Home Health నల్ల ఎండు ద్రాక్షలో ఎన్ని లాభాలో…

నల్ల ఎండు ద్రాక్షలో ఎన్ని లాభాలో…

నల్ల ఎండు ద్రాక్షలో ఎన్నో ఆరోగ్య ప్రయోజమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం.

నల్ల ఎండుద్రాక్షలో సహజసిద్దమైన యాంటీ యాక్సైడ్ లుంటాయి. ఇవి మన శరీరంలోని కాలేయం, మూత్ర పిండాల పనిచేసే తీరు బాగుపరుస్తుంది. మన శరీరానికి హనికలిగించే ఎన్నో ఫ్రీరాడికల్స్ ను వదిలిస్తుంది దాని వలన చర్మం ముడతలు పడకుండా చర్మం తేజస్థులో ఉండేవిధంగా చేస్తుంది. మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా ఉన్నంతకాలం వెంట్రుకలు రాలకుండా చేస్తుంది, దానికోసం సరిపడా ఐరన్ నల్ల ఎండుద్రాక్షలో మెండుగా ఉంది.

విటమిన్ C మెండుగా ఉండడం వలన జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. నల్ల ఎండుద్రాక్ష తినడం ద్వారా జుట్టు తన సహజ రంగును కోల్పోకుండా యవ్వనంగా తన రంగు తనకు ఉంటుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ర్టాల్ నుండి నల్ల ద్రాక్షలో గల సాల్యుబుల్, ఫైబర్ ఈ చెడు కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పోటీ పడుతుంది. రక్తప్రవాహం ద్వారా చెడు కొలెస్ర్టాల్ కాలేయానికి తరలించి, శరీరంలోనుండి బయటకు పంపేలా ఇందులోని ఫైబర్ ఉపయోగపడుతుంది.

See also  ఫ్రిజ్ లో ఆహర పదార్ధాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలో తెలుసుకుందామా.?

నల్ల ఎండుద్రాక్షలో ఉన్న ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ లో ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి. మలబద్దక సమస్య కూడా పూర్తిగా తగ్గి కడుపు మొత్తం శుభ్రం అవుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం వలన ఎముకల సాంద్రత పెరిగి చాలా దృఢంగా ఉంటాయి. పోషకాలు లేకపోవడం వల్ల ఈ రోజుల్లో రక్తహీనత వస్తుంది అలాంటి రక్తహీనత నల్ల ఎండు ద్రాక్ష  ద్వారా అధిగమించబడుతుంది. అధిక బీపీ రోగులకు నల్ల ఎండు ద్రాక్ష ఒక వరమనే చెప్పాలి, ఇందులో ఉండే పొటాషియం ఫైబర్ అధిక బీపీని నియంత్రిస్తాయని నమ్ముతారు. మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మన రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వలన గుండెపోటుకు దారితీస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఉన్న పాలిఫైనాల్, ఫైబర్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

See also  కొందరు పండ్ల పై ఉప్పు చల్లుకొని తింటారు అలా తినడం వలన ఏమైతదో తెలుసా.?

రాత్రిపూట పడుకునే ముందు 9 లేదా 10 నల్ల ఎండు ద్రాక్షలు తీసుకొని ఒక గ్లాసు మంచినీటిలో నానబెట్టి పడుకోవాలి. ఉదయాన్నే లేవగానే పరిగడుపున ఆ నీటిని తాగాలి, నీటిని తాగిన తర్వాత నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షలను తినాలి. ఇవి తిన్నారా గంట వరకు ఏమి తినకుండా ఉండడం మంచిది, మన శరీరానికి ఉపయోగకరం కూడా. ఇలానే కాకుండా మీకు నచ్చినప్పుడల్లా రోజులు ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు లేదా ఏదైనా వంటలో వేసుకుని కూడా తినవచ్చు.

See also  నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?