Home Cinema Roja: హాస్పిటల్ లో రోజా.. ఈ పరిస్థితికి అసలు కారణం..

Roja: హాస్పిటల్ లో రోజా.. ఈ పరిస్థితికి అసలు కారణం..

r-k-roja-in-apollo-hospital-for-leg-pain-treatment

Roja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రోజా . ఆమె ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించి మెప్పించింది. అప్పట్లో ఉన్న హీరోయిన్స్ తో పోలిస్తే కొంచెం రంగు తక్కువగా ఉన్నప్పటికీ.. ఆమె కళ్ళలో ఉన్న పవర్ తో, నటనా ప్రతిభతో సినిమాల్లో బాగా ( R.K.Roja in Apollo Hospital ) రాణించింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు వైసీపీలో రాజకీయపరంగా.. ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే ప్రతిపక్షాలని ధీటుగా మాటలు అడిగి.. కడగాలన్నా.. వాళ్ళ మీద గట్టిగా ఎగరాలన్నా.. ఆమెకు ఆమె సాటి అని అందరూ అనుకుంటారు. ఇటు సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుని, అలాగే రాజకీయపరంగా మంచి స్థాయికి వచ్చి.. ఇంకా టీవీ షో లకి గెస్ట్ గా కూడా వెల్తూ ఉండేది.

See also  Sai Pallavi: ఇలియానా లా సాయి పల్లవి పెళ్లి అవ్వకుండానే తల్లి కాబోతుండా.? వైరల్ అవుతున్న వీడియో..

r-k-roja-in-apollo-hospital-for-leg-pain-treatment

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రధానమైన ప్రాముఖ్యతనే ఆమె సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న రోజా అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెకు కాలు నొప్పి, వాపులు వచ్చి విపరీతమైన బాధని భరించలేక ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తుంది. శుక్రవారం ( R.K.Roja in Apollo Hospital ) రాత్రి చెన్నైలో తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్న రోజా సడన్గా కాలు నొప్పి ఎక్కువగా వచ్చి కాళ్లు వాసిపోవడం చూసి.. కుటుంబ సభ్యుల ఆమెకు చెన్నైలోనే 1000 లైట్స్ లో ఉన్న అపోలో ఆసుపత్రికి తీసుకొని వెళ్లి.. జాయిన్ చేయడం జరిగింది. ఆమె ఆసుపత్రిలో చేరగానే వైద్య బృందం అన్ని రకాల టెస్టులు హడావిడిగా చేయించారు.

r-k-roja-in-apollo-hospital-for-leg-pain-treatment

టెస్టులన్నీ చేసిన వైద్య బృందం ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ మొదలు పెట్టిన వైద్యుల్ని కుటుంబ సభ్యులు అడగగా.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, బాగానే ఉందని, ఎటువంటి టెన్షను లేదని, కాలువాపు కూడా తగ్గిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉన్నారు. అలాగే రోజాకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అటు సినిమా ( R.K.Roja in Apollo Hospital ) హీరోయిన్గా ఆమెను ఇప్పటికీ ఇష్టపడే సినీ అభిమానులతో పాటు.. రాజకీయపరంగా ఆమె చేసిన ఎన్నో పనులకు సామాన్య ప్రజలు కూడా ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. ఇక వైసిపి నాయకులైతే ఆమె వాళ్ళకి ఒక ఫైర్ బ్రాండ్ లా కనిపిస్తుంది. ప్రతిపక్షాన్ని ఏకాలంటే ఆమె యేసే కౌంటర్లు చాలా వైరల్ అవుతూ ఉంటాయి.

See also  Ram Charan: ప్రభంజనం సృష్టించిన రామ్ చరణ్.!! కేవలం నటించింది 14 సినిమాలు అయినప్పటికీ ఎలా సాధ్యమైంది.??

r-k-roja-in-apollo-hospital-for-leg-pain-treatment

మాటకి మాట సమాధానం చెబుతూ.. ఎదుటి వాళ్ళు ఊహించని విధంగా కౌంటర్ వేస్తూ.. ఎంతటి వారినైనా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు అడగగలిగే గొప్ప సత్తా ఉన్న మహిళ రోజా. ఈరోజు ఆమె అనారోగ్య కారణంగా సడన్గా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడం.. వీటితో ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో అని వైసిపి అధికారులు ఆందోళనలో ఉన్నారు. అలాగే సినీ అభిమానులు రోజా మళ్లీ జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఇంటికి వచ్చేయాలని.. ఆమె మాటలు ఎప్పటికప్పుడు వింటూ ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే ఆవిడ ఏదైనా కామెంట్ చేసిందంటే ఆ కామెంట్ ఒక్కసారిగా వెంటనే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ కామెంట్ లో అంత నిజం, నిబద్దత సప్త ధైర్యం అన్ని కాన్ఫిడెన్స్ అన్నీ కూడా అందులో కనిపిస్తాయి ఏదేమైనా రోజా అతి తొందరగా సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి తొందరగా వచ్చేయాలని అందరం కోరుకుందాం..