Hidimba : సినీ అభిమానులు ఎప్పుడు ఎలాంటి సినిమాలు అభిమానిస్తారో, ఆదరిస్తారో చెప్పలేం. వీళ్ళ అభిప్రాయంతోనే సినిమా రంగం మొత్తం నడుస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలు ఒకసారి బాగా ఆడితే, హర్రర్ సినిమాలు ఒకసారి బాగా ఆడితే, ఫ్యామిలీ మూవీస్ ఒక్కొక్కసారి బాగా ఆడితే.. ఇలా ( Hidimba movie the beginning of new records ) ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే లో బడ్జెట్ సినిమాలు హవా నడుస్తుంది. భారీ భారీ బడ్జెట్లో భారీ భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. అసలు ఆ సినిమా పేరు ఒకటి ఉందని తెలియకుండా.. సడన్ గా వచ్చిన సినిమాలన్నీ బాగుంటే.. మౌత్ కాన్వాసింగ్తోనే సినిమాకి అనేక కోట్లు రాబడి రప్పిస్తున్నారు ఆడియన్స్.
మూడు వారాల క్రితం సామజవరగమన అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకి పోటీగా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్పై వచ్చింది. కానీ ఆ సినిమాతో ఈ సినిమా ఎలా పోటీ పడుతుంది అని అనుకున్న తరుణంలో.. ఆ సినిమాను ఒక పక్కకు తోసేసి, సామజవరగమన సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమా బడ్జెట్ను బట్టి చూస్తే ( Hidimba movie the beginning of new records ) వసూళ్లు తారాస్థాయికి చేరుకున్నట్టే. ఇప్పటికీ ఆ సినిమా కొన్ని సినిమా హాల్స్ లో నడుస్తూ.. వసూళ్లు తీసుకుని వస్తుంది. ఇది ఇలా ఉంటే.. సినిమా 50 కోట్ల గ్రాస్ వసూళ్ల వరకు తీసుకొని పోగా.. యూఎస్ లో అయితే మిలియన్ డాలర్ల రూపంలో తీసుకొని వస్తుంది. ఒక సినిమా నుంచి ఇలాంటి రిజల్ట్ అనేది ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
అలాగే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన బేబీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదరగొడుతుంది. ఈ సినిమాలో పెద్ద నటీనటులు లేకపోయినా.. చిన్న చిన్న తారలతో సూపర్ హిట్ కొట్టింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన బేబీ సినిమా యూత్ ని ( Hidimba movie the beginning of new records ) విపరీతంగా ఆకట్టుకుంది. యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి కాదు.. రిపీట్ రిపీట్ గా చూస్తున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి గ్రూపులు గ్రూపులుగా ఈ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ మూడు వారాల్లోనే రెండు సినిమాలు.. లో బడ్జెట్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక రేపు హిడింబ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అనేది ఒకటి ఉందని.. ఇలాంటి పేరుతో సినిమా వస్తుందని కూడా మొన్నటి వరకు ఎవరికీ తెలియదు.
ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో.. అప్పటినుంచి ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. హిడింబ సినిమాకి మంచి బజ్ నడుస్తుంది. ఇంతకుముందు అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్ లాంటి సినిమాలు రూపొందించిన అనిల్ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సామజవరగమన సినిమాని ప్రొడ్యూస్ చేసిన అనిల్ సుంకర్నే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ వస్తే.. మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. సామజవరగమన, బేబీ, సినిమాల్లాగా ఈ సినిమాను కూడా ఆడియన్స్ ఆదరించి.. ఆడియన్స్ మన్నన గాని ఈ సినిమా పొందగలిగి కలెక్షన్స్ వసూలు రాబడితే.. లో బడ్జెట్ మీద రావడమే కాకుండా.. నాలుగు వారాల్లో మూడు లో బడ్జెట్ సినిమాలు సూపర్ హిట్ అయిన రికార్డ్ కూడా సృష్టించబడుతుంది. హిడింబ సినిమాలో అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో..