Home Cinema Raashii Khanna: బడా ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళవలసిన రాశీ ఖన్నా ఆ హీరో ప్రేమ వల్లే...

Raashii Khanna: బడా ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళవలసిన రాశీ ఖన్నా ఆ హీరో ప్రేమ వల్లే మోసపోయిందా.?

Actress Rashi Kanna: అవును ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతున్న వార్త. అందుకు కారణం లేకపోలేదు.. అదేంటంటే.. ఇటీవలే రాశీ ఖన్నా పాల్గొన్న ఓ ఇంటర్వూలో భాగంగా తను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం గురించి బహిర్గతం చేసింది. ఇక కేవలం అతనితో ప్రేమలో పడ్డాకే నేను బరువు తగ్గానని, అతన్ని పెళ్ళి చేసుకోవడం కోసమే నేను అతనికి తగ్గట్టు అన్ని రకాలుగా రెడీ గా ఉన్నానని, అతడు కూడా నా అభిప్రాయాలను అంగీరిస్తూ గౌరవిస్తాడని, అతనికి నేను అంటే నాకు అతడు సరియైన జోడి అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది.

actress-rashi-kanna-who-was-supposed-to-be-the-daughter-in-law-of-a-big-family-fell-in-love-with-that-hero-and-was-deceived

ఇక ఈ విషయాలనే కాకుండా గతంలో తన ప్రేమ గురించి ఆ ప్రేమ ఎందుకు విఫలమయ్యింది అనే సంచలనమైన విషయాలను సైతం వెల్లడించింది. ఐతే గతంలో అతనితో ప్రేమలో పడి ఆ ప్రేమ బ్రేకప్ అవ్వడం వల్ల విపరీతమైన ఒత్తికి గురయ్యానని చెప్పుకొచ్చింది. అందువల్ల నేను బాగా లావు పెరిగి చివరకు సినిమాలకు కూడా దూరమయ్యాను అని పేర్కొంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా రకరకాల ఎక్ససైజ్లు చేసినప్పటికీ, డైటింగ్ లు చేస్తున్నప్పటికీ లావు మాత్రం తగ్గలేకపోయానని తెలిపింది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తితో ప్రేమలో పడ్డానో మళ్ళీ అప్పటి నుండి బరువు అవలీలగా తగ్గిపోయానంటూ తెలిపింది.

See also  Hansika: క్లోజ్ ఫ్రెండ్ మాజీ భర్తతోనే హన్సిక.. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు!

actress-rashi-kanna-who-was-supposed-to-be-the-daughter-in-law-of-a-big-family-fell-in-love-with-that-hero-and-was-deceived

ఐతే రాశీ ఖన్నా చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే.. రాశీ ఖన్నా గతంలో ప్రేమించినటువంటి అతడు సాయి ధరమ్ తేజ్ అని అర్ధం అవుతుందంటూ నెట్టింట ఓ వార్త ఐతే వైరల్ గా మారింది. ఇక ఈ వార్త ఇప్పుడు మాత్రమే కాదు సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నా వీళ్ళిద్దరూ కలిసి నటించింది సుప్రీమ్ సినిమా అప్పటి నుండే వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఎఫైర్ కొనసాగుతుందంటూ వార్తలు వినిపించ సాగాయి.. సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నా లు డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. అలా వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ వీళ్లిద్దరూ ఆ వార్తలపై స్పందించక పోయేసరికి ఆ వార్తలను నిజమని నమ్మేశారు.

See also  Keerthy Suresh: దసరా సినిమాలో నటించాక.. ఆ హీరో పై మనసు పడిపోయానంటున్న కీర్తి సురేష్!

actress-rashi-kanna-who-was-supposed-to-be-the-daughter-in-law-of-a-big-family-fell-in-love-with-that-hero-and-was-deceived

కాగా వీళ్లిద్దరి మధ్య కొన్నాళ్ల పాటు ప్రేమ కొనసాగిందని కానీ వీళ్లు ఆ బంధాన్ని సీరియస్ గా తీసుకోలేక వీళ్ళిద్దరి మధ్యల అభిప్రాయ బేధాలు వచ్చాయని అందుకే వీళ్లిద్దరు విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ బాధ నుండి కోలుకోకనే రాశి ఖన్నా చాలా కాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు గుసగుసలు పెట్టాయి. ఒక వేళ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ సవ్యంగా కొనసాగితే లావణ్య త్రిపాఠి లాగే మెగా ఫ్యామిలీకి రాశీ కన్నా కూడా కోడలుగా వెళ్లేదని పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మరొక్క సారి రాశీ కన్నా ప్రేమ వ్యవహారం బయట పెట్టడంతో ఒకప్పుడు రాశీ ఖన్నా (Actress Rashi Kanna) ప్రేమ విఫలమయ్యింది సాయి ధరమ్ తేజ్ తో అనే వాదనలు కామెంట్స్ రూపంలో వినిపిస్తున్నాయి.