సినిమా: బిచ్చగాడు 2 ( Bichagadu 2 Movie Review )
నటీనటులు : విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్
సంగీతం: మిక్కీ జె. మేయర్
కెమెరా: ఓం నారాయణ్
ఎడిటర్: విజయ్ ఆంటోనీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
దర్శకత్వం: విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ హీరోగా ఆయన దర్శకత్వంలోనే.. కావ్య థాపర్ హీరోయిన్ గా ఈరోజు బిచ్చగాడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2016 లో బిచ్చగాడు సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత విజయ్ ఆంటోని చేసిన సినిమాలు తెలుగులో వచ్చినా కూడా పెద్దగా ఆదరణ పొందలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ బిచ్చగాడు 2 అంటూ అదే టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరి బిచ్చగాడు 2 తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..
కథ.
మనీ ఈజ్ ఇంజురియస్ టూ హెల్త్ అని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. విజయ్ గురుమూర్తి ( విజయ్ ఆంటోనీ ) దేశంలోనే 7 వ స్థానంలో ఉన్న పెద్ద బిజినెస్ మాన్ కథతో సినిమా మొదలు అవుతాది. ఇతనికి ఒక లవర్ హేమ ( కావ్య థాపర్ ) ఉంటుంది. , ఇతనికి సిఈఓ గా అరవింద్ ( దేవ్ గిల్ ) ఫామిలీ డాక్టర్ శివ, ఆడిటర్ చైతన్య ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి, విజయ్ కి బ్రెయిన్ మార్పిడి చేసే ఆపరేషన్ చేయిస్తారు. దానికి బిచ్చగాడు సత్య ( విజయ్ ఆంటోనీ ) ది వాడతారు. ఈ విషయం అరవింద్, శివ, చైతన్యలకు తప్పితే ఎవ్వరికీ తెలియదు. విజయ్ ఆస్తికోసం వాళ్ళు ఈ పని చేస్తారు. విజయ్ ప్లేస్ లో సత్య అనే బిచ్చగాడు బ్రెయిన్ వస్తుంది. అక్కడ నుంచి సినిమా కథ మలుపు తీసుకుంటుంది. సత్య ఒక ( Bichagadu 2 Movie Review ) బిచ్చగాడు, ఇంకా తన చెల్లిని చిన్నప్పుడు మిస్ అవుతాడు. ఆమెకోసం వెతికే పనిలో ఉండగా.. ఇలా జరుగుతుంది. మరి విజయ్ ప్లేస్ లోకి సత్య వచ్చాడని ఎవరికైనా తెలుస్తాదా? తెలిస్తే ఎవరి ద్వారా తెలుస్తాది? బ్రెయిన్ మార్చిన ఆ ముగ్గురు ఏం చేయగలుగుతారు? విజయ్ లవర్ కి విజయ్ గురించి తెలుస్తాదా? ఆమె ఎం చేస్తుంది? సత్యాకి తన చెల్లి దొరుకుతుందా? విజయ్ గా సత్య ఎం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే..
ఈ సినిమాకి వెళ్లే ప్రతీ ప్రేక్షకుడు బిచ్చగాడు సినిమాని ఊహించుకుని వెళ్తాడు. ప్రేక్షకుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా ఆ సినిమా కంటే ఇంకా బాగా తియ్యాలని ఆలోచనలోనే ఉంటాడు. సినిమా మొదలు మనీ ఈజ్ ఇంజురియస్ టూ హెల్త్ అనే సెంటెన్స్ ప్రేక్షకుడికి ఆశక్తిని కలిగించింది. బ్రెయిన్ మార్పు మీద సినిమా కథ మొదలవుతుంది. దాని గురించి ఇంటర్వ్యూ లో గాంధీ గారు లాంటి వారి బ్రెయిన్ ని ఇంకా బ్రతికించి ఉంటె ఎంత ఉపయోగం అని డాక్టర్ చెబితే.. మరి హిట్లర్ లాంటి బ్రెయిన్ ని ఇదే పద్దతిలో బ్రతికిస్తే.. ఎంత ప్రమాదం అని యాంకర్ అడగడం బాగుంది. అయితే ఒక మనిషి ప్లేస్ లోకి ఇంకొక మనిషి ( Bichagadu 2 Movie Review ) అదే పోలికలతో ఉన్నవాడు వెళ్లడం అనే సినిమాలు ఇప్పటికి లెక్క లేనన్ని వచ్చాయి. అందుకని ఈ సినిమాలో మనిషిని మార్చకుండా.. బ్రెయిన్ ని మార్చారు అంతే తప్ప.. అంతకు మించి కొత్తదనం లేదు. విజయ్ పక్కనే ఉన్న వ్యక్తి.. అరవింద్ తన తండ్రికి ఎదో వీళ్ళ ఫామిలీ అన్యాయం చేసిందని కక్షతో.. విజయ్ జీవితం మీద కక్ష కడతాడు అని దర్శకుడు చూపించాడు గాని, అసలు ఆ రీజన్ ఏమిటో సినిమాలో వివరం ఇవ్వడానికి టైం సరిపోలేదో లేక లైట్ తీసుకున్నాడో అర్ధం కాలేదు.
సాధారణముగా హీరోని మరో క్యారక్టర్ తో మార్చేసిన విలన్స్ కి మెయిన్ హీరో ఎలా బుద్ది చెబుతాడు అనేదానిమీదనే ఇలాంటి కథలు నడుస్తాయి. కానీ ఈ సినిమాలో ఆకోణంలోనే మొత్తం సినిమాని వెళ్లనివ్వకుండా.. దాన్ని తొందరగా తేల్చి పడేసి.. ఇంకొక కాన్సెప్ట్ లోకి వెళ్లిపోవడం కొంచెం బెటర్ అనిపించింది. లేదంటే.. వాళ్ళతోనే వేలాడుతూ.. సినిమా తీస్తే.. అదే రొటీన్ కథతో చూడలేక చావాలి. మొదటి పాటలో ( Bichagadu 2 Movie Review ) హీరోయిన్ కొంత ఎక్సపోజింగ్ కోసమే ఉందని అనిపించినా.. తరవాత సినిమా మొత్తం ఆమె పాత్ర మరియు నటన రెండూ బాగానే ఉన్నాయని అనిపించుకుంది. ఈ సినిమాలో విజయ్ అనే పేరుకి విలువ ఎక్కువ ఉంది కానీ, కథ మొత్తం సత్య మీదనే నడుస్తాది కాబట్టి.. సినిమా టైటిల్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా కథ రాసుకున్నట్టు అనిపించింది. సత్య జీవితంలో చెల్లెలితో చిన్నప్పుడు చూపించిన సెంటిమెంట్ స్టోరీ బాగుంది కానీ, కొంచెం సాగినట్టు.. బోర్ అనిపించే ఛాన్స్ కూడా ఉంది. కానీ మొత్తం సినిమాని ఈ సెంటిమెంట్ నడిపించింది.
సత్య తన చెల్లెలి కథ చాలా సినిమాల్లో ఉండే సెంటిమెంట్ కథనే అయినా.. లాస్ట్ లో వాళ్ళ సెంటిమెంట్ ని చూపించిన విధానం, ఆ సమయంలో విజయ్ ఆంటోని చేసిన నటన సినిమా మొత్తానికి అతను కష్టపడి నటించిన సీన్ అదే అనిపిస్తాది. మిగిలిన సినిమా మొత్తం చాలా ఈజీగా అలా నటించుకుంటూ వెళ్ళిపోయాడు కానీ, ఆ సీన్ లో మాత్రం పర్ఫెక్ట్ గా నటించి, ఆడియన్స్ మన్ననలు అందుకున్నాడు. ఇక సినిమాలో ( Bichagadu 2 Movie Review ) మిగిలిన పాత్రలు అన్ని ఎవరికి తగ్గట్టు వాళ్ళు బాగానే నటించారు. సినిమా మొత్తాన్ని విజయ్ ఆంటోని మరియు కథ మాత్రమే నడిపించాయి. ఇంటర్వెల్ వరకు సినిమా కథ అర్దమైపోతున్నట్టు.. కొంచెం సాగుతున్నట్టు అనిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ తో నెక్స్ట్ ఎలా నడిపిస్తాడు అని చిన్న కుతూహలం కలుగుతుంది.
బిచ్చగాడు పార్ట్ వన్ లో బిచ్చగాళ్ల కష్టాలు ఎంతబాగా సెంటిమెంటల్ గా చూపించారో.. ఇందులో బిచ్చగాళ్ళు ఈ రోజుల్లో ఎంత బాగా బతుకుతున్నారో.. స్విగ్గి, జమాటా యాప్ లు వచ్చాక ఇంట్లో ఆడవాళ్లు వంట చేయడం లేదని, ఆన్లైన్ పేమెంట్ తో స్కాన్ చేసి.. బిచ్చగాడికి డబ్బు దానం చెయ్యమన్న కొన్ని సీన్స్ బాగున్నాయనిపించాయి. కానీ ఎలాగైనా కామెడీ అయితే మాత్రం పెద్దగా అనిపించలేదు. కామెడీ సరిగ్గా లేకపోవడం వలన కూడా సినిమా కొంత నీరసంగా అనిపించినట్టు అనిపించింది. ఇక ఇంటర్వెల్ తరవాత ఒక డబ్బున్నవాడు ఎం చెయ్యచ్చు అనే దానిపై సినిమా వెళ్తుంటే.. అదే మన తెలుగు హీరో ఎవరైనా ఉంటె బాగుంటుంది.. హీరోయిజం బాగా చూపిస్తారు అనిపిస్తుంది. విజయ్ ఆంటోని మాత్రం ఎక్కడ అతిగా నటించడానికి ట్రై కూడా చెయ్యలేదు. చాలా సహజంగానే నటించాడు.
యాంటీ బికిలీ అనే కాన్సెప్ట్ మీద హీరో స్పీచ్ బాగానే ఉంది. కాకపోతే.. సినిమా కథలో పాయింట్స్, ప్రజలకు చెప్పే మంచి కాన్సెప్ట్ చాల బాగుంది కానీ.. దాన్ని సినిమాటిక్ గా కొంచెం హుషారుగా చూపించలేపోయాడనిపిస్తుంది. బిచ్చగాడు మొదటి పార్ట్ లో.. ఆ కథకి అలా నిమ్మదితనంగానే ఉండాలి కాబట్టి.. అది అలా వర్క్ అవుట్ అయ్యింది కానీ, ఈ సినిమాలో సెంటిమెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటం వలన.. కొంచెం స్పీడ్ ఉండి ఉంటె బాగుండును. లాస్ట్ కోర్ట్ సీన్ బాగానే ఉంది కానీ, ఇంకా కొంచెం బాగా తీసి ఉండచ్చు అని అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ సీన్ అయితే అందరి కంట సెంటిమెంట్ తో కూడిన కన్నీళ్లు రప్పించాడు విజయ్ ఆంటోని. బాగా తెలిసిన స్టోరీలా అనిపించినా.. నెక్స్ట్ ఇదే జరుగుతాది అని పెద్దగా ఎవ్వరూ ఊహించేలేనట్టుగా.. కథని టర్న్ తిప్పుకుంటూ బాగానే వచ్చాడు. పాటలు యావరేజ్ పెద్దగా లేవు. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ బాగుంది. దాని వలన హీరో తన హీరోయిజం చూపించుకోవడానికి పెద్ద కష్టం లేకుండా.. అదే హైలెట్ చేసేసింది.
సినిమా కథ రాసుకున్న పాయింట్ మాత్రం చాలా బాగుందని అనిపించింది. ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలి? అలా మూడు తరాలు బ్రతకడానికి ఎంత కావాలి? కానీ లక్షల ఏళ్ళు బ్రతకడానికి అంత డబ్బుని ఎందుకు ఒక్కొక్కరు ఎందుకు దాచేసుకుంటున్నారు? ఒక డబ్బున్న వాడు ఎలా ఆలోచించాలి. అలాగే ఒక మనిషికి డబ్బు ఎంత వచ్చినా ఒక సామాన్యుడిగా తన బాధ్యతలకు, సెంటిమెంట్స్, మనుషులకు ఎలాంటి విలువ ఇవ్వాలి అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఒక డబ్బున్న వ్యక్తి తల్లి సెంటిమెంట్ తో బిచ్చగాళ్ల జీవితంలోకి వచ్చి వాళ్ళ కష్టాలను, అవసరాలను ఎలా అర్ధం చేసుకుంటాడో బిచ్చగాడు కథ అయితే.. ఒక బిచ్చగాడు అనుకోకుండా డబ్బున్న వాడి ప్లేస్ లోకి వెళ్లాల్సి వచ్చి.. అక్కడ ఉండబుద్ది కాకపోయినా.. చెల్లి సెంటిమెంట్ తో.. అంటే.. 48 రోజులు బిచ్చగాడిగా బ్రతికితే తల్లి బ్రతుకుతాదని ఆ బిచ్చగాడు సినిమా అయితే.. ఒక డబ్బున్నవాడిగా ఎదుటివారికి కావాల్సిన మంచి చేస్తే.. తనకి కావాల్సిన మంచి జరుగుతాదని నమ్మకంతో నడిచే కథ ఇది. ఈ రెండు సినిమాలకి ఉన్న తేడా అదే..
ఏది ఏమైనా సినిమాలో కొన్ని పాయింట్స్ చెప్పినవి మాత్రం విలువైనవే అని ఒప్పుకోవాలి. ప్రతీ సినిమాకి ఒక నీతి అనేది ఉండాలి. ఈ సినిమాలో కేవలం డబ్బుకోసమే తాపత్రయ పడటం కూడా ఒక జబ్బే అని చెప్పాలనే.. స్టార్టింగ్ మనీ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్ అని చూపించాడు గాని.. 100% బాగా చూపించలేకపోయినా.. ఆ ప్రయత్నమైతే గట్టిగానే చేసాడు దరర్శకుడు. డబ్బున్నవాడు ఈ సినిమాని.. డబ్బుని ఎలా వినియోగించాలో తెలుసుకోవడానికి చూడాలి. అలాగే డబ్బు లేని వాడు.. తన జీవితంలోకి డబ్బు వచ్చినా కూడా ( Bichagadu 2 Movie Review ) దాని మీద ఆశ, ఇష్టం ఎక్కువగా పెంచుకోకుండా.. బంధాలను, బాధ్యతలను, ప్రతీ మనిషిని ఎలా గౌరవించాలో తెలుసుకోవడానికి చూడాలి. ముఖ్యంగా యాంటీ బికిలి అంటే ఎవరు అనేది బాగా చెప్పాడు.. వాళ్ళు ఈ ప్రపంచంలో మన చుట్టూ చాలామంది ఉంటారు. యాంటీ బికిలీ లుగా అవ్వకూడదని.. అలాంటివారిని ఎంటర్టైన్ చెయ్యకూడదని అర్ధం చేసుకుంటే కూడా ప్రపంచంలో ఏమైనా కొంత మార్పు రావచ్చని దర్శకుడు ప్రయతినించాడు. ఏది ఏమైనా సినిమా స్లోగా అనిపించినా.. సినిమా బాగుంది అని మాత్రం అనిపించుకుంది. ఇదే కాన్సెప్ట్ తో మన తెలుగు హీరోని పెట్టి.. కొంచెం బాగా హీరోయిజం చూపించి ఉంటె.. సూపర్ గా ఉండునని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. సినిమా ఒకసారి చూడచ్చు..
రేటింగ్: 2.75/ 5
ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే.. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..