Home Cinema Mahesh Babu : మహేష్ బాబుతో మొదటిసారి ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న హీరోయిన్!

Mahesh Babu : మహేష్ బాబుతో మొదటిసారి ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న హీరోయిన్!

meenakshi-chaudhary-is-the-heroine-in-mahesh-babu-movie-guntur-kaaram

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అభిమానులకు అమ్మాయిలకు ఎంత పిచ్చో మనందరికీ తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇంకా అందాన్ని పెంచుకుంటూ.. తన స్టైల్ ని పెంచుకుంటూ.. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా ( Mahesh Babu and Meenakshi Chaudhary ) రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అని.. ఈ సినిమాని త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం చేస్తున్నాడని అందరికీ తెలిసినదే.

meenakshi-chaudhary-is-the-heroine-in-mahesh-babu-movie-guntur-kaaram

గుంటూరు కారం ప్రమోషన్ నిమిత్తం ఏ చిన్న వీడియో గాని, ఫోటో గాని రిలీజ్ అయిన కూడా అభిమానులు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. గుంటూరు కారంలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ షర్ట్ లు మార్కెట్లోకి వచ్చి విపరీతమైన బిజినెస్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ ( Mahesh Babu and Meenakshi Chaudhary ) సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అని అందులో మొదటి హీరోయిన్గా పూజా హెగ్డే తీసుకోవడం జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆ సినిమా నుంచి పూజా హెగ్డే ని తప్పించారు. దీనికి కారణం త్రివిక్రమ్ కి పూజా హెగ్డే మీద చిన్నచూపు అని.. ఆమె పాత్రని హైలెట్ చేయకుండా సెకండ్ హీరోయిన్ శ్రీలీల ని మాత్రమే హైలెట్ చేస్తున్నాడని పూజా హగ్దే హర్ట్ అయిందని.. అందుకే ఆమె తప్పుకుందని వార్తలు కూడా వచ్చాయి.

See also  Tarun : వాళ్ళిద్దరి దయతో జరగబోతున్న తరుణ్ పెళ్లి.. అచ్చం అలాంటి అమ్మాయేనంట!

meenakshi-chaudhary-is-the-heroine-in-mahesh-babu-movie-guntur-kaaram

అయితే ఈ వార్తల్లో ఏది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. పూజా హగ్దే మాత్రం తప్పుకుందని పక్కా వార్తలు వచ్చాయి. దానితో గుంటూరు కారంలో అసలు హీరోయిన్ ఇంకొక హీరోయిన్ ని ఎవరు పెడతారా అందరూ ఎదురు చూస్తున్న సమయంలో గుంటూరు కారంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి అని మ్యాటర్ లీక్ అయింది. ఇది ఆ నోట ఈ ( Mahesh Babu and Meenakshi Chaudhary ) నోటా విన్నది కాదు. డైరెక్ట్ గా మీనాక్షి చౌదరి నోటితో చెప్పిన మాట. రీసెంట్ గా మీనాక్షి చౌదరి నటించిన హత్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చెప్పడం జరిగింది. మహేష్ బాబుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని.. ఆయనతో నటించే అవకాశం దొరకడం నిజంగా నా అదృష్టమని ఆమె చెప్పింది. దానికి తోడు మహేష్ బాబు తో కలిసి నటించిన మొదటి షాట్ అనుభవం జీవితంలో మర్చిపోలేనని చెప్పింది.

See also  Mega Hero : విషాదంలో ఉన్న ఆ మెగా హీరోని ఇలా ఓదారుస్తూ మెగా ఫామిలీ..

meenakshi-chaudhary-is-the-heroine-in-mahesh-babu-movie-guntur-kaaram

గుంటూరు కారంలో పూజా హెగ్డేన్ తీసేసి మరో హీరోయిన్ ఎవరు పెడుతున్నారు అనేది ఇంతవరకు అఫీషియల్ గా చెప్పలేదు కానీ.. ఈ అమ్మడు మాత్రం ఈ త్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు నిజాన్ని నోరు జారిపోయింది. మహేష్ బాబుతో మొదటిసారి షూటింగ్ చేసిన ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నది. అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని అర్థం కదా.. అంటే గుంటూరు కారం సినిమాలో పూజా హగ్దే ని తీసేసి.. మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఎన్నుకున్నాడు త్రివిక్రమ్ అని అర్థమవుతుంది. ఇక మీనాక్షి చౌదరి అయితే ఎక్స్పోజింగ్ లోటుండదని సూపర్ గా ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అలాంటి సినిమాను కోల్పోయినందుకు పూజా హెగ్డే ఇంకా బాధపడొచ్చు.. ఒకవేళ అంతగా సక్సెస్ కాకపోతే రిలాక్స్ అవ్వచ్చు.. చెప్పడం ఏం జరుగుతదో..