Home News పండగ పూట విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కమ్మటి మాట. VD12 ఆ దర్శకుడితోనే

పండగ పూట విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కమ్మటి మాట. VD12 ఆ దర్శకుడితోనే

పండగ పూట విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కమ్మటి మాట, VD12 ఆ దర్శకుడితోనే.

నిన్ననే మనం ఖుషి సినిమా గురించి, మాట్లాడుకున్నాము విజయ్ దేవరకొండ కెరియర్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఖుషి సినిమా తనకు ఒక పెద్ద అడుగుగా పైకి ఎదగడానికి ఒక మెట్టుగా భావించాలని మాట్లాడుకుందాం ఆ సినిమాలు అంచనాలను బట్టి విజయ్ దేవరకొండ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని తెలుసుకున్నాం. అలా నిన్న విజయ్ దేవరకొండ గురించి పోస్టు రాసాము లేదో ఇవాళ సంక్రాంతి పండగ మనకు తెలుగు ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ అభిమానులకు సంక్రాంతి పండుగ కానుక అందించాడు. తన కొత్త లుక్ తో విజయ్ దేవరకొండ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అదే VD 12.

See also  Bichagadu : ఈ బిచ్చగాడు దానం చేసిన డబ్బు ఎన్ని లక్షలు అంటే.. చివరికి కలెక్టర్..

చాలా గ్యాప్ తీసుకున్న తరువాత లైగర్ సినిమాతో మంచి హిట్టు కొట్టి పాన్ ఇండియాలో జెండా పాతుదామనుకున్న విజయ్ దేవరకొండ కి పెద్ద దెబ్బ తగలడంతో అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు రాలేకపోతున్నాయి. ప్రస్తుతానికైతే ఖుషి సినిమా చేతిలో ఉంది కానీ సమంత ఆరోగ్య దృష్యా అది మరింత టైం పట్టేలా ఉంది తన ఆరోగ్యం కుదుటపడితేనే షూటింగ్ సెట్లో అడుగుపెడుతుంది సమంత, ఇదిలా ఉండగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి ఆ వార్తలే నేడు నిజమయ్యాయి. నేడు అనగా శుక్రవారం పండుగ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదే VD 12 వర్కింగ్ టైటిల్ తో సితార ఎంటర్టైన్మెంట్ తోటి త్వరలో ఈ సినిమా బండి పట్టాలెక్కనుంది.

See also  Nellore MCA student: ఎంసిఏ స్టూడెంట్.. కన్నబిడ్డని ఎందుకు ఎలా చంపిందో తెలిస్తే అసహ్యించుకుంటారు..

ఈ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది దీంట్లో విజయ్ దేవరకొండ చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మనకు కనిపిస్తున్నాడు. పోస్టర్లో కనిపిస్తున్న టైటిల్ మాత్రం అభిమానులకు ఆసక్తి కలిగించే విధంగా ఉంది, అదేంటంటే ” నేను ఎవరిని మోసం చేస్తున్నానో చెప్పేందుకు నేను ఎక్కడి వాడినో నాకు తెలియదు “. త్వరలోనే టైటిల్, దానికి సంబంధించిన స్టోరీ, హీరోయిన్ ఎవరనేది వివరాలు తెలియనుంది.

ఇదిలాగుంటే.! రామ్ చరణ్ హీరోగా గతేడాది గౌతమ్ ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే, అయితే రామ్ చరణ్ ఈ భారీ ప్రాజెక్టులో భాగం కాలేకపోయాడు దాంతో ఆ స్థానాల్లో విజయ్ దేవరకొండను తీసుకున్నారని ప్రచారం సాగుతుంది. మరిప్పుడు ఈ ప్రకటన రావడంతో రామ్ చరణ్ నటించిన స్టోరీ తో విజయ్ దేవరకొండ ను ఉంచే తీస్తారా లేదా విజయ దేవరకొండకు తగ్గట్టు మళ్ళీ స్టోరీ ఏమన్నా రాస్తారా అనేది తెలియనిది. అయితే నాని హీరోగా గౌతమ్ తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది జెర్సీ. దీంతో విజయ నటిస్తున్న తదుపరి చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

See also  Samantha: మళ్ళీ రంగంలోకి దిగిన సామ్ - జిమ్ లో అదరగొడుతుంది.