింట్ మొదట్లోనే చెప్పేసినా కూడా.. ప్రతీ మలుపు తిరగటానికి కారణం అదే అని తెలిసినా కూడా, చివరికి హీరో ఆ సమస్యని సాల్వ్ చేస్తాడని ధీమాగా ఉన్నా కూడా, ఇన్నీ తెలిసిపోయినా కూడా అసలు నెక్స్ట్ దాన్ని ఎలా చూపిస్తాడో, ఏ మలుపు తిప్పుతాడో చూద్దాం అనేలా సినిమా హాల్లో కూర్చోబెట్టడంలో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయ్యాడు. పైగా సోషల్ మీడియాలో ముందుగా వేసిన రివ్యూ ల ఆధారంగా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని బయట పెట్టినా కూడా, అవి తెలిసిన ప్రేక్షకుడిని కూడా సినిమా హాల్ లో కూర్చోబెట్టాడు దర్శకుడు. ఆ నైపుణ్యం గాని లేదా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి వచ్చును. సినిమాలో పాటలు యావరేజ్ గా ఉన్నాయి. అన్ని కోణాలనుంచి చూస్తే సినిమా బాగానే ఉంది అని అనిపించుకుంది.

Rating; 2.5/5
ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం నుంచి ఇచ్చినదే.
అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..