Lavanya Tripathi – Niharika : మెగా కుటుంబంలో అందరూ ఎదురు చేస్తున్న పెళ్లి వేడుక మొదలవడానికి ఇంకెన్నో రోజులు లేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ని ( Lavanya Tripathi and Niharika ) మెగా కుటుంబం ఎంతో ఆనందంతో వైభవంగా చేసింది. మెగా ఇంట్లో ఏ పండుగైనా, ఏ శుభకార్యమైనా కూడా మెగా అభిమానులందరికీ ఆ వేడుక జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు. అభిమానులు అందుకే మెగా కుటుంబంలో జరిగే ఏ వేడుకనైనా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమించుకుని చివరికి పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యారు. వీళ్ళ పెళ్ళిలో ఉన్న ట్విస్ట్ ఒకటి ఏమిటంటే.. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తుందా లేదా అనేది.. ఎందుకంటే ఇప్పటివరకు చాలా వార్తలు లావణ్య త్రిపాఠి ఇక మీదట నటించదు అని వస్తున్నాయి గాని.. అది ఎంతవరకు నిజమో ( Lavanya Tripathi and Niharika ) అఫీషియల్ అయితే ఏం తెలియదు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కి కెరీర్ మీద ఇంకా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఒక స్టార్ హీరోగా స్టార్డం తెచ్చుకోవాలంటే ఇంకా విపరీతంగా అతను చేయాల్సిన ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ గాండీవదారి అర్జున పై అభిమానులందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
కొడుకు జీవితం నెమ్మదిగా సెట్ అవుతున్న సమయంలో నాగబాబుకి కూతురు జీవితం సమస్యగా మొదలైంది.సమస్య అని ఆయన అనుకోవడం లేదు అందుకనే మంచి తండ్రి అని అనుకోవాలి. కాకపోతే ఏదైనా మనసులో కొంత బాధ ( Lavanya Tripathi and Niharika ) అయితే ఉంటుంది కదా అని అందరు అనుకుంటున్నారు. నిహారికకి వైభవంగా పెళ్లి చేసి.. ఆమె జీవితం సెటిల్ చేసేసానని నాగబాబు అనుకున్నారు కానీ.. కొద్దికాలంలోనే ఆమె విడాకులు తీసుకుని రిటర్న్ అయిపోయింది. అయితే ఇప్పుడు నిహారిక కారణంగా నాగబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంట. ఆ నిర్ణయం వలన ఇప్పుడు లావణ్య త్రిపాఠి కి నష్టమని అందరూ అనుకుంటున్నారు.
ఇంతకీ అదేంటంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆగస్టు 25 నుచి 30 లోపు తారీకుల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆగస్టులో వాళ్ళు పెళ్లి చేయకూడదని ఎందుకంటే.. ఇటీవలే నిహారిక విడాకులు తీసుకుందని.. ఆ బాధ నుంచి ఇంకా కుటుంబం తేరుకోలేదని.. అందుకని పెళ్లికి కొంచెం గ్యాప్ ఇస్తే మంచిదని నాగబాబు అనుకుంటున్నారు అంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఎందుకంటే అఫీషియల్ గా ఎలాంటి వార్త రాలేదు కాబట్టి. కానీ ఇదే నిజమైతే.. నిహారిక కారణంగా లావణ్య త్రిపాఠికి పెళ్లి లేట్ అవుతుందని.. దానివలన లావణ్య త్రిపాఠి అటు సినిమాల్లోని నటించక ఇటు పెళ్లికి గురించి అలా కూర్చుని తన టైం, తన కెరీర్ కూడా వేస్ట్ ఏ కదా అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా ఇంకా పెళ్లయి వదిన కాకముందే ఆడపడుచు గా లావణ్య త్రిపాఠి ని నిహారిక బాధపెడుతుందని మరికొందరు నవ్వుకుంటున్నారు. అయినా ఇందులో నాగబాబు నిర్ణయం ఉందని.. నిహారిక కి ఏమిటి సంబంధం అని నెటిజనులు వాపోతున్నారు.