Home Devotional భోగ భాగ్యాలతో భోగి.

భోగ భాగ్యాలతో భోగి.

భోగ భాగ్యాలతో భోగి.

భోగి దక్షిణ భారతదేశంలో హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి. భోగి లేదా భోగి పండుగ అంటూ వ్యవహరిస్తారు. ముఖ్యంగా తెలుగు వారికి ఇది అత్యంత ప్రీతికరమైన పండుగ ఈ పండుగ జనవరి 13 లేదా 14 న వస్తుంటుంది దీని తర్వాత సంక్రాంతి లేద మకర సంక్రాంతి ఆ తర్వాత చివరి రోజు కనుమ ఇలా మూడు రోజులు కన్నుల విందుగా పండుగను భక్తిశ్రద్ధలతో చేస్తారు. హిందూ పండుగలో ఏ పండుగ కైనా ఒక సైంటిఫిక్ రీజన్ శాస్త్రీయత ఉంటుంది. భోగి పండుగ కూడా అలాంటి శాస్త్రీయత ఉంది. మన భూమికి సూర్యుడు దక్షిణాయంలో రోజు రోజుకి దూరం జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ చలి బాగా పెరుగుతుంది ఆ చలి పెరగడానికి సంకేతంగా వాతావరణంలో మార్పు కనుగుణంగా చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు మంట రాజేస్తుంటారు. చలి నుండి ఉపశమనం పొందడానికి సెగలు కక్కి భగ భగ మండే మంటలను వెలిగేస్తుంటారు. అలా ఇలాంటి మంటలు వేయడం వల్ల భోగి అనే పేరు వచ్చింది.

See also  Raksha Bandhan 2023 : ఈ ఏడాది రాఖి పండుగ ఏ రోజో.. ఎందుకు అదేరోజో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే..

సాధారణంగా భోగము అంటే అనుభవము, మనము ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనివల్ల ఆనందాన్ని పొందుతామో దానినే భోగము అంటారు. అలాంటి భోగములను అనుభవించే రోజు భోగి. పూర్వం భోగి పండుగ ఆవు పిడకల తోటి ఆవు నెయ్యి తోటి తాటి ఆకులతో ఇంట్లో పాత వస్తువులతో జరుపుకునేవారు. ఉదయాన్నే మూడు గంటల నుండి ఐదు గంటల వరకు విపరీతమైన చలి తట్టుకొని భోగి మంటలను ఆస్వాదిస్తారు. ఉదయాన్నే భోగి మంటలకు కావాల్సిన తాటి ఆకులను కర్ర చెక్కలు లేదా మొద్దులను ఇంట్లో పాడైపోయిన వస్తువులను రాత్రికే సిద్ధం చేసుకుని ఉంటాము ఉదయాన్నే లేవగానే వాటితో భోగి మంటలు జరుపుకుంటాము.

ఉదయాన్నే లేచి చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా వేడివేడి నీళ్లు కాచుకొని తల స్నానం చేసి పండుగ పూట కొత్త బట్టలు ధరిస్తాం. ఇక తెలుగువారి తెలుగింటి పండుగ సంక్రాంతి మూడు రోజుల ముచ్చటైన పండుగ అందులో మొదటిది భోగి పండుగ. ఆడవారి గురించి అయితే చెప్పనక్కర్లేదు భోగి వచ్చిందంటే చాలు ఏ ముగ్గు వేయాలి? ఎలాంటి ముగ్గు వేయాలి ఎప్పుడు లేవాలి పూజలు ఎప్పుడు చేసుకోవాలి అంటూ నానా హంగామా నడుస్తుంది మన ఇళ్లలో, రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు కొత్త ముగ్గు వేయాలని పెద్దగా వేయాలని ఆరాటపడుతుంటారు మన ఆడవాళ్లు. భోగి రోజున మన ఇళ్లలో పిల్లలకు భోగి పళ్ళు సమర్పిస్తుంటారు భోగి పళ్ళు తలపై పోస్తుంటారు భోగిపళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణ ఆశీర్వాదంగా  మనం విశ్వసిస్తాము. ఇక కోడిపందాల విషయానికొస్తే మన ఆంధ్రాలో చెప్పనక్కర్లేదు సంవత్సరమంతా కాజు పిస్తా వేసి పుంజులను బలంగా తయారు చేసేది ఈ రోజు కోసమే ఈ రోజు చాలామందికి అదృష్టం వెంటాడొచ్చు దురదృష్టం వెంటాడవచ్చు కోడిపందాల రూపంలో అయినా తగ్గేదే లేదంటూ కోడిపందాలు నిర్వహిస్తారు ఒక్కోచోట ఒక్కో ఆచారం మన సైడు కోడిపందాలు చాలా ఫేమస్ మన ఆత్మ గౌరవం కూడా మన పండుగ. ఇది ఏదో నిన్న ఇవాళ వచ్చింది కాదు తరతరాల మన పూర్వీకుల ఆచారం మన సాంప్రదాయం. జీవహింస అని మొరిగే కుక్కలు కోడిపందాలపై తెగ అక్కసు వెలదీస్తుంటారు ఇలాంటి వాళ్ళకి మనం ఒకటే చెప్పాలి మనం తల్లిగా భావించే గోమాతని కొందరు వేలల్లో లక్షల్లో వధిస్తుంటే అప్పుడు ఏం పీకుతున్నారని ప్రతి ఒక్క హిందువు నిలదీయాలి.

See also  ఫిబ్రవరి 2023 నుంచి ఈ మూడు రాశుల వారికి అదిరిపోతుంది...

ఇక గాలిపటాల విషయానికొస్తే పిల్లలు గాలిపటాలు ఎగరేయాలనే ఆ ఉత్సాహం ఆ ఉరకలు ఒక రేంజ్ లో ఉంటాయి మనం ఆ స్టేజ్ నుంచే వచ్చాము చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేయాలంటే ఆ సంతోషం పట్టరానిది స్కూల్లకు సెలవులు వస్తాయి ఎప్పుడు ఎప్పుడు అనేది చూసిన మన పండుగ రానే వచ్చింది ఇక గాలిపటం తీసుకుని ఆ గాల్లో అందరికంటే ఫస్ట్ మనదే ఉండాలని ఎగరేస్తుంటాం. కానీ ఈ గాలిపటాలు కూడా ఎగరయ్యొద్దు పక్షులకు హానికరం అంటూ కొందరు పర్యావరణ ప్రేమికులు వస్తుంటారు కేవలం హిందూ పండుగల అప్పుడే వీళ్ళు బయటికి వస్తారు మరి ఇతర మతాల పండగలలో వీళ్ళు వేలు పెట్టరు. ఎవ్వరేమనుకున్నా మన పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని తరతరాలుగా భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత భోగి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు.

See also  Ganesh Chaturthi 2023 : వినాయకచవితి రోజు ఏ రాశి వారు ఎలా వినాయకుడిని పూజిస్తే అదృష్టం కలుగుతుందంటే..