Home Cinema Sandeep Kishan: హిట్ స్టోరీ తో సందీప్ కిషన్ – క్రూయల్ యాక్షన్ డ్రామా మైఖేల్

Sandeep Kishan: హిట్ స్టోరీ తో సందీప్ కిషన్ – క్రూయల్ యాక్షన్ డ్రామా మైఖేల్

హిట్ స్టోరీ తో సందీప్ కిషన్ – క్రూయల్ యాక్షన్ డ్రామా మైఖేల్

కెరీర్లో మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కు ఆరోజు దగ్గర వచ్చిందని చెప్పాలి.

ఎందుకంటే ఇటీవల విడుదలైన మైకెల్ టిసర్ చూస్తే మనకి అర్థమవుతుంది.

సినిమాటోగ్రాఫర్ మేనల్లుడు అయిన సందీప్ కిషన్ తొలిసారిగా తెలుగులో ప్రస్థానం సినిమాతో పరిచయం అయ్యాడు. అందులో చేసిన నెగటివ్ రోల్ లో మెప్పించినప్పటికీ, ఆ తర్వాత రెండు సినిమాల్లో హీరోగా నటించి విజయాలు అందుకున్నాడు.

See also  Lavanya Tripathi : చివరికి లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయం కూడా తెలుసుకున్నారు..

కానీ ఇంతవరకు తన జీవితంలో ఒక పెద్ద హిట్ అనేది లేకుండా పోయింది.

దీంతో చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత సూపర్ కంటెంట్ తో మన ముందుకు రానున్నాడు.

విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం రంజిత్ జయకోడి దర్శకత్వం వహించనున్నారు, ఇటీవల విడుదలైన టీజర్ మనకు మునుపెన్నడూ చూడని సందీప్ కిషన్ ను పరిచయం చేస్తుంది.

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవన్ వాయిస్ తో మొదలైన టీజర్ వేటాడరాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్ అని వాయిస్ కు కౌంటర్ గా వెంటాడే ఆకలిని తీర్చుకోవడానికి వేటాడడం తెలియాల్సిన పనిలేదు మాస్టర్ అనే డైలాగ్ ఈ స్టోరీ కి మరింత క్యూరియాసిటీ పెంచుతుంది.

See also  RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

యాక్షన్ అండ్ లవ్ మేకింగ్ సీన్స్ తో టీజర్ మొత్తం హై వోల్టేజ్ పుట్టిస్తుంది. ఇక్కడే అసలు స్టోరీ మైఖేల్ తన లవ్ కోసమే చేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇలాంటి రొమాంటిక్ యాక్షన్ రామ సినిమాలో విజయ్ సేతుపతి, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మొదలగు వారు కీలక పాత్రలు పోషించారు.

శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి నిర్మించిన ఈ చిత్రానికి సామ్ పి ఎస్ మ్యూజిక్ ఇవ్వగా ఫిబ్రవరి 5న విడుదల కానుంది.