Home Health నోరూరించే వంకాయ బజ్టీ

నోరూరించే వంకాయ బజ్టీ

నోరు ఊరించే వంకాయ బజ్టి 

హాయ్.!!! అండి గుడ్ ఈవెనింగ్. ఈ వినింగ్ సమయంలో స్నాక్స్ తినాలని ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే తేలిగ్గా సులభంగా వంకాయ బజ్జి చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది. వంకాయ బజ్జి చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా కమ్మగా తింటారు ఇప్పుడు వంకాయ బజ్జీ ఎలా చేయాలో మనం తెలుసుకుందామా.???

వంకాయ బజ్జి తయారీ విధానం:

వంకాయ బజ్జికి కావాల్సిన పదార్థాలు:

శనగపిండి ఒక కప్పు

బియ్యం పిండి ఒక కప్పు

పొడుగుటి – వంకాయలు – అరకిలో

కారం ఒక టీ స్పూన్

ఉప్పు తగినంత

ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్

See also  మన గుండె ఆరోగ్యం కోసం పురుషులు చేయవలసిన కనీస జాగ్రత్తలు.

కరివేపాకు రెండు రెబ్బలు

కొత్తిమీర రెండు రెబ్బలు

ఉల్లిగడ్డ -2

వంట సోడా తగినంత

చింతపండు రసం -2 స్పూన్లు

ఒక టేబుల్ స్పూన్ నూనె

వాము ఒక టీ స్పూన్

పల్లీలు తగినన్ని.

వంకాయ బజ్జి తయారీ విధానంలోకి వెళదామా. . . . .

మనం ఒక బౌల్ లోకి ఒక కప్పు శెనగపిండి అందులో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. వంట సోడా ఒక టీ స్పూన్ తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ నూనె వేసుకొని కలపాలి.

అందులో నీళ్లు పోసి పిండిని బజ్జి పిండిలా బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసంలో ఉప్పు , ధనియాల పౌడర్ , కారం , వామ వీటన్నిటిని వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

See also  WOW. యాలకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

ఇప్పుడు వంకాయలను తొడిమలతో సహా బాగా శుభ్రంగా కడుక్కోని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. వంకాయలను ఇప్పుడు మధ్య భాగంలో సగానికి చాకుతో కాటు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను నూనెలో వేసి మధ్యస్తు మంట మీద ఎర్రగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

ఇలా కాల్చుకున్న వంకాయలు చల్లార్చిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు మిశ్రమంతో స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ కలాయిలో నూనె తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకోవాలి.

See also  Green Tea: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.?

నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసిన శెనగపిండి లో ఎర్రగా వేయించిన వంకాయలను శనగ పిండిలో ముంచి నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

అదే నూనెలో పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ తురుము, కొత్తిమీర తురుము చివరగా వంకాయ బజ్జి మధ్యలో పల్లీలు ఉల్లిగడ్డ తురుము కొత్తిమీర తురుము పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన వంకాయ బజ్జి ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో వంకాయ బజ్జి తయారయింది.

ఎప్పుడు మిరపకాయ బజ్జి కాకుండా ఇలా వంకాయ బజ్జీని కూడా చేసుకోండి పిల్లలకు టేస్టీగా కమ్మగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ తింటారండీ బాబూ