Home Cinema Ileana: తన భర్త ఎవరో తెలిపిన ఇలియానా. పెళ్ళి అప్పుడు చేసుకున్నానంటూ వెల్లడి.

Ileana: తన భర్త ఎవరో తెలిపిన ఇలియానా. పెళ్ళి అప్పుడు చేసుకున్నానంటూ వెల్లడి.

ileana Revealed: ఫిల్మ్ ఇండస్ట్రీలో గోవా బ్యూటీగా పేరు కైవసం చేసుకున్న ముద్దుగుమ్మ ఇలియానా అని మనందరికీ తెలుసు.. ఇటీవలే ఆమె తల్లయ్యి ఆగస్టు ఒకటో తారీఖున ఓ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో మరియు ప్రేక్షకులతో ఈ విషయాన్ని పంచుకుంది. ఇతర సెలబ్రిటీలు సంవత్సరం దాటే వరకు వాళ్ల పిల్లల ఫోటోలు ఉన్నట్టుంటా వైరల్ అవ్వకుండా చూస్తారు. కానీ ఇలియానా పుట్టినరోజు నాడే తన బాబుని పరిచయం చేస్తూ తన పేరు కూడా తెలియపరచింది.

ileana-revealed-who-her-husband-was-and-got-married

ఇక తన బాబు పేరును కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. ఇక్కడి వరకు బానే ఉంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వెల్లడిస్తుంది. కానీ అసలు తన పెళ్ళెప్పుడు జరిగింది.? ఆ బాబుకి తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం ఇంత వరకు బహిర్గతం చేయలేదు. ఇక తను ప్రెగ్నెంట్ అనే విషయం కొద్దిగా ముందే తెలుపుతూ తరచూ సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. దాంతో ఒక్క సారిగా సోషల్ మీడియాలో ఇలియానా పెళ్ళి అవ్వకుండా తల్లి ఐనట్టు పెద్ద ఎత్తున ఒక్క సారిగా ట్రోలింగ్ కు గురైంది.

See also  Nani - Hi Nanna : హాయ్ నాన్న రిజల్ట్.. ఆ హీరోయిన్ పై నాని ఫీలింగ్ ఇలా అవుట్..

ileana-revealed-who-her-husband-was-and-got-married

అయినా కూడా సోషల్ మీడియాలో ఇలియానా స్పందించలేదు.. కానీ పోయిన నెలలో డేట్ నైట్ క్యాప్షన్ పేరుతో తన ప్రియుడి ఫోటోలను షేర్ చేసింది. కానీ అతని పేరు గాని అతని తో పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇంత వరకు తెలుపలేదు. ఇన్ని వార్తల నడుమ ప్రస్తుతం ఇలియానా గురించి ఓ వార్త నేట్టింట వైరల్ గా మారింది. ఇలియానా సీక్రెట్ గా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంది. మే 13 వ తారీకున అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగిందట. కానీ ఇన్ని రోజులు వీరి వివాహం ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త వహించింది.

See also  Ram Charan : చిరంజీవి లేని టైం లో రామ్ చరణ్ అలాంటి మాటలు అన్నాడట.. దీనికి అభిమానులు..

ileana-revealed-who-her-husband-was-and-got-married

ఎంత జాగ్రత్త పడిందంటే ఇన్ని రోజులు వేరే పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు రానంతగా.. అయితే గత ఏడాది నుంచి ఇలియానా మైఖేల్ డోలన్ వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉండగా ఇలియానా ప్రెగ్నెంట్ అయిందట. దాంతో వీళ్లిద్దరూ అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్నారట. ఇక వీరి వివాహం జరిగిన మూడు నాలుగు వారాల తర్వాత ఇలియానా (ileana Revealed) తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మరి ఇదంతా నిజమని తెలియాలంటే ఖచ్చితంగా త్వరగా ఇలియానా నోరు మెదపాల్సిందే.. ఐతే తొలి సినిమా దేవదాసుతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఇలియానా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి చిత్రంలో నటించి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సౌత్ లో స్టార్ హీరోయిన్  వెలుగు వెలిగింది.