Home Health చలికాలం లో ఏ ఆహరాన్ని తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగతుంది.?

చలికాలం లో ఏ ఆహరాన్ని తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగతుంది.?

చలికాలం లో ఏ ఆహరాన్ని తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగతుంది.?

  • స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో తినడానికి అంతే రుచిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలో ఉండే పోషకాలు మన శరీరానికి రోగనిరోధక శక్తిని చేకూర్చడమే కాకుండా మన శరీరంలో ఏర్పడే క్యాన్సర్, ఉయాబెటిస్, స్ర్టోక్, గుండె జబ్బులవంటి అనేక సమస్యలనుండి మమల్ని దూరంగా ఉంచుతాయి. ఒక కప్పు స్ర్టాబెర్రిలో తొంబై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఎంతో అందగా, ఆరోగ్యవంతగా ఉంచుతుంది. దీనిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్ లు అధికంగా ఉన్నాయి పోషకాలన్నీ మన శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని చేకూర్చి పెడతాయి.

  • టమాటో :

టమాటో లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి లు రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా వ్యాధుల నుంచి రక్షషణ కల్పించడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఒక మోస్తరు పరిమాణంలో ఉన్న టమాటో శరీరానికి కావలసిన రిఫరెన్స్ డైలీ ఇన్ టేక్ (RDI) లో 28% అందుస్తుంది. టమాటాలో పొటాషియం, విటమిన్ సి,ఎ లు అధికంగా ఉన్నాయి. చలికాలంలో తరచుగా మన డైట్ లో, ఇంటి ఆహర వంటకాలల్లో చేర్చుకుంటే మన రోగనిరోధక వ్యవస్థ స్ర్టాంగ్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • ఆరంజ్ :
See also  తినే టైమ్ లో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా.? తెలుసుకోండి ఈ విషయాలు మీ కోసమే...

ఆరెంజ్ లో అత్యదికంగా ఉండే విటమిన్ సి కలిగి ఉందని చెప్పాలి. దాని వలన మనకు, మన చర్మానికి చలికాలంలో రక్షణ కవచంలా ఈ విటమిన్ సఅ ఉపయోగపడుతుంది. 100 గ్రాముల నారింజలో 53.2 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమయ్యి మన శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తుంది. ఇది కణాలను దెబ్బతీయకుండా కాపాడుతుంది, కొల్లెజాను పెంచుతుంది. చర్మం యొక్క ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ చలికాలంలో మీరు రోజూ తింటే ఈ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • బ్రోకలీ:

100 గ్రాముల బ్రోకలిలో 89.2 మిల్లీ గ్రాముల విటవిమిన్ సి ఉందని నిపుణులు వెల్లడించారు. అలాగే ఉడికించిన బ్రోకలీలో మన శరీరానికి రోజువారి కావలసిన విటమిన్ సి 57 % మన శరీరానికి అందుతుందట. బ్రోకలీలో ఫైబర్, ప్రోటీన్, పొటాషియం వంటి పోషకాలు మెండుగా పుష్కలంగా ఉంటాయి. ఈ కాలంలో మన ఆరోగ్య రక్షణలో సహయం చేయడానికి బ్రోకలి సిద్దంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా.

  • క్యాప్సికమ్ :
See also  సొరక్కాయ తినడం వల్ల కలిగే ఉపయోగాలు.

 రోజువారిగా మనం మన ఆహరంలో భాగంగా క్యాప్సికమ్ ను చేర్చుకోవచ్చు. ఇందులో అధికమైన విటమిన్ సి గుణాలు కలిగిఉన్నాయి. ఒక మీడియం సైజు క్యాప్సికమ్ లో మనకు ఒక రోజుకు సరిపడే 169% విటమిన్ సి మన శరీరానికి అందిస్తుంది. క్యాప్సికంలో యాంటిఆక్సిడేట్లు, విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని అవయవాలు, రక్తనాళాలు అలాగే ఎముకలు అరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. మనం రోజు వారి  ఆహరంలో భాగంగా క్యాప్సికం చేసుకున్నట్లైతే మనకు కావలసిన రోగనిరోధక శక్తి మనకు దొరుకుతుంది.

  • కాలే :

ఇతర ఆకు కూరలతో పోల్చితే కాలే లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన సైడు చాలా తక్కువగా దొరికే ఆకు కూర.  100 గ్రాముల కాలే లో 120 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ, కే లు కూడా పుష్ఠిగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..

  • వెల్లుల్లి : 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదట అవునండీ మరి అన్ని ఔషధ గుణాలున్నాయి ఈ వెల్లుల్లిలో, 100 గ్రాముల వెలుల్లిలో 56% మనకు కావలసిన శక్తిని చేకూరుస్తుంది. ఇంకా ఇందులో గల కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి ఓ గొప్ప రోగనిరోధక వనరు. మన వంటకాలలో నిత్వం వాడుతూనే ఉంటాము, ఎప్పటిలాగే కూరలో కరేపాకు తీసేసినట్టు అలా పక్కన పెట్టేయకుండా కళ్ళు మూసుకుని గుటుక్కున మింగేయండి మిగిలింది మన పొట్ట చూసుకుంటుంది.

  • ఉసిరి :
See also  బాదాం పప్పు తో ప్రయోజనాలు ఎన్నో చూద్దామా.?

ఉసిరి కాయ పేరెత్తి తల్చుకుంటే చాలు నోట్లో నీళ్ళూరుతుంటాయి. ఉసిరికాయంలో విటమిన్ సి కుప్పలు తెప్పలుగా ఉంది, వీటిని తింటే విటమిన్ సి మన శరీరానికి పుష్కలంగా అందుతుంది. మన శరీరానికి ఇది చలువ చేస్తుంది. ఉసిరి తినడం వల్ల మన రోగనిరోధక శక్తి అధ్భుతంగా పని చేస్తుంది.

గమనిక : అన్నీ మంచివే  మన శరీరానికి లాభాన్నే చేకురుస్తాయి తప్ప ఏది నష్టాన్ని చేకూర్చదు. ఒకవేళ మీరు మీ రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే వైద్యులను తప్పక సంప్రదించగలరు. ఎంత మోతాదులో, ఏ ఏ సమయాల్లో తీసుకోవాలో వాళ్ళకు తెలుసు ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు, మనకేం జరిగినా కాపాడేది వాళ్ళు