Home Health మన గుండె ఆరోగ్యం కోసం పురుషులు చేయవలసిన కనీస జాగ్రత్తలు.

మన గుండె ఆరోగ్యం కోసం పురుషులు చేయవలసిన కనీస జాగ్రత్తలు.

పురుషులు గుండె కోసం ఈ జాగ్రత్తలు పాటించాలి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలకంటే పురుషులకి ఎక్కువ గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. వారిలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం కావచ్చు అలాగే ఒత్తిడి,ఒత్తిడితో కూడుకున్న మొదలవు కారణాలు కావచ్చు. కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం….

1. డైట్

డైట్ పేరుతో చాలామంది పురుషులు ఎక్కువగా ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మనం తినే రెగ్యులర్ సహజమైన ఆహారం కాకుండా వీరు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. అధిక ప్రోటీన్ వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు మన దరిచేరతాయి. అందుకే ఆహారంలో సమతుల్యమైన ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.

2. అధిక బీపీ

కొందరికి చాలా బీపీ ఉంటుంది అలాంటి వాళ్ళు నిత్యం ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తో మీ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. విపరీతమైన ఒత్తిడికి గురికావడం తగదు. అధిక బీపీ గుండెపోటుకు దారితీస్తుంది.

See also  చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయి.! పగలకుండా పరిష్కారం ఏమిటి.?

3. చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించుకోవడం.

బ్లడ్ లో ఉండే చక్కర స్థాయిలను నిత్యం చెక్ చేయించుకుంటూ షుగర్ బారిన పడకుండా కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మన రక్తంలో ఉండే అధిక షుగర్ లెవెల్స్ మధుమేహానికి దారి తీయడం కాకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మన రక్త సరఫరాను కూడా అడ్డుకుంటుంది అందుకోసమే దీనికోసం మనం సరైన ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటూ ఉండాలి.

4. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

ఇటీవల కాలంలో ప్రతి ఒక్క పురుషునికి 90% మద్యపానం ధూమపానం ఖచ్చితమైన అలవాటుగా మారిపోయింది అందుకోసం మన గుండె కోసమైనా మనం ధూమపానం మద్యపానాన్ని తగ్గించాలి. ఇలాంటి చెడు అలవాట్లకు మనం దూరంగా ఉండాలి. వీటి వల్ల మన శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి అందులో ముఖ్యమైనది మన గుండె, ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బ తినడమే కాకుండా గుండె కూడా దెబ్బతింటుంది. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.

See also  తినే టైమ్ లో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా.? తెలుసుకోండి ఈ విషయాలు మీ కోసమే...

5. సరైన నిద్ర.

మనం రోజులో ఎంత ఒత్తిడినైనా దిగమింగుకోవాలంటే దానికి సరైన నిద్ర కచ్చితంగా ఉండాలి. ఎంత పని వలన అయినా కలిగిన ఒత్తిడిని నిద్రపోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. గుండె ఆరోగ్యంగా మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరు కనీసం రోజుల్లో ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర కచ్చితంగా పోవాలి అప్పుడే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

6. అధికమైన బరువు

ఈ జనరేషన్లో ఉండే ఈ ఆహార పదార్థాల వల్ల ప్రతి ఒక్కరు సులువుగా లావక్కి పోతున్నారు. అలాగే మన జీవనశైలి మన ఆహార అలవాట్లకు పెట్టే లావు పెరగడం జరుగుతుంది. టైం కి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా లావు పెరిగిపోతుంటాము. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అధిక బరువు పెరగడం అంటే శరీరంలో కొవ్వు పేరు కొని ఉండడం ఇలాంటి కొవ్వు వలన గుండెకు ఉండే పనులు తిరిగి చాలా ఆటంకం కలుగుతుంది, ఇలాంటి ఆటంకాలను అధిగమించాలంటే నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి మంచి పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

See also  Sudden Heart Attack: అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడానికి గల కారణాలేంటి.?