Home Health కాలేయం కూల్ గా ఉంటే మనం కులాసాగా ఉంటాం. దానికి మనమేం చేయాలి

కాలేయం కూల్ గా ఉంటే మనం కులాసాగా ఉంటాం. దానికి మనమేం చేయాలి

కాలేయం కూల్ గా ఉంటే మనం కులాసాగా ఉంటాం. దానికి మనమేం చేయాలి.?

కాలేయం మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది పైత్యరసాన్ని విడుదల చేస్తుంది అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. దాని పని అది చాలా పద్ధతిగా బ్రహ్మాండంగా చేస్తుంది అయితే నిత్యం మనము మనకు నచ్చింది తింటాం మనకు నచ్చిన తాగుతాం మనకు నచ్చినట్టు ఉంటాం, మరి మన అలవాట్లకు కాలేయాన్ని బలి చేయడం ఎందుకు ఆదాయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలేయానికి సంబంధించిన వ్యాధులు అలవాట్లలపరంగా కొన్ని, జన్యు పరంగా కొన్ని మరియు వంశపారపర్యంగా మనకు సంక్రమించకుండా మన కాలేయాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ముందు జాగర్త చర్యలు పాటించాల్సిందే.!

కాలేయ వ్యాధి లక్షణాలు అంత సులువుగా బయటపడవు దానికి కారణం దానికదే రిపేర్ చేసుకోగలదు కాబట్టి కాలేయ వ్యాధి లక్షణాలను గుర్తించలేము. కేవలం కామెర్లు వస్తే మన కాలేయం జబ్బు చేసిందని అనుమానిస్తుంటాము. కాలేయ వ్యాధి లక్షణాలు మన శరీరంలో చాపకింద నీరులా చేరి శరీరంలోపల కొన్ని మార్పులకు చోటు చేసుకుంటాయి. కాలేయం జబ్బు పడినప్పుడు శరీరంలో లివర్ ఎంజైమ్స్ పెరుగుట, నిస్సత్తువ, లైంగికాసక్తి లక్షణాలు తక్కువ మందిలో కనిపిస్తాయి. ఇందుకోసం మనం మల్టీవిటమిన్ల మీద ఆధారపడుతుంటాము కానీ కాలేయం ప్రతీది తనలో విలీనపర్చుకుంటుంది. కానీ అప్పటికే దెబ్బ తిన్న కాలేయం మరింత జబ్బు చేస్తుంది. కాలేయ జబ్బు పడిందని తెల్సుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

See also  ఆరోగ్యానికి అద్బుతాల గని కివీ పండు -- యాపిల్ కంటే ఐదు రెట్లు మిన్న

మీకు ఈ లక్షణాలు ఉన్నాయా.?

కాలేయం జబ్బు పడిందని తెలియజేయడానికి మన శరీరంలో కొన్ని ముఖ్యమైన సృష్టమైన లక్షణాలు మనకు కనిపిస్తాయి.

కళ్ళు పచ్చబడడం, మూత్రం పసుపు రంగులో రావడం, కాళ్లు చేతి గోర్లలో పసుపు రంగుగా మారడం, పొట్ట వాపు.

సాయంత్రం వరకు పాదాలు వాసి కాళ్లకు చెప్పులు కూడా పట్టకపోవడం.

కొద్ది దూరం నడిచేసరికి ఆయాసం రావడం, చర్మం చిన్న చిన్న తేలికపాటి దెబ్బలకే గాయపడుతుండడం, నిద్ర పట్టకపోవడం.

See also  మీ చర్మం అందంగా మెరవాలంటే ఈ జ్యూసులు తప్పక తాగండి.

మలం రంగులో మార్పు రావడం, ముక్కు మరియు చిగుళ్ళ నుంచి రక్తస్రావం కావడం.

ఈ క్రింది లక్షణాలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడటం మంచిది.

డయాబెటిస్ ఉన్నవారు, ఊబకాయలు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని ఉన్నవారు, అతిగా టెన్షన్ కు గురయ్యేవారు, మధుమేహం ఉండి మందులతో అదుపులోకి రానివారు, మద్యపానం అలవాటు ఉన్నవారైతే కచ్చితంగా కాలేయ పరీక్షలు చేపించుకోవాలి. మీ కుటుంబంలో లేదా వంశంలో ఎవరికైనా కాలేయ సమస్యలు ఉంటే మహిళలు అయితే 35 సంవత్సరాల తర్వాత పురుషులైతే 40 సంవత్సరాల తర్వాత కాలే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

See also  ఉదయాన్నే అరటి పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.?

వయసులో ఉన్నాము మనకేమవుతుంది లే అని అతిగా మద్యపానం సేవిస్తే దాని తీవ్ర పరిణామాలు దాని పర్యవసానం భారీగా ఉంటుంది అది అంతా కాలేయం పైన పడుతుంది ఇప్పుడు యువత బీర్లు తాగడం ఫ్యాషన్ అనుకుంటారు గంటల వ్యవధిలో 5,6 బీర్లు తాగేస్తుంటారు అలాంటి వాళ్ళ లివర్ అతలాకుతలమవుతుంది. బీర్లే ప్రమాదం కదా మందు తాగితే ఏమైతది అనుకోకండి మందు ఇంకా ఎక్కువ ప్రమాదకరం. కొందరు ఫుల్ బాటిల్ తాగేదాకా అలానే కూర్చుంటారు అది అయిపోతే గాని నిద్ర పట్టదు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కాలే పరీక్షలు చేయించుకోవాలి.