
సినిమా : కస్టడీ ( Custody ) (Custody audience review and Rating )
నటీనటులు : నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్..
రచన : వెంకట్ ప్రభు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా
కెమెరా: ఎస్. ఆర్. కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
నిర్మాత: శ్రీనివాస చిత్తూరి
దర్శకత్వం: వెంకట్ ప్రభు
విడుదల: 12 మే 2023 ( Custody movie release date )
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ దర్శకుడైన వెంకట ప్రభు తెలుగులో తీసిన మొదటి సినిమా ఇది. సినిమాని తెలుగు మరియు తమిళంలో రెండు భాషల్లో చిత్రీకరించారు. థాంక్యూ సినిమా తర్వాత నాగచైతన్య నటించిన సినిమా ఇది. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున కొడుకుగా సినిమా బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉన్నా.. నాగచైతన్య ఎప్పటికప్పుడు తన ట్యాలెంట్ ని తనకు తానుగా నిరూపించుకోవడం కోసం కష్టపడుతూనే వస్తున్నాడు. ఆ క్రమంలో ఈ సినిమాపై నాగచైతన్య అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ సినిమాపై కొంత ఆసక్తిని పెంచింది. మరి అక్కినేని అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్దాం.
కథ. ( Custody movie story )
ఒక స్కూల్ బస్సు తో సినిమా మొదలవుతుంది. పిల్లలు ఫుల్ గా ఉన్న ఆ స్కూల్ బస్సు వెళ్తున్న రోడ్ లో.. ఒక చిన్న పాపని ప్రమాదం నుంచి రక్షించే క్రమంలో అక్కడ పెద్ద ఫైర్ జరిగి.. 40 మంది ప్రాణాలు పోతాయి. ఆ పాయింట్ తో సినిమా మొదలు పెట్టి.. కట్ చేస్తే.. రెండేళ్ల తరవాత కానిస్టేబుల్ శివ ( నాగ చైతన్య) సీఎం కారుని ఆపే సీన్ తో ఎంటర్ అవుతాడు. శివ సిన్సియర్ కానిస్టేబుల్. సీఎం గా దాక్షాయణి ( ప్రియమణి) ఎంటర్ అవుతుంది. సీఎం ప్రసంశలు అందుకున్న శివ అందరిలో బాగా ఫేమస్ అవుతాడు. ఇదిలా ఉంటె శివ చిన్నప్పటి నుంచి రేవతి ( కృతి శెట్టి ) ని ప్రేమిస్తాడు. శివ రేవతి ఇద్దరూ ఒకరినొకరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నప్పటికీ.. రేవతి ఇంట్లో శివ కి రేవతిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. శివ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు కానీ రేవతి ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడమే కాకుండా.. రేవతి కి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయిస్తారు. మరుసటి రోజు రేవతి పెళ్లి అనగా.. ముందురోజు రాత్రి రేవతిని తీసుకుపోవడానికి వెళ్తున్న శివకి రాజు ( అరవింద్ స్వామి ) ఎదురవుతాడు. అక్కడితో శివ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. శివని పోలీసులు తరిమే పరిస్థితి వస్తుంది. అసలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఉన్న శివని పోలీసులు తరిమే పరిస్థితి ఎందుకు వస్తుంది? రాజు కనిపించిన తరవాత అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజుకి, శివకి ఉన్న లింక్ ఏమిటి? శివ రేవతి ల ప్రేమ, పెళ్లి ఏమయ్యింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే.. ( Custody movie audience review and Rating compared with Samantha Shakunthalam )
సినిమా మొదలు కొంచెం ఇంట్రెస్ట్ గానే మొదలు పెట్టాడు దర్శకుడు. ఆ తరవాత నాగచైతన్య ఎంటర్ అయిన సీన్ ట్రైలర్ లో చూపించడం వలన.. అంటే సీఎం కార్ ని ఆపేస్తావా అనే డైలాగ్స్ ట్రైలర్ లో ఆల్రెడీ చూడటం వలన ఆ సీన్ అంత ఆశక్తి కరంగా అనిపించలేదు. నాగ చైతన్య మాత్రం కానిస్టేబుల్ గా చక్కగా ఫిట్ అయ్యాడు. నాగచైతన్య తన పాత్రలో హీరోయిజం కంటే కూడా చాల న్యాచురల్ గా కనిపించే లుక్ ఎక్కువగా చూపించాడు దర్శకుడు. కృతి శెట్టి తనకు ఇచ్చిన పాత్రలో తాను పర్ఫెక్ట్ గా నటించింది. అయితే చైతు, కృతిశెట్టి ల మధ్య (Custody audience review and Rating ) మంచి ఫ్రెండ్స్ కనిపించారు గాని, వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ లో మాత్రం మంచి కెమిస్ట్రీ కనిపించలేదు. సినిమాలో మొదటి హాఫ్ చాలా స్లో గా నడిపినప్పటికీ.. ఇంటర్వెల్ ముంది 20 నిముషాలు మాత్రం సినిమా పై ఆశక్తిని పెంచేలా చేసాడు దర్శకుడు.
ఆశక్తి అంటే విలన్ ఎవరు అని మాత్రం కాదు.. ఎందుకంటే విలన్ ని చాలా తొందరగా రివీల్ చేసేసాడు దర్శకుడు. సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోవడంతో.. ఎందుకు సినిమా నడుస్తుందో కూడా ప్రేక్షకుడు ఊహించేసాడు. కాకపోతే.. నెక్స్ట్ సీన్ ఏమి రావచ్చు అనేదానిపైన ఆశక్తి ని క్రియేట్ చేసాడు దర్శకుడు వెంకట్ ప్రభు. సాధారణంగా ఇంటర్వెల్ (Custody audience review and Rating ) బ్యాంగ్ మీద అందరికీ ఆశక్తి ఉంటాది. కొంచెం సినిమా నాలెడ్జి ఉన్నవాళ్లు సినిమా ఇంటర్వెల్ ని కనిపెట్టేస్తారు. కానీ ఈ సినిమాలో ఇదిగో ఇంటర్వెల్ అదిగో ఇంటర్వెల్ అనుకుంటారు గాని రాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ని సాగదీసి సాగదీసి.. మొత్తానికి ఇస్తాడు. ఇక ఇంటర్వెల్ తరవాత సినిమాని ఎంతో గొప్పగా ఊహించుకునే ప్రేక్షకుడి ఆశ మాత్రం నిరాశే అయ్యిందని చెప్పచ్చు.
సినిమాలో హీరో తరవాత అతి ముఖ్యమైన పాత్ర రాజు ( అరవింద్ స్వామి) ది అని, సినిమా చూడని వారికి కూడా తెలుసు. రాజు చుట్టూనే సినిమా స్టోరీ మొత్తం నడిపాడు దర్శకుడు. అలాంటి రాజు పాత్రలో అరవింద్ స్వామి తనకు ఇచ్చిన క్యారెక్టర్ కి తాను ఎప్పటిలానే బాగానే న్యాయం చేసాడు గాని.. దర్శకుడు (Custody audience review and Rating ) అరవింద్ స్వామి పాత్రని మాత్రం బాగా చూపించడంలో చాలా ఫెయిల్ అయ్యాడు. పాపం సినిమాలో నాగ చైతన్య ఎంత బాగా నటించినప్పటికీ.. తన హీరోయిజం బాగా కనిపించాలంటే.. విలన్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. అప్పుడే హీరో హైలెట్ అవుతాడు. అలాంటిది ఈ సినిమాలో విలన్ అనే పాత్ర ఎక్కడా కూడా పవర్ఫుల్ గా కనిపించలేదు.
కొన్ని పాత్రలకి ఎంత పెద్ద స్టార్స్ ని తీసుకున్నామని కాదు.. ఆ పాత్రని ఎంత హైలెట్ గా చూపించాం అనేదే ముఖ్యం. ఆ విషయాన్ని తమిళ్ సినిమాలలో మంచి అనుభవం ఉన్న వెంకట్ ప్రభు మరచిపోవడం.. ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. యాక్షన్ త్రిల్లర్ సినిమాలో హీరోయిన్ పాత్రని అక్కడక్కడా అతికించినట్టు కాకుండా.. కథతో పాటు ఆమెను కూడా అలా జర్నీ చేయించడం కొంచెం బాగానే ఉంది. లేదంటే సినిమా ఇంకా బోర్ ఫీల్ అవ్వాల్సి వచ్చును. ఇక సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్ కావాలని అతికించినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ ని మైండ్ లో పెట్టుకుని కథని ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది కానీ, ఆ సీన్స్ సినిమా కథకి సరైన మూలం అని అనిపించేలా సినిమాని తీర్చి దిద్దడంలో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు.
ఈ సినిమాలో హీరో దేని కోసం పోరాడుతున్నాడు అనే దాని కోసం ఆలోచిస్తే.. ఎదో ఒక దానిమీదనే గట్టిగా నిలబడి ఉంటె బాగుణ్ణు అనిపిస్తుంది. నిజం కోసం పోరాడుతున్నాడా? తన పర్సనల్ రివెంజ్ కోసం పోరాడుతున్నాడా? లేక ఒక వ్యక్తిలో మార్పు తేవడం కోసం పోరాడుతున్నాడా అనిపించేలా అన్ని మిక్స్ చెయ్యడం అంత బాలేదేమో అనిపిస్తుంది. సినిమాలో పాటలు విషయానికి వస్తే.. చాలా నిరాశని ఇచ్చాయి. శరత్ కుమార్ నటన బాగానే ఉంది కానీ, డబ్బింగ్ కుదిరినట్టు అనిపించలేదు. అలాగే ఆ పాత్రలో శరత్ కుమార్ బదులుగా ఎవరినైనా యంగ్ మరియు పవర్ఫుల్ పర్సన్ ని పెట్టి ఉంటె.. చైతు పాత్ర ఇంకా హైలెట్ అవ్వును. అలాగే సినిమాలో రాంకీ పాత్రను చాలా బలవంతంగా ఇమిడ్చినట్టు అనిపించింది.
కొన్ని పత్రాలు కొంతమంది ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం కథలో వారిని దూర్చినట్టు అనిపించింది. అలాం టి ఆలోచన వలనే నాగ చైతన్య ఎంత కష్టపడి పవర్ ఫుల్ గా నటించినప్పటికీ సినిమాలో హీరోయిజం డల్ గా ఉన్నట్టు అనిపించింది. తమిళ్ దర్శకుడు అవ్వడం వలన తమిళ్ వాసన మాత్రం సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించేసింది. దాని వలన తెలుగు ఆడియన్స్ ని పూర్తిగా సంతృప్తి పరచడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. అనుభవం ఉన్న దర్శకుడు ఎన్నుకున్న కథ లా అనిపించలేదు. సినిమా కథ ఎంత వీక్ గా ఉన్నా, ప్రేక్షకులు ఆ మాత్రం చూడగలిగారు అంటే అది దర్శకుడి అనుభవమే అని మాత్రం అనిపించింది. సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ చాలా రొటీన్ గా ఉండటమే కాకుండా.. రొటీన్ గా కూడా కామిడి కుదిరినట్టు అనిపించలేదు.
సెకండ్ హాఫ్ మొత్తం ఒక వ్యక్తిని కోర్ట్ లో హాజరు పరిచే క్రమంలో.. ఏవేవో దూర్చి సాగదీసినట్టు అనిపించింది. అయితే సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు పోలీస్ స్టేషన్ లో ఫైట్ మొదలు.. నీటిలో ఫైట్ మొత్తం అలా ఇంటర్వెల్ వరకు చాలా బాగా చూపించాడు దర్శకుడు. అలాగే చైతు తండ్రి దొరికిపోయిన, మరణించిన సీన్ కొంతవరకు బాగానే ఆకట్టుకుంది. అరవింద్ స్వామి పాత్రని ముగించే తీరు మాత్రం తేలిపోయినట్టు అనిపించింది. సినిమా మొత్తానికి నాగచైతన్య అభిమానులు మాత్రం చాలా ఆనందించాల్సిన సంగతి ఏమిటంటే.. ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ అయినా అది చాలావరకు క్రెడిట్ మొత్తం నాగచైతన్యకి వెళ్తాది.
చైతు 90% తన పాత్రకి న్యాయం చేసే విధంగా కష్టపడ్డాడు. చైతు అంటే సమంత గురించి, సమంత అంటే చైతు గురించి మాట్లాడుకునే ప్రేక్షకులు మాత్రం.. ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమా పోవడానికి సమంత 90% కారణం అయితే.. కస్టడీ సినిమా (Custody audience review and Rating ) నిలబడటానికి చైతు 90% కారణం అంటూ రేటింగ్ ఇస్తున్నారు. కస్టడీ సినిమాలో లోపం ఏదైనా ఉంది అంటే అది కథ, పాటలు, స్క్రీన్ ప్లే, పాత్రలను చూపించడంలో దర్శకుడి లోపం, అలాగే బలమైన విలనిజాన్ని చూపించలేకపోవడం లాంటి కారణాలు ఉన్నాయి తప్పా.. చైతు మాత్రం చాలా బాగా చేసాడనిపించుకున్నాడు. మొత్తం మీద సినిమా అట్టర్ ఫ్లాప్ కాకూండా.. యావరేజ్ అనిపించుకుంది.
రేటింగ్: 2/5
ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.