Home Cinema Big Boss: బిగ్ బాస్ లో కొత్త రూల్స్.. కంటెస్టెంట్ లకి చుక్కలే..

Big Boss: బిగ్ బాస్ లో కొత్త రూల్స్.. కంటెస్టెంట్ లకి చుక్కలే..

Big Boss: తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ‘బిగ్ బాస్’ న్యూ వేవ్ తో రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్నది వేరు! ఇప్పుడు వేరు అంటూ సంకేతాలు ఇస్తుంది. సీజన్ 6 వరకు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో స్టాటింగ్ లో ఉన్న క్రేజ్ రాను రాను విపరీతంగా తగ్గుతూ పోయింది(Big Boss 7 Telugu). ఇక సీజన్ 6 పూర్తయ్యే వరకు దాదాపుగా పూర్తిగా రేటింగ్ పడిపోయింది. ఒక సారి హోస్టింగ్ బాగా లేదని, మరోసారి కంటెస్టెంట్స్ సరిగా పార్టిసిపెంట్ చేయడం లేదని సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బిగ్ బాస్ 6 పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి.

See also  Rakul Preet Singh: డైరెక్టర్లు ఏది అడిగినా కాదు అనకుండా వాళ్ళ కోరిక తీర్చేంత మంచిదా రకుల్ ప్రీత్ సింగ్.?

big-boss-7-telugu

వీటన్నింటనీ తుడిచిపెట్టేందుకు ‘బిగ్ బాస్ సీజన్ 7’ ఇప్పడు రాబోతోంది. దీన్ని డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కండీషన్లతో తీసుకురావాలని భావిస్తోంది మేనేజ్ మెంట్. త్వరలో ‘బిగ్ బాస్ సీజన్ 7’ (Big Boss 7 Telugu) అంటూ అపీషియల్ ప్రకటన వచ్చింది. ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కొనసాగింది ఒకలా అయితే ఇప్పుడు మరోలా కొనసాగునుంది. ఈ సారి హౌజ్ లోకి అల్లా టప్పా మెంబర్స్ ను కాకుండా బిగ్ సెలబ్రెటీలను తీసుకువస్తున్నారట. యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వారు రాబోతున్నట్లు తెలిసింది.

BiggBossTelugu7

కంటెస్టెంట్స్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పిన మేకర్స్. కొన్ని కండీషన్స్ పెడుతున్నారట. గతంలో హౌజ్ లోకి వెళ్లే ముందు బిగ్ బాస్ గురించి మంచిగా మాట్లాడిన వారు హౌజ్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయిన తర్వాత తీవ్రంగా విమర్శించారు. ఇక ఈ పప్పులు ఉడకవు. ఈ సారి ఎలాంటి నెగెటివ్ కామెంట్ చేసినా వారి రెమ్యునరేషన్ నుంచి భారీగా కోత పెడతారట. విన్నర్ అయినా. లూజర్ (ఎలిమినేట్) అయినా షో గురించి బయట నెగెటివ్ కామెంట్స్ చేయద్దు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సన్నివేశంలో అయినా అలా కామెంట్ చేస్తే చెల్లించిన డబ్బుల్లో నుంచి కొంత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

See also  Mahesh Babu : నమ్రతను కంటే ముందే ఆ హీరోయిన్ ని లవ్ చేసిన మహేష్ బాబు!

bangkok-pilla-big-boss

ఈ మేరకు పక్కా ప్లాన్ తో అగ్రిమెంట్ పేపర్లను ప్రిపేర్ చేసుకున్నారు మేకర్స్. వీరు చెప్పిక కండీషన్లకు ఒప్పుకుంటేనే హౌజ్ లోకి ఎంట్రీ ఉంటుంది. లేదా.. బయటకు వెళ్లాల్సిందే. ఒక వేళ ఎలిమినేషన్ అయిపోయాం ఏం మాట్లాడితే ఏముందిలే? అంటూ ఎక్కడైనా స్లిప్ అయితే అంతే సంగతులు కండీషన్ ప్రకారం రెమ్యునరేషన్ లోని కొంత డబ్బు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి లేదంటే చట్ట పరంగా ఎదుర్కోవాలి. బిగ్ బాస్ 7 గురించి ఈ వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిపై భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ సారి టాలీవుడ్ లోని సెలబ్రెటీలను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.