Home Cinema Ram Charan – Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిం కారా పై...

Ram Charan – Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిం కారా పై ఈ వీడియోలో కన్నీళ్లు సీన్స్ వైరల్..

ram-charan-and-upasana-release-a-klin-kaara-video-viral

Ram Charan – Klin Kaara : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటే అందరికీ వాళ్ళ కుటుంబం లాగా అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నాటిన ఈ మొక్క పెద్ద వృక్షమై ఎందరికో నీడ నచ్చింది. అలాంటి మెగాస్టార్ చిరంజీవికి ఏకైక వారసుడు రామ్ చరణ్. రామ్ చరణ్, ఉపాసన పెళ్ళయి 10 సంవత్సరాల అయినా ( Klin Kaara video viral ) కూడా పిల్లలు పుట్టడం లేదని ఎంతోమంది ఎన్నో రకాలుగా టెన్షన్ పడ్డారు కానీ.. చివరకు 11వ వేట వాళ్ళకి బంగారం లాంటి పాప పుట్టింది. ఆ పాపకు క్లిం కార అని పేరు కూడా పెట్టుకున్నారు. పుట్టి నెలరోజులు అవడంతో ఉపాసన పుట్టిన రోజు కూడా కావడంతో రామ్ చరణ్ ఒక మంచి వీడియోని డిలీట్ చేశారు.

See also  Akira Nandan: అకిరా నందన్ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు అశ్యర్యపోయ్యే సమాధానం ఇచ్చిన వరుణ్ తేజ్..

ram-charan-and-upasana-release-a-klin-kaara-video-viral

ఈ వీడియోను ప్రముఖ చిత్ర నిర్మాత జోసెఫ్ రాధిక నిర్మించి, దర్శకత్వం వహించారు. ఇందులో ప్రతి మూమెంట్ కూడా మెగా కుటుంబం ఎంత సెంటిమెంటు, ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఎంత ఉన్నాయో ఈ వీడియోలో చాలా ( Klin Kaara video viral ) బాగా కనిపిస్తుంది. ఈ వీడియోలో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన వీళ్ళతోపాటు.. ఉపాసన తల్లిదండ్రులు శోభన కామినేని, అనిల్ కామినేని కూడా ఉన్నారు. 9 నెలల పాటు ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్లందరి ఫీలింగ్స్, హ్యాపీనెస్ అవన్నీ కూడా ఈ వీడియోలో షార్ట్కట్లో చూపించారు. అలాగే బేబీ డెలివరీ టైమ్ లో ఎవరు ఎలా ఫీలయ్యారు అనేది కూడా చూపించారు.

ram-charan-and-upasana-release-a-klin-kaara-video-viral

ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ వరకు జరిగిన ప్రయాణంలో ఇంపార్టెంట్ మూమెంట్స్ సెంటిమెంట్ మూమెంట్స్ అన్నీ చూపించడమే కాకుండా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆ తొమ్మిది నెలల అనుభవం ఇప్పుడు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుందని.. డెలివరీ టైం లో అయితే అందరం చాలా టెన్షన్ లో ఉన్నామని.. అంతా సవ్యంగా జరగాలని కోరుకున్నామని.. భగవంతుడు దయ వల్ల అన్ని బాగానే జరిగి క్లిం కార రావడం జరిగిందని.. ఆనందంగా ( Klin Kaara video viral ) చెప్పుకుంటున్నాడు. అయితే క్లిం కార పేరు ఎందుకు ఎలా సెలెక్ట్ చేసుకున్నారో కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారని చెప్పారు. సదరు చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలో భాగం వారి సంస్కృతంలోని గొప్పతనం విలువలే పాపకు ఆ పేరు పెట్టడానికి కారణం అయ్యాయని చెప్పారు.

See also  Tamannaah : తమన్న కి ముందే అతనితో పెళ్లయిందని.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని..

ram-charan-and-upasana-release-a-klin-kaara-video-viral

అలాగే ఉపాసన కూడా ఈ వీడియోలో మాట్లాడింది. తన పాప పేరుకి ముందుగానీ, వెనక గాని ఎటువంటి ట్యాగులు పెట్టొద్దని.. అలాంటివి మనం పెట్టకూడదని.. వాళ్లకు వాళ్లే ఎదుగుతూ సంపాదించుకోవాలని చెప్పింది. పిల్లల పెంపకం విషయంలో ఇలాంటి జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని చెప్పింది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని.. పిల్లలతో గడిపే ప్రతి నిమిషం చాలా విలువైనదని.. వాళ్లతో గడిపిన ప్రతిక్షణానికి మనం విలువ ఇవ్వాలని చెప్పింది. నిజంగా అంత సెలబ్రిటీ అయి ఉండి కూడా.. ఆమె పిల్లల విషయంలో ఇంత జాగ్రత్త, ఇంత క్రమశిక్షణగా ఆలోచిస్తుంది అంటే.. నిజంగా ఉపాసన లాంటి భార్య దొరకడం రామ్ చరణ్ అదృష్టమే అనే అందరూ అనుకుంటున్నారు.