Home Reviews Malli Pelli : మళ్ళీ పెళ్లి సినిమాలో మళ్ళీ చేయకూడని మిస్టేక్ అదేనా.. రివ్యూ మరియు...

Malli Pelli : మళ్ళీ పెళ్లి సినిమాలో మళ్ళీ చేయకూడని మిస్టేక్ అదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

malli-pelli-movie-review-and-rating

చిత్రం: మళ్ళీ పెళ్లి ( Malli Pelli )
తారాగణం: నరేష్, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, అనన్య, అన్నపూర్ణ,భద్రం
కెమెరా: బాల రెడ్డి
ఎడిటింగ్: జునైద్ సిద్దిక్
సంగీతం: సురేష్ బొల్లి
నిర్మాత: నరేష్
దర్శకత్వం: ఎం. ఎస్. రాజు
విడుదల తేదీ: 26 మే 2023 ( Malli Pelli Movie Review )

నరేష్ హీరోగా పవిత్ర లోకేష్ హీరోయిన్ గా ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా ఈ రోజు వచ్చింది. ఈ సినిమా నరేష్ జీవితంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా చిత్రీకరించబవడుతుందని చెప్పారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ మొత్తం నరేష్ మరియు పవిత్ర లోకేష్ స్వయంగా.. ఎదో ఒక సెన్సేషన్ న్యూస్ ని అందిస్తూ.. ఈ సినిమాకి ప్రమోషన్ చేశారు. వీళ్లిద్దరు ఎక్కడ కనిపించినా అక్కడ ఎదో జరిగిపోతుంది అన్నంత సీన్ క్రియేట్ అయిన తరవాత అది మళ్ళీ పెళ్లిలో భాగం అని తెలిసేది. ఆ రకంగా ఈ సినిమాకి ప్రాముఖ్యత పెరిగింది. మరి నరేష్, పవిత్ర లోకేష్ ఇంత కష్టపడి ప్రమోషన్ చేసిన మళ్ళీ పెళ్లి సినిమా ఎలా ఉందొ తెలియాలంటే కథలోకి వెల్దాము..

malli-pelli-movie-review-and-rating

కథ. ( Malli Pelli Movie Review )

ప్రేమంటే ఏమిటో, సోల్ మెట్ అంటే ఎవరో చెబుతూ సినిమా మొదలవుతాది. సినిమా మొదలు తెలుగు నటుడు నరేంద్ర ( నరేష్ ) కన్నడ నటి పార్వతి ( పవిత్ర లోకేష్ ) కలిసి కార్ లో చాలా బాధగా వెల్తూ ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళ జీవితంలో జరిగినవి చూపిస్తూ ఉంటారు.. నరేంద్ర మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ప్రజంట్ మూడవ భార్య సౌమ్య సేతుపతి (వనితా విజయ్ కుమార్), ఒక కొడుకుతో కలిసి సంతృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటాడు. ఇంతలో అతని జీవితంలోకి కన్నడ నటి పార్వతి వస్తుంది. పార్వతికి కూడా భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. నరేంద్ర – పార్వతిల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఒకరితో ఒకరు వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే పరిస్థితికి వెళ్తారు. కొన్నాళ్ళకు పార్వతి భర్తని వదిలేసి, నరేంద్ర భార్య నరేంద్ర మీద కేసు పెట్టె స్థితి వస్తుంది. నరేంద్ర, పార్వతి మధ్య రిలేషన్ ఏమిటి? ఎందుకు ఆ రిలేషన్ లోకి వెళ్లారు? నరేంద్ర మూడవ భార్య ఎందుకు కేసు పెట్టింది? పార్వతి జీవితంలో నరేంద్ర రాకముందు ఎం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

malli-pelli-movie-review-and-rating

సినిమా ఎలా ఉందంటే..

ఈ సినిమా కథ ఎలా ఉంది అనే దానిమీద దర్శకుడిని వర్ణించలేము. ఎందుకంటే కథ మొత్తం నరేష్ ఏమి చెబితే ఆయన అదే రాయడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ సినిమా నరేష్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తీశారు కాబట్టి.. సాధారణంగా సెలబ్రెటీస్ బయోపిక్స్ తీస్తూ ఉంటారు. వాళ్ళు బ్రతికి లేకపోతే.. వాళ్ళ సన్నిహితులని, విరోధులని అందరిని అడిగి కథ బాగా రాసుకుని సినిమా తియ్యాలి. లేదా.. ఎవరి మీద సినిమా తీస్తున్నామో వాళ్ళు బ్రతికే ఉంటె.. వాళ్ళ జీవితంలో పబ్లిక్ తో ( Malli Pelli Movie Review ) రిలేటెడ్ ఉన్న స్టోరీ ఎక్కువగా ఉండి, అందులో కొంత పర్సనల్ ని కలుపుతారు. అప్పుడు కూడా బయట వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటాది. పైగా ఆ సినిమాని వేరే వాళ్ళ ఇంట్రస్ట్ తో తీస్తారు. అంతే కానీ ఈ సినిమా ఎవరి రియల్ సన్నివేశాలతో తీశారో వాళ్ళు బ్రతికే ఉండగా.. వాళ్ళే నటించి, వాళ్ళే నిర్మించిన సినిమా కావడం వలన కథ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటాది తప్ప, దర్శకుడు చేతిలో ఉండదు. కాబట్టి కథకి దర్శకుడికి రిలేషన్ లేదు.

See also  Ahimsa Review : అహింస లో ఉదయకిరణ్ కనిపించాడా.. రివ్యూ మరియు రేటింగ్

malli-pelli-movie-review-and-rating

కాకపోతే చెప్పిన కథని ప్రేక్షకులకు సినిమా పరంగా ఎలా చూపించాడు, వాళ్ళని ఎలా థియేటర్ లో కూర్చోబెట్టాడు అనేదాంట్లో దర్శకుడి పాత్ర ఎక్కువగానే ఉంటాది. సినిమా మొదలు ఎదో హిందీ సినిమాలకు హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ లో ప్రేమ గురించి చెప్పినట్టు.. హమ్ ఆప్ కె హాయ్ కౌన్ స్టైల్ లో చెప్పించారు గాని, డైలాగ్స్ బాగానే ఉన్నాయి గాని.. అది నరేష్, పవిత్ర చెప్పడం వలన పెద్దగా ఆకట్టుకోకపోగా.. ఆ డైలాగ్స్ వలన ఇద్దరు ప్రేమలో ఎలా పడతారు,సొల్ మెట్ ఎలా కనిపిస్తారు అనేది సినిమాలో ఏమైనా సూపర్ గా చూపిస్తారెమో అని ప్రేక్షకుడు అనుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ చాల వరకు సినిమా సినిమాల అనిపించలేదు.

నరేష్ – పవిత్ర లోకేష్ ని చూడ్డానికి పర్సనల్ గా వెళ్లినట్టు.. అసలు ఎందుకు వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది. అసలు నరేంద్ర.. పార్వతి ని ఎందుకు ప్రేమించాడు? అనేదానిపై ఒక మంచి కారణం చూపించలేకపోయారు. సరే.. ప్రేమంటే.. కారణం లేకుండా, అనుకోకుండా, ప్లాన్ చెయ్యకుండా పుడుతుంది. కానీ, రెండు క్యారెక్టర్ల మధ్య సినిమాలో ప్రేమ చూపించడానికి కారణం ఇవ్వకపోయినా.. ఫీలింగ్ ని చూపిస్తారు. ఈ సినిమాలో ( Malli Pelli Movie Review ) వీళ్ళిద్దరూ కచ్చితంగా ప్రేమించుకోవాల్సిన సంఘటనలు గాని, ఫీలింగ్స్ గాని చూపించలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ చాలా స్లో గా , విసుగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేటప్పటికి సినిమా పై కొంచెం చూపు పడుతుంది. ఒక ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఇచ్చాడు దర్శకుడు.

సెకండ్ ఆఫ్ సినిమా కొంచెం పరవాలేదు అనిపిస్తాది. ఎందుకంటే.. కథ మొదలవుతాది కాబట్టి.. పైగా ఆ కథలో ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యి.. అందులో వేరే నటులు కనబడటం వలన ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో పార్వతి ఫ్లాష్ బ్యాక్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసాడు దర్శకుడు. అక్కడి వరకు మనం ఒక సినిమాకి వెళ్ళాం అని అనిపిస్తుంది. పార్వతి జీవితంలో ఆమెకు అనుమానంగా మిగిలిపోయిన ఒక మిస్టరీ గురించి.. ఆమె తెలుసుకున్నప్పుడు.. ఆమె ఫీలింగ్స్, నటన బాగానే ఉంది. ఈ సినిమాలో నరేష్ పాత్ర ఏమి అద్భుతంగా అయితే లేదు కానీ, ఆయున చెప్పాలనుకున్నది మనం నమ్మాలనే ఆత్రం ఆయన నటనలో కనబడింది. విజయ నిర్మల పాత్రలో జయసుధ బాగానే చేసింది. జయసుధ, నరేష్ ల మధ్య సీన్స్ బాగానే ఉన్నాయి.

See also  Vidudala Review and Rating: విడుదల పార్ట్ 1 లో కళ్ళకు కట్టినట్టుండే అద్భుతమైన సీన్స్ ఇవే.. రివ్యూ మరియు రేటింగ్..

నరేంద్ర ని అతని మూడవ భార్య కాలితో తన్నిన సీన్ దగ్గర నరేష్ నేనెవరిని అనుకుంటున్నావు అనే చోట ఒక్కసారిగా.. విజయనిర్మల గారు కనిపించారు. ఈ సినిమాలో కథ మొత్తం నరేష్, పవిత్ర లోకేష్ ల వైపు నుంచి వెర్షన్ మాత్రమే చూపించారని ఆడియన్స్ ఆరోపణ ఒకవైపు ఉంటె.. సినిమాలో కృష్ణ విజయనిర్మల గారి రేలషన్ చూపిస్తూ.. వాళ్ళ లాగే వీళ్లిద్దరి రిలేషన్ అని కూడా చూపిస్తూ.. ప్రజలు కృష్ణ విజయనిర్మల గారి జంటను ఎంత గౌరవంగా అంగకరించాలో.. వీళ్ళని కూడా అదే కోణంలో చూస్తూ గౌరవించమని చెప్పుకున్నట్టు అనిపించింది. ఇలాంటివి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకోవడం వలన, చూపించడం వలన రాదు.. కాలం గడిచేకొద్దీ.. వాళ్ళ బంధంలో ఉండే గొప్పతనం అనేది నిజంగా ఉంటె.. అది బయటకు వస్తాది పైగా వాళ్ళ మీద సినిమా తీసి చెప్పకపోయినా కూడా ప్రజలు చెప్పుకుంటారు, గౌరవిస్తారు కూడా.

పవిత్ర లోకేష్ సినిమాలో అందంగా ఉంది. ఆమె పాత్రలో చేసిన ఇంకొక క్యారక్టర్ అనన్య నాగళ్ల తనకు దొరికిన సమయం వరకు తను బాగానే నటించింది. నిర్మాణ విలువలు, మ్యూజిక్ బాగానే ఉన్నాయి. అయితే ఒక సినిమా తీసేటప్పుడు.. అది కల్పించి రాసిన కథ కావచ్చు, రియల్ స్టోరీ కావచ్చు.. కానీ ఆ సినిమా చివరిలో ఎదో ఒక నీతి చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడో ప్రేక్షకులకు ( Malli Pelli Movie Review ) అర్ధం కాలేదు. కేవలం నరేష్ చెప్పిందే చెప్పాలంటే.. సినిమా తియ్యడం ఎందుకు? నరేష్ మీడియాలో చిన్నగా స్టోరీ లా అయన జీవితంలో జరిగింది చెప్పేస్తే సరిపోతాది. అసలు ఈ సినిమాకి మళ్ళి పెళ్లి అనే పేరు ఎందుకు పెట్టారు? నరేంద్రకి మళ్ళి నాలుగవ పెళ్లి అవుతాదనా? లేకపోతే మళ్ళీ మళ్ళీ పెళ్లిళ్లు చేసుకుంటే ఇలాంటి సమస్యలో, లేక ఇలాంటి ఎంటర్టైన్మెంట్ , లేదా ఇంకేమైనా కూడా చెప్పి ఉంటె బాగుణ్ణు అనిపిస్తుంది.

ఇకపోతే ఈ సినిమాని ఒక సినిమా పరంగా తీసి, ఖర్చుపెట్టిన డబ్బులు వెనక్కి రావాలని తీసినట్టు అనిపించలేదు. అలా అనుకుంటే.. సినిమాలో నటీ నటులను వేరే వాళ్లను పెట్టి.. ఆడియన్స్ ని రియల్ పాత్ర గురించి ఆలోచించనీయకుండా..రీల్ పాత్రలో బాగా ఇన్వాల్వ్ అయినట్టు చేసి.. ఇది నరేష్, పవిత్ర లోకేష్ ల రియల్ కథ అని చెప్పి ఉందురు. కానీ ఈ సినిమా కేవలం వాళ్ళ వెర్షన్ చెప్పేందుకు తీసిన సినిమా అని క్లియర్ గా అందరికీ అర్ధం అయిపోతుంది గాని, కనీసం నటీనటుల నటనకు ఎంజాయ్ చేసేలా వేరేవాళ్లను పెడితే బాగున్న అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి కథలు బాలీవుడ్ లో బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి స్టోరీస్ ని ఎంకరేజ్ చెయ్యడానికి అవకాశం కొంచెం ఉంటాది.

See also  Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

మన తెలుగు వాళ్ళు ఇలాంటి కథని ఎంకరేజ్ చెయ్యడం కష్టం అనుకుంటే.. దానికి తోడు వాళ్ళ కథ వాళ్ళు మాత్రమే నటించి చూపిస్తామంటే.. కొంచెం కష్టంగా అనిపించింది. ఈ సినిమాకి వెళ్ళేవాళ్ళందరూ నరేష్ జీవితంలో చాలా ట్విస్ట్ లు తెలుస్తాయి అనుకుని వెళ్లేలా చేసి.. పవిత్ర లోకేష్ జీవితంలో సీక్రెట్స్ మీద కాన్సెన్ట్రేట్ చేసి సినిమా తియ్యడం వలన కొంచెమైనా ఇంట్రెస్ట్ గా అనిపించింది. అసలు పెళ్లిళ్లు, సహజీవనాలు, పిల్లలు, భార్యభర్తల రిలేషన్ ఇన్ని కూడి ఉన్న సినిమాలో.. ఇలా చెయ్యడం మంచిదని గాని, చెడ్డ అని గాని ఎలాంటి కంక్లూజన్ దర్శకుడు ఇవ్వలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు.. అంటే అన్ని పెళ్లిళ్లు చేసుకోవడం మిస్టేక్ నా? పెళ్లి చేసుకోకుండా రిలేషన్ షిప్ లో ఉండటం మిస్టేక్ నా? పెళ్లి మానేసి కేవలం సహజీవనంతో పిల్లలని కనేసి పెంచడం మిస్టేక్ నా? లేదా ఇవన్నీ కరెక్ట్ అయితే నేను మిస్టేక్స్ అనుకోవడం నా మిస్టేక్ నా? అని సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నాడు.

నరేష్, పవిత్ర లోకేష్ ఈ సినిమా గురించి ఎక్కువ ప్రమోషన్ వాళ్లిద్దరే చేశారు. వాళ్లిద్దరూ మాత్రమే అంత ఫోకస్ చేసి.. ప్రమోషన్ ఎందుకు చేసారంటే.. వాళ్ళిద్దరి జీవితం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే ఈ సినిమా చూస్తారని వాళ్ళకి కూడా తెలుసన్నమాట. మొత్తం మీద ( Malli Pelli Movie Review ) నరేష్, పవిత్ర లోకేష్ ల జీవితంలో ఎం జరిగిందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అన్నవాళ్ళందరూ ఈ సినిమాకి వెళ్ళచ్చు. అంతే గాని కేవలం సినిమా మాత్రమే చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నవాళ్ళు దీనిని లైట్ తీసుకోవచ్చు..మరి ఈ విషయం జనాలకు ముందుగానే తెలుసేమో.. మొదటి షో కి సినిమాకి.. ప్రముఖ యాప్స్ లో టికెట్స్ పెద్దగా బుక్ అవ్వలేదు..

రేటింగ్: 1. 75 / 5
ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే.. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..