Home Cinema Gopi Chand: ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడన్న సీక్రెట్ బయటపెట్టిన గోపీచంద్..

Gopi Chand: ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడన్న సీక్రెట్ బయటపెట్టిన గోపీచంద్..

Hero Gopi Chand: మనందరికీ తెలిసిన విషయమే.. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫ్రెండ్స్ గా మొదటి నుండే గోపీచంద్ ప్రభాస్ వీరిద్దరు గుర్తింపు పొందారు. ఇక గోపీచంద్ విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు తొలివలపు అనే సినిమాతో హీరోగా పరిచయమైనప్పటికీ.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోగా గోపీచంద్ ని ఎంతగానో నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత జయం చిత్రంలో ఈయనకు విలన్ గా అవకాశం వచ్చింది. దానితో విలనిజానికి మంచి క్రేజ్ ఏర్పడింది.

hero-gopi-chand-reveals-real-behaviour-of-prabhas-after-he-drinks-alcohol

ఆ తర్వాత కూడా వర్షం చిత్రంలో ప్రభాస్ కి విలన్ గా నటించాడు గోపిచంద్. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. కానీ అందరూ అనుకున్నారు విలన్ గా రాణిస్తాడు గోపీచంద్ అని కానీ అదే సమయానికి యజ్ఞం సినిమాలో హీరోగా చేసి మళ్ళీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత విలన్ గా ఇప్పటి వరకు చెయ్యలేదు ఏ చిత్రంలో కూడా.. ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసుకోకుండా గోపీచంద్ హిట్స్,ఫ్లాప్స్ అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతమైతే గోపీచంద్ హీరోగా డింపుల్ హాయతి హీరోయిన్ గా వస్తున్న తన తదుపరి చిత్రం రామబాణం ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నాడు.

See also  Writer Padamabhushan: మరో ఇంట్రస్టింగ్ కథతో రాబోతున్న సుహాస్ - రైటర్ పద్మభూషణ్

hero-gopi-chand-reveals-real-behaviour-of-prabhas-after-he-drinks-alcohol

ఇక ఈ చిత్రం మే ఐదవ తారీఖున విడుదల అవ్వనుండడంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ తెగ సందడి చేస్తున్నాడు గోపీచంద్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈయన పాల్గొన్నారు. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించాడు. అదేంటంటే.. ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడని సీక్రెట్ ని బయటపెట్టాడు గోపీచంద్. ఓ యాంకర్ గోపి చంద్ ను మీరు ప్రభాస్ ఇద్దరు మంచి స్నేహితులు కదా మరి మీరు సిట్టింగ్ చేస్తే ఎలా ప్రవర్తిస్తారని అడిగాడు.. దానికి గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ నేను మంచి స్నేహితులం..

See also  RashmikasVijay: రష్మిక మనసులో విజయ్ ఎప్పటికీ.. అందుకే మర్చిపోలేకపోతున్న అంటూ భహిరంగంగా నువ్వే బెస్ట్ అంటూ కామెంట్స్..

hero-gopi-chand-reveals-real-behaviour-of-prabhas-after-he-drinks-alcohol

జనరల్ గా అందరి దోస్తులు ఎలా సిట్టింగ్ చేస్తే ఉంటుందో మీ ఇద్దరం కూడా అంతే తాగుతాం కానీ మందు తాగాక ప్రభాస్ చాలా జోక్స్ చెబుతూ నవ్విస్తూ ఉంటాడు. మేము హీరోలలగా కాకుండా చాలా సింపుల్ గా, సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తామంటూ గోపీచంద్ (Hero Gopi Chand) ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గోపీచంద్ మాట్లాడిన మాటలు నెట్టింటా వైరల్ అవ్వడంతో ప్రభాస్ మందు తాగిన తర్వాత ఇలా ప్రవర్తిస్తాడా అని తెలిసిన వాళ్లు సోషల్ మీడియాలో ఓ తెగ కామెంట్లు పోస్ట్ చేస్తా ఉన్నారు.