Home Cinema Hidimbha Movie Review : హిడింబా సినిమా రివ్యూ మరియు రేటింగ్.

Hidimbha Movie Review : హిడింబా సినిమా రివ్యూ మరియు రేటింగ్.

hidimbha-movie-review-and-rating

Hidimbha Movie Review : చిత్రం: హిడింబా ( Hidimbha )
తారాగణం: అశ్విన్ బాబు, నందిత శ్వేత, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రఘు కుంచె, శుభలేఖ సుధాకర్, మక్రంద్ దేశ్ పాండే మొదలగువారు
కెమెరా: బి రాజశేఖర్
సంగీతం: వికాస్
నిర్మాత: గంగాపట్నం శ్రీధర్
దర్శకత్వం : అనీల్ కన్నెగంటి
విడుదల తేదీ:20 జులై 2023 ( Hidimbha Movie Review and Rating )

బుల్లితెర యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా, నందిత శ్వేత హీరోయిన్గా, అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ సినిమా పై మొదట ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాయో అవి చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పాటలు గాని, ఫైట్స్ గాని చూపించిన విధానం గాని సినిమాపై భారీ అంచనాల పెంచాయి. పైగా ఈ నెలలో.. లో బడ్జెట్ సినిమాలు కొన్ని హిట్ అవ్వడంతో.. ఇది కూడా హిట్ అవుతుందేమో అని అందరూ ఆశావాదంగా ఉన్నారు. కాబట్టి అందరూ ఆలోచనలను బట్టి ఈ సినిమా వాళ్ళ అంచనాలను రీచ్ అయిందో లేదో సినిమా కథలోకి వెళ్లి చూద్దాం..

hidimbha-movie-review-and-rating

కథ.

సినిమా మొదలు ఒక అడవి చూపిస్తాడు. ఒక ముసలాడు, కుర్రాడు వెల్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకలి దేవుడని.. ఒకడి ఆకలి నింపుకోడానికి ఇంకొకడు బలి అవుతాడని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సినిమా స్టోరీ లోకి వెళ్తుంది. అక్కడినుంచి అసలు కథలోకి వెళ్తే హైదరాబాద్ చూపిస్తారు.. హైదరాబాదులో అమ్మాయిల కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఇంచుమించుగా 16 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతారు. దీంతో ( Hidimbha Movie Review and Rating ) ప్రజలందరూ ప్రభుత్వంపై తిరగబడతారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద నిందలు వేస్తుంది. మీడియా ప్రశ్నిస్తుంది. దీనితో ముఖ్యమంత్రి ( శుభలేఖ సుధాకర్) పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి గట్టిగా చివాట్లు పెట్టి కేసుని సాల్వ్ చేయమని చెప్తారు. దీనితో కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య ( నందిత శ్వేత ) ను హైదరాబాద్ రప్పిస్తారు. అప్పటివరకు ఈ కేసుని ఆరా తీస్తున్న పోలీస్ అధికారి అభయ్ ( అశ్విన్ బాబు ) తో పరిచయం చేసి.. ఈ కేసును అప్పగిస్తారు.

See also  Star Cricketers : హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపిన స్టార్ క్రికెటర్స్..

hidimbha-movie-review-and-rating

వీళ్ళిద్దరూ కలిసి కేసులో క్లూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత.. గతంలో పోలీస్ ట్రైనింగ్ లో వీళ్ళిద్దరూ ప్రేమించుకుని విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. వీళ్ళిద్దరూ కేసు గురించి తిరిగే క్రమంలో.. కాలాబండ అనే ప్రాంతంలో అందరూ వెళ్లడానికి భయపడుతుంటే.. అక్కడ అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు అని తెలుసుకొని అభయ్ వెళ్లి ఫైట్ చేసి.. అక్కడ ఉన్న వాళ్ళని ( Hidimbha Movie Review and Rating ) పట్టుకుంటాడు. వాళ్ళని పట్టుకున్న తర్వాత కేసు క్లోజ్ అనుకుంటారు.అయినా కూడా నగరంలో కిడ్నాప్లు జరుగుతూ ఉంటాయి. అయితే అసలు అమ్మాయిలని కిడ్నాప్ చేస్తున్నది ఎవరు? అభయ్, ఆద్య ముందు ప్రేమించుకుని ఎందుకు విడిపోయారు? వీళ్ళిద్దరూ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలైన విలన్ ని పట్టుకుంటారా? ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

hidimbha-movie-review-and-rating

సినిమా ఎలా ఉందంటే..

ఈ సినిమాలో అశ్విన్ బాబు పర్సనాలిటీ గాని, అతని నటన గాని, ఫైట్స్ గానీ అన్నీ కూడా ఎన్నో రెట్లు ఇంప్రూవ్ అయ్యాయి. తనని తాను ఒక మంచి నటుడుగా.. తన టాలెంట్ ని చూపించుకోవడానికి ఈ సినిమా ఎంతగానో దోహద పడింది.. అశ్విన్ బాబు ఈ సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా చాలా బాగా సూట్ అయ్యాడు. అలాగే కళాబండా లో జరిగే ఫైట్ చాలా అద్భుతంగా చేశాడు. ఈ ఫైట్ లో అశ్విన్ బాబుని చూస్తుంటే ఏదో ఒక చిన్న హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా.. మినిమం ఒక రేంజ్ క్రేజ్ ఉన్న హీరో సినిమా చూస్తున్నట్టే ఫీలింగ్ రప్పించగలిగాడు. అయితే కాలాబండ లాంటి ప్రదేశానికి వెళ్లి.. వాళ్లను టచ్ చేయడానికి పొలిటిషన్లు ( Hidimbha Movie Review and Rating ) కూడా భయపడే విధంగా.. సీఎం కూడా ఎందుకు నన్ను అడక్కుండా కాలబండలో అడుగుపెట్టారు అని అడిగాడు గాని.. కానీ సినిమాలో పొలిటిషన్స్ కూడా దానికి గురించి అంత భయపడిపోయేంతగా అక్కడ అంత మంది, అన్ని బలాలు,అన్ని ఆయుధాలు ఏవి ఉన్నట్టు పెద్దగా కనిపించలేదు. అది ఒక చిన్నప్లేసులో.. చిన్నచిన్న ఇల్లులు దగ్గరగా ఉన్నట్టు.. అక్కడ కొంతమంది రౌడీలు ఉన్నట్టు మాత్రమే చూపించగలిగారు. చెప్పడానికి చాలా బిల్డ్ అప్ గా చెప్పిన ఆ కాలాబండా స్టోరీ అయితే చూపించడానికి అంత గొప్పగా చూపించలేకపోయారు..

See also  Pooja Hegde: దరిద్రంతో డాన్స్ చేస్తున్న పూజా.! రౌడీ బాయ్ తో చేతులారా బ్లాక్ బాస్టర్ హిట్ ను చేజార్చుకుంది గా..

ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఒక పాటలో రొమాన్స్ బాగా చూపించారు. ఇది యూత్ ని బాగానే అట్రాక్ట్ చేసుకుంటాది. కానీ హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమించుకుని.. విడిపోయినట్టు చూపిస్తాడు గాని.. వాళ్ళు ఏ రీజన్ మీద విడిపోయారు అనేది ఏమి గొడవలు కూడా చూపించకపోవడంతో సినిమాలో కొంచెంసేపు.. ఈ విషయాన్ని చూపించడం మరచిపోయారా అనిపించింది. అంతే కాకుండా వీళ్లిద్దరి లవ్ స్టోరీ ని పెద్దగా చూపించకపోగా.. చూపించిన కొంచెం షేపులో కూడా వీళ్ళు ముందు లవ్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంది కానీ.. వాళ్ళ ప్రేమని అట్రాక్ట్ గా చూపించలేకపోయారు. ఇది యాక్షన్ త్రిల్లర్ సినిమా అయినప్పటికీ.. బాక్రౌండ్ మ్యూజిక్ ఏమి పెద్దగా భయపెట్టే విధంగా లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ పరవాలేదు బాగానే ఉంది. సినిమా అసలు కథ సెకండ్ హాఫ్ నుంచి మొదలయ్యింది.

ఫ్లాష్ బ్యాక్ లో అసలైన కథ మొత్తం చూపిస్తారు. కానీ.. ఎదో ఓటీటీ లో చూసే సీరియల్స్ కంటే కూడా బోర్ కొట్టేలా ఫ్లాష్ బ్యాక్ చూపించాడు. హీరోయిన్ నందిత శ్వేత తనవరకు తాను బాగానే నటించింది. ఒక పోలీస్ అధికారిగా తన తపన, నటన అన్నీ బాగానే ఉన్నాయి. సినిమాలో ఒక పాటలో ఎక్సపోజ్ కూడా బాగానే చేసింది. కేరళలో ఫైట్ కూడా బాగుంది. హీరో రాళ్లు కొరికేసి పొడి చేసేసి మరీ ఫైట్ ని బాగా చూపించాలని బాగానే చూపించారు. సినిమాలో ఆఖరి ఘట్టం తేలిపోయినట్టు అనిపించింది. ఈరోజుల్లో ఎదో ఒక స్పెషల్, కొత్తదనం, సస్పెన్సు లేకపోతే ఆడియన్స్ ని మెప్పించడం కష్టమని రచయితలు, దర్శకులు ఫిక్స్ అవుతున్నారు. ఆ క్రమంలోనే ఈ సినిమా కథని.. ఎందుకు? ఎవరు? అనే రెండు పాయింట్స్ కొంచెం కొత్తగా.. డిఫరెంట్ గా ఉండాలని చూసుకున్నారు.

See also  Gangstar: హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ...

కథ బాగానే ఉంది గాని.. సినిమాలో కొన్ని సీన్స్ తప్ప.. మిగినది తీయడంలో అంత ప్రతిభ కనిపించలేదు. కామెడీ కూడా ఎక్కువగా లేదు. సెంటిమెంట్ అయితే అసలు సరిగ్గా పండలేదు. క్లైమాక్స్ చూపించిన విధానం పెద్ద మైనస్ సినిమాకి.. అయితే ఈ సినిమాని మొత్తం మోసింది అంతా హీరో హీరోయిన్ మాత్రమే. ఇక ( Hidimbha Movie Review and Rating ) కాలబండా, ఆర్గాన్స్ అమ్ముకునే స్టోరీ సినిమాలో తప్పక ఇరికించినట్టు.. అవసరానికి ఆ కాన్సెప్ట్ ని వాడేసుకుని.. ట్రాక్ మారాక దానితో పని లేదన్నట్టు.. ఆ సమస్యకి పరిష్కారం గాని.. దానిలో ఉన్న వాళ్ళని పనిష్ చేయడం గాని.. ఏమి చూపించకపోవడం సినిమాలో చాలా ఎగతాళిగా అనిపించింది. మొత్తం మీద సినిమా యావరేజ్ గా ఉంది. ఎదో టైం పాస్ కి చూడాలి అనుకుంటే చూడచ్చు గాని.. పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయింది.

రేటింగ్; 2. 25/ 5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే.. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..