Home Cinema KTR – Tollywood : చిరు మహేష్ రామ్ చరణ్ లు కేటీర్ కి ఎలా...

KTR – Tollywood : చిరు మహేష్ రామ్ చరణ్ లు కేటీర్ కి ఎలా బర్త్ డే విషెస్ చెప్పారంటే..

ktr-birthday-wishes-on-social-media-by-tollywood-heroes-like-chiranjeevi-mahesh-and-ram-charan-and-others-all

KTR – Tollywood : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు. కేటీఆర్ గారు ఈరోజు 47వ పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంగా ఎందరో ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. మన టాలీవుడ్ నుంచి కూడా తారలు ఆయనకు విషెస్ చెప్పారు. ఇంతకీ కేటీఆర్ గారికి ( KTR birthday wishes by Tollywood ) మన టాలీవుడ్ నుంచి ఎవరెవరు ఎలాంటి విషెస్ చెప్పారో ఒకసారి చూద్దాం. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు కేటీఆర్ కి ఇలా విషెస్ చెప్పారు. మై డియర్ బ్రదర్ తారక్.. మీరు ఒక డైనమిక్ లీడర్.. మేమంతా ఎంతగానో ప్రేమించే మెచ్చుకునే స్నేహితుడు.. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.. మీ కలలు మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి..

See also  Varalaxmi Sarathkumar : అవ్వ.. బూతు గురించి పచ్చిగా భయంకరమైన ఉదాహరణ ఇచ్చిన వరలక్ష్మి!

ktr-birthday-wishes-on-social-media-by-tollywood-heroes-like-chiranjeevi-mahesh-and-ram-charan-and-others-all

మీ ప్రయాణం ఇలాగే సాగాలని.. మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్రీట్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కేటీఆర్ గారికి ఇలా ట్వీట్ చేశారు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆవిష్కరణలు, అభివృద్ధి పట్ల మీకు ఉన్న అభిరుచిని మేము ( KTR birthday wishes by Tollywood ) ఎల్లప్పుడూ కొనియాడతాం.. ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న మీకు ఈరోజు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు చెప్పాడు. ఇక కేటీఆర్ గారికి రవితేజ ఇలా చెప్పడం జరిగింది.. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్.. సానుకూల సమాజాన్ని నిర్మించడం కోసం మీరు చూపుతున్న సాటిలేని నిబద్ధత ఇలాగే ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను.. మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలను కలిగించాలని వేడుకుంటున్నాను అని రవితేజ ట్విట్ చేశాడు.

See also  Bramhaji: మామూలోడు కాదుగా బ్రహ్మాజీ.. ఆ యంగ్ హీరోయిన్ తో అలా చేస్తూ అందరికీ దొరికిపోయాడు గా..

ktr-birthday-wishes-on-social-media-by-tollywood-heroes-like-chiranjeevi-mahesh-and-ram-charan-and-others-all

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కేటీఆర్ ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్ చేయడం జరిగింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని.. హ్యాపీ బర్త్డే బ్రదర్.. ఇలాగే స్ఫూర్తిని నింపుతూ ఉండండి.. రాష్ట్రం మీద మీకు ఉన్న ప్రేమ.. మంచి ( KTR birthday wishes by Tollywood ) సినిమాకు మీరు ఇచ్చే పొగడ్త, ప్రోత్సాహం.. నిజంగా ప్రశంసనీయం అని నాని కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే కోన వెంకట్ కూడా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.. నా ప్రియమైన కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ విశ్వంలో తమ కన్న కలలు సహకారం చేసుకోగలిగిన వారు తక్కువ మంది.. కచ్చితంగా వారిలో మీరు ఒకరు అంటూ కేటీఆర్ కి కోన వెంకట శుభాకాంక్షలు తెలియజేశారు.

See also  Neha Shetty: ఐదు నిమిషాలే గా ఓర్చుకో పనైపోతది అంటూ నేహ శెట్టిని టార్చర్ చేసిన నిర్మాత.

ktr-birthday-wishes-on-social-media-by-tollywood-heroes-like-chiranjeevi-mahesh-and-ram-charan-and-others-all

అలాగే గోపీచంద్ కేటీఆర్ ని డైనమిక్ లీడర్ అంటూ .. హానరబుల్ మినిస్టర్ అంటూ ఆయన్ని పొగుడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన్ని కొనియాడాడు. అలాగే సుధీర్ బాబు కూడా కేటీఆర్ ని పొగుడుతూ సక్సెస్ఫుల్గా ఆయన జీవితం నడవాలని వేడుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ రకంగా కేటీఆర్ గారికి మన టాలీవుడ్ నుంచి ఎందరో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మనందరం కూడా కేటీఆర్ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలా ప్రజలకు మంచి చేస్తూ బాగుండాలని కోరుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం..