Home Cinema Hi Nanna – Niharika : నిహారిక టేస్ట్.. హాయ్ నాన్నపై చాలా ఘాటుగా స్పందించింది..

Hi Nanna – Niharika : నిహారిక టేస్ట్.. హాయ్ నాన్నపై చాలా ఘాటుగా స్పందించింది..

niharika-review-on-nani-movie-hi-nanna

Hi Nanna – Niharika : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ( Hi Nanna and Niharika ) చూసి అందరికీ విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఎందుకంటే సెంటిమెంటు సీన్స్ లో నాని ఎంత అద్భుతంగా నటిస్తాడో అందరికీ తెలిసిందే. జెర్సీ లాంటి సినిమాని కేవలం తన నటనతో తన భుజాల మీద మోసి.. దాన్ని అద్భుతమైన సినిమాగా అందరి దృష్టిలో మిగిలిచ్చాడు. అలాంటిది ఇప్పుడు కూతురు సెంటిమెంట్తో ఈ సినిమాని ఇంకెంత బాగా చేస్తాడో, ఎలా చేస్తాడో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూశారు.

Niharika-Konidela-review-on-Hi-Nanna

అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఈ సినిమాలో నాని తన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సెంటిమెంటు సీన్స్ ని విపరీతంగా పండించేసాడు. అలాగే మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో తనలో ఉన్న ఒక కొత్త కోణాన్ని మళ్లీ చూపించి.. తన నటన ( Hi Nanna and Niharika ) ప్రతిభతో తన క్యారెక్టర్ కి ప్రాణం పోసేసింది. ఇక ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించిన చిన్నారి కియారా అద్భుతంగా నటించేసి ప్రేక్షకుల్ని ఆకట్టేసుకుంది. ఈ సినిమాకి వీళ్ళ ముగ్గురు మూడు కోణాల నుంచి కాపాడుకుంటూ వచ్చేలా దర్శకుడు మొత్తం ప్లాన్ చేసి అద్భుతంగా తన మొదటి సినిమాని అందరి ముందుకి తీసుకొని వచ్చాడు.

See also  Naga Chaitanya - Sai Pallavi: అదిరిపోయే టాక్.. చైతు జీవితంలోకి సమంత ప్లేస్ లో సాయి పల్లవి..

Niharika-review-on-Hi-Nanna-movie

ఇక ఈ సినిమాని చూసి పలువురు సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని, రివ్యూస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మెగా డాటర్ నిహారిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ఎంతో కృషి ( Hi Nanna and Niharika ) చేస్తున్న ఆమె గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నిహారిక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ లైన్లో దూరి సినిమా నిర్మిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. అందుకే ఆమె ఖచ్చితంగా సినిమాలను బాగా ఫాలో అవుతుంది. నిహారిక హాయ్ నాన్న సినిమాను చూసి తన రివ్యూ ని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిహారికా పోస్ట్.. ” ఈ సినిమా నాకు ఎంతగా నచ్చిందో చెప్పడానికి మాటలు రావడం లేదు.

See also  Sandeep Kishan: హిట్ స్టోరీ తో సందీప్ కిషన్ - క్రూయల్ యాక్షన్ డ్రామా మైఖేల్

Niharika-review-on-Hi-Nanna-movie-comments

మీరు ఈ అద్భుతమైన సినిమాను చూడండి. మీకు మీరే ఓ మంచి చేసుకున్నట్టు అవుతుంది. నాని అద్భుతంగా నటించేసాడు. మృణాల్, కియారా, ప్రియదర్శి, జయరాం ఇలా అందరూ ఎంతో అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హేషం అబ్దుల్ వాహబ్ మీరు నా మనసు దోచేశారు. శౌర్యవ్ నేను ఇది మీకు అబద్ధం చెప్పడం లేదు.. నువ్వు ఒక మాంత్రికుడివి. ఈ ఇండస్ట్రీలో నీ పేరు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. నీ నెక్స్ట్ మూవీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. నా మనసు సంతోషంతో నిండిపోయింది అంటూ నిహారిక పోస్ట్ చేసింది. నిహారిక సినిమాని ఇంత బాగా డిస్క్రైబ్ చేసి రివ్యూ ఇవ్వడంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా చూసి అది ఎలా ఉందో నిహారిక చెప్పిన తీరు, నిహారిక స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది.